Harish Rao: బడి పిల్లలకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిల్లలకు పురుగుల అన్నం పెట్టిన ఘటనపై మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు(Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా సీరియస్ అయ్యారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్లు అని డబ్బా కొట్టుకునే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ముందు ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు పురుగులు లేని అన్నం పెట్టాలని డిమాండ్ చేశారు. సీఎం ఇక నుంచి నేనే సమీక్షలు చేస్తానన్న మీ మాటలేమయ్యాయి? విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకే అన్న బెదిరింపులేమయ్యాయి? అని ప్రశ్నించారు.
Also Read: Harish Rao: రాష్ట్రంలో అతి పెద్ద పవర్ కుంభకోణానికి రూపకల్పన: హరీష్ రావు
విద్యాశాఖపై ఎన్ని సార్లు సమీక్షలు చేసారు?
రెండేళ్లలో మీ వద్దనే ఉన్న విద్యాశాఖపై ఎన్ని సార్లు సమీక్షలు చేసారు? విద్యార్థులకు కల్తీ ఆహారం పెడుతున్న ఎంత మందిని జైలుకు పంపారు? మీ మాటలకు విలువ లేదు, ఆచరణకు దిక్కులేదు అని మండిపడ్డారు. బడిలో చదువుకోవాల్సిన విద్యార్థులు.. పురుగులన్నం మాకొద్దు అని రోడ్లెక్కి నిలదీస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా అసలు నువ్వేం చేస్తున్నట్లు? అని నిలదీశారు.
అన్నం పెట్టలేని సీఎం ఈ రాష్ట్రానికి ఉండి ఏం లాభం?
చిల్లర మాటలు చీప్ పాలిటిక్స్.. స్కీంలు లేవుగానీ.. ఎందులో చూసినా స్కాంలు అందిన కాడికి దండుకునే ప్లాన్లు.. వాటాలు, కమీషన్ల కోసం మీటింగులు.. ఇదే కదా 23నెలలుగా నువ్వు చేస్తున్నది రేవంత్ రెడ్డి? బడి పిల్లలకు సరిగ్గా అన్నం పెట్టలేని సీఎం ఈ రాష్ట్రానికి ఉండి ఏం లాభం? అని మండిపడ్డారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిల్లలకు పురుగులన్నం పెట్టిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Also Read: Harish Rao:మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం వెనుక జిలెటిన్ స్టిక్స్ కుట్ర : మాజీ మంత్రి హరీశ్ రావు
