Srinivas Goud: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించకుండా బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీలను అన్యాయం చేస్తున్నాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) మండిపడ్డారు. హైద్రాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీల రాజకీయ యుద్ధభేరి – చలో హైద్రాబాద్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లను తగ్గించడం అన్యాయమన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించే చట్టాన్ని పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదించాలనే ప్రధాన డిమాండ్ తో ధర్నా చేపట్టామన్నారు.
Also Read: Srinivas Goud: బీసీరిజర్వేషన్లుకు చట్టబద్దత కల్పించాలి.. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసింది
కేంద్రంలో బీసీల కొరకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదు, ప్రత్యేక బడ్జెట్ లేదన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 80% ఉన్న బీసీలకు 20% రిజర్వేషన్లు, 20% ఉన్న వారికి 80% రిజర్వేషన్లు ఉన్నాయన్నారు. తమిళనాడు రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు లేవని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల కంటే దానిని 18 శాతంకు తగ్గించి బీసీలను మోసం చేసిందని విమర్శించారు.ః
న్యాయ స్థానాల్లో బీసీ లకు అవకాశం కల్పించాలి
ఈ నిర్ణయంతో రాస్ట్రంలో సుమారు 3వేల మంది బీసీలు సర్పంచ్ స్థానాలు కోల్పోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, ఉద్యోగం, స్థానిక సంస్థలలో, కాంట్రాక్టర్ లలో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. దేశంలో న్యాయ స్థానాల్లో బీసీ లకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మధుసూదనా చారి, బీసీ జేఏసీ నాయకులు గుజ్జ కృష్ణ, గణేష్ చారి, శేఖర్ సాగర్, పృధ్విరాజ్, విక్రమ్, శ్యామ్, మణి మంజరి, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
Also Read: Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
