Alleti Maheshwar Reddy: సాక్ష్యాధారాలతో నిరూపిస్తే రాజీనామా చేస్తా
Alleti Maheshwar Reddy (imagecredit:swetcha)
Political News, Telangana News

Alleti Maheshwar Reddy: హెచ్ఐఎల్‌టీ పై సాక్ష్యాధారాలతో నిరూపిస్తే రాజీనామా చేస్తా: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

Alleti Maheshwar Reddy: హైద‌రాబాద్ ఇండస్ట్రియల్‌ ల్యాండ్ ట్రాన్స్ ఫ‌ర్మేష‌న్(HILT) పాలసీని సాక్ష్యాధారాలతో నిరూపిస్తానని, నిరూపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Yeleti Maheshwar Reddy) మరోసారి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy)కి సవాల్ విసిరారు. నిరూపిస్తే మంత్రి ఉత్తమ్ రాజకీయ సన్యాసం తీసుకుంటారా? ఆయనకు దమ్ముందా? అని సవాల్ విసిరారు. ఈ అంశంపై శనివారం అసెంబ్లీలో చర్చకు రావాలని మంత్రి ఉత్తమ్ ను ఏలేటి ఇటీవల సవాల్ విసిరారు. ఈనేపథ్యంలో ఆయన అసెంబ్లీకి వచ్చి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరిట కుర్చీలు వేసి వారి రాక కోసం ఎదురుచూశారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. సాక్ష్యాధారాలతో తాను వచ్చానని, ఉత్తమ్ కు దమ్ముంటే సబ్ కమిటీ మంత్రులతో అసెంబ్లీకి రావాలన్నారు.

సబ్ కమిటీ వేశారా?

బీజేపీకి అవగాహన లేదని ఉత్తమ్ మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. చీకటి జీవోతో భూములను కొల్లగొట్టేందుకు పథకం ప్రకారం ప్లాన్ చేశారంటూ ఏలేటి ఆరోపించారు. రూ.6.29 లక్షల కోట్ల రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో చర్చకు డిప్యూటీ సీఎం భట్టి మంత్రి ఉత్తమ్ రాలేదని, వారికి ధైర్యం లేదా? లేక సబ్జెక్ట్ లేదా? అని విమర్శించారు. అసెంబ్లీకి రాలేదంటే అవినీతి జరిగిందని స్పష్టవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. హెచ్ఐఎల్ టీపై సబ్ కమిటీ వేశారా? వేస్తే సబ్ కమిటీ విధివిధానాలు ఏంటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సబ్ కమిటీలో భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి నలుగురు మంత్రులు ఉన్నారన్నారు. దుర్యోధనుడు, దుశ్యాసనుడు, కర్ణుడు, శకునిలా వీరు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సబ్ కమిటీలో ఉన్న ఈ నలుగురుకీ లై డిటెక్టర్ తో టెస్ట్ చేపట్టాలని అప్పుడే హెచ్ఐఎల్ టీ స్కాం మొత్తం బయట పడుతుందన్నారు.

Also Read: Uppalapati Satish Case: ఉప్పలపాటి సతీష్ కేసులో బిగ్ ట్విస్ట్.. తెర వెనుక అండగా ఎస్ఐ.. పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చ

బూటక సబ్ కమిటీని నియమించి..

లై డిటెక్టర్ టెస్ట్‌కు సబ్ కమిటీ మంత్రులు సిద్ధమా? అని ఏలేటి సవాల్ విసిరారు. హెచ్ఐఎల్ టీపై న్యాయ పోరాటం చేస్తూనే, ప్రజా పోరాటాలు నిర్మిస్తామన్నారు. బీఆర్ఎస్ అవినీతిని కక్కిస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి చేతులు నేడు చచ్చుబడ్డాయా? అని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. రేవంత్ కు, బీఆర్ఎస్ కు మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరిందని ప్రశ్నించారు. రూ.6.29 లక్షల కోట్ల ప్రజాధనాన్ని రూ.5 వేల కోట్లకు ధారాదత్తం ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. హెచ్ఐఎల్ టీపై రాత్రికి రాత్రే జీవో 27 తెచ్చి లక్షల కోట్లు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. టీజీఐసీ ఉండగా ఈ సబ్ కమిటీ ఎందుకు వేసినట్లని నిలదీశారు. బూటక సబ్ కమిటీని నియమించి రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వమంటదే రియల్ ఎస్టేట్ వ్యాపారమా? రియల్ ఎస్టేట్ దందానా? అని ఏలేటి నిలదీశారు. ముఖ్యమంత్రి, మంత్రి మండలి కలిసి రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదను సర్వ నాశనం చేస్తున్నారని ఫైరయ్యారు. ముఖ్యమంత్రి ల్యాండ్ మాఫియా, ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారన్నారు. హెచ్ఐఎల్ టీలో ముఖ్యమంత్రి, మంత్రి మండలి, హై కమాండ్ వాటాలెంతో బయట పెట్టాలన్నారు. హెచ్ఐఎల్ టీపై ఎప్పుడొచ్చినా తాను చర్చకు సిద్ధమని ఏలేటి స్పష్టంచేశారు.

కుర్చీలకు స్టిక్కర్లు

బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీరుపై అసెంబ్లీ సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ పేర్లతో ప్రత్యేక కుర్చీలు వేయించడం అసెంబ్లీ గైడ్ లైన్స్ కు విరుద్ధమని అనుమతి ఇచ్చేందుకు నిరాకరించారు. కాగా చైర్ల కు స్టిక్కర్ వేస్తే వచ్చిన అభ్యంతరం ఏంటని సిబ్బంది ఏలేటి ప్రశ్నించారు. కుర్చీలకు స్టిక్కర్లు వేయకూడదని రూల్స్ లో ఏమైనా ఉందా? అని నిలదీశారు. ఇలా చేయడం సరికాదని ఏలేటికి వారు వివరించిన అనంతరం భట్టి, ఉత్తమ్ ల పేర్లతో ఉన్న కుర్చీలను తొలగించారు.

Also Read: Ginger Benefits: ఒక్క అల్లం ముక్కతో చలికాలంలో వచ్చే సమస్యలకు చెక్ పెట్టండి!

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!