cm praised indian cricket team
జాతీయం

Hyderabad: టీమ్ ఇండియాపై సీఎం ప్రశంసల జల్లు

CM Reventh reddy praise Indian Cricket Team for victory of world cup
దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో నిన్న భారత్ ఘనవిజయం సాధించింది. ఉత్కంఠభరితమైన ఫైనల్లో భారత్ గెలుపొందడంతో క్రికెట్ లవర్స్ సంబరానికి హద్దులే లేకుండా పోయాయి. టాపాకాయలు పేలుస్తూ మరోసారి దీపావళి పండగ జరుపుకున్నారు. టీమ్ ఇండియా రెండోసారి టీ20 ప్రపంచకప్ టైటిల్ సాధించింది.17 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత టీ 20 ప్రపంచకప్ గెలిచింది. టీ 20 ప్రపంచకప్‌లో మ్యాన్ ఆప్ ద మ్యాచ్ విరాట్ కోహ్లీ నిలిచారు. టీ 20 ప్రపంచకప్ మ్యాన్ ఆఫ్ టోర్నీ గా బుమ్రా నిలిచారు.

దేశానికి కీర్తిప్రతిష్టలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీ 20 వరల్డ్ కప్ విజయంపై అభినందనలు తెలియజేశారు. టీమిండియా దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిందని భారత జట్టుపై ప్రశంసల జల్లు కురిపించారు. క్రికెట్ ప్రపంచంలో భారత్ కు ఎదురులేదని నిరూపించారని రేవంత్ రెడ్డి టీమిండియాను కొనియాడారు. గతంలో ఉప్పల్ స్టేడియం లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ వీక్షించడానికి రేవంత్ రెడ్డి వెళ్లిన విషయం విదితమే. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆటవిడుపుగా యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి రేవంత్ రెడ్డి ఫుల్ బాల్ ఆడారు. ఇవన్నీ క్రీడలపై రేవంత్ రెడ్డికి ఉన్న అభిరుచిని తెలియజేస్తున్నాయి.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!