Modi released books on venkayya naidu
జాతీయం

National:వెంకయ్యనాయుడు జీవితం స్ఫూర్తిదాయకం

  • వెంకయ్యనాయుడు జీవిత ప్రస్థానంపై పుస్తకావిష్కరణ చేసిన మోదీ
  • హైదరాబాద్‌ గచ్చిబౌలిలో జరిగిన కార్యక్రమం
  • ఈ పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయన్న ప్రధాని
  • ఏ శాఖ ఇచ్చినా ఆ పదవికే వన్నెతెచ్చారు
  • చాతుర్యం, మంచి వాగ్ధాటి కలిగిన వ్యక్తి
  • ఆర్డికల్ 370 బిల్లు రద్దు ఆమోదంలో వెంకయ్య పాత్ర కీలకం

Modi released 3 books on venkayya naidu with virtual and praised
కింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి వెంకయ్యనాయుడు అని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆదివారం మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 75 వ పుట్టినరోజు సందర్భంగా ..ఆయన జీవిత ప్రస్థానంపై రూపొందించిన మూడు పుస్తకాలను వర్చువల్ గా ప్రధాని విడుదల చేశారు. ‘సేవలో వెంకయ్యనాయుడు జీవితం’, ‘13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు లక్ష్యం, సందేశం’, ‘మహానేత వెంకయ్యనాయుడు జీవితం, ప్రయాణం’ అనే పుస్తకాలను మోదీ విడుదల చేశారు.దీనికి సంబంధించి హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌ సెంటర్‌లో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ‘వెంకయ్యనాయుడు గ్రామీణ ప్రాంతం నుంచి ఉన్నత స్థానానికి ఎదిగారు. వెంకయ్య జీవితంపై రూపొందించిన పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయి. ఇవి దేశ ప్రజలకు మార్గనిర్దేశం చేస్తాయి.

వెంకయ్యతో కలిసి పనిచేసే అవకాశం

వెంకయ్యనాయుడితో సుదీర్ఘకాలం పనిచేసే అవకాశం నాకు దక్కింది. వేలాది కార్యకర్తలు ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నారు. అత్యయిక పరిస్థితి వేళ ఆయన పోరాడారు. 17 నెలల జైలు జీవితం గడిపారు. గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖలో వెంకయ్యనాయుడు తనదైన ముద్ర వేశారు. స్వచ్ఛభారత్‌, అమృత్‌ యోజన వంటి ఎన్నో పథకాలు సమర్థంగా అమలు చేశారు. ఆయన వాగ్ధాటి ముందు ఎవరూ నిలవలేరు. వెంకయ్యనాయుడు పుస్తకాలు దేశ ప్రజలకు మార్గనిర్దేశం కావాలి. ఎమర్జెన్సీ సమయంలో వెంకయ్య నాయుడు ఎంతో పోరాటం చేశారు. 17 నెలలపాటు జైలు జీవితం సైతం గడిపారు. గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖలో వెంకయ్య చెరిగిపోని ముద్ర వేశారు. . స్వచ్ఛభారత్, అమృత్ యోజన లాంటి పథకాలను ఎంతో సమర్థవంతంగా అమలు చేశారు. చాతుర్యం, మంచి వాగ్దాటి కలిగిన మనిషి వెంకయ్యనాయుడు., ఆయనతో ఎవరూ సాటిరాలేరు.. రాజ్యసభ చైర్మన్ గా ఆయన సేవలను భారతీయులెవరూ మర్చిపోలేరు. ఆర్డికల్ 370 బిల్లు రద్దు ఆమోదంలో వెంకయ్య పాత్ర చాలా ఉంది. అని మోదీ వెంకయ్యనాయుడుని ప్రశంసలతో ముంచెత్తారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!