MLA Kadiyam Srihari: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), వరంగల్(Warangal) పర్యటనలో కడియం శ్రీహరిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తాను దమ్మున్న నాయకుడినని, అయ్య అండ చూసుకొని రాజకీయాలు చేయడం లేదని సెటైర్లు వేశారు.
నీ ఐడెంటిటి ఎక్కడిది?
కేసీఆర్(KCR) లేకపోతే నిన్ను అడిగేవారెవరు. కేసీఆర్ లేకపోతే నీ ఐడెంటిటి ఎక్కడిది? నాకు కుటుంబ రాజకీయాలు లేవు. స్వతహాగా ఎదిగొచ్చా. విలువల గురించి, నీతి గురించి నువ్వు మాట్లాడుతున్నావా. గత పదేళ్లలో ఎమ్మెల్యేలను చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చిన నువ్వా విలువల గురించి మాట్లాడేది. ఆ రోజు ఏం పీకుతున్నావ్. కేసీఆర్‌కు తప్పు అని ఎందుకు చెప్పలేదు. ఇప్పుడు మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. నీ నాయకత్వం పైన సందేహాలున్నాయి. నీ దగ్గర పని చేయలేకనే కవిత బయటకు వచ్చారు. నీపై నమ్మకం లేక హరీశ్ రావు బాధపడుతున్నారు అంటూ కేటీఆర్‌పై మండిపడ్డారు.
Also Read: S Thaman: థమన్‌పై ఈ ట్రోలింగ్ ఏంటి? ‘అఖండ 2 – రాజా సాబ్’ మధ్య ఈ పోలికలేంటి?
కేసీఆర్ కోసమే హరీశ్ రావు
అంతేకాదు, కేటీఆర్(KTR) అంటేనే ఐరన్ లెగ్ అని, ఎమ్మెల్యేలు అందరూ ఆయన నాయకత్వంలో పని చేయలేకపోతున్నారని వ్యాఖ్యానిచారు. కేసీఆర్ కోసమే హరీశ్ రావు(Harish Rao) బీఆర్ఎస్(BRS)లో ఉన్నారని, సమయం చూసి ఆయన దారి ఆయన చూసుకుంటారని జోస్యం చెప్పారు. కేటీఆర్(KTR) నాయకత్వం పనికి రాదని బీఆర్ఎస్ శ్రేణులకు బాగా తెలుసని, ఇప్పటికైనా అహంకారం తగ్గించుకుంటే మంచిదని కడియం శ్రీహరి హితవు పలికారు.

