Vegetable Prices: దడ పుట్టిస్తున్న కూరగాయల ధరలు
Vegetable Prices (imagecredit:swetcha)
Telangana News

Vegetable Prices: దడ పుట్టిస్తున్న కూరగాయల ధరలు.. సామాన్యుడు కొనేదెలా.. తినేదెలా..!

Vegetable Prices: కూరగాయల ధరలు సామాన్యులకు దడ పుట్టిస్తున్నాయి. వర్షాకాలంలో అధిక వర్షాల వల్ల కూరగాయల సాగుపై ప్రభావం పడింది. ప్రస్తుతమైన కూరగాయ ధరలు అదుపులోకి వస్తాయని ఆశిస్తున్న రేట్లు తగ్గకపోగా కేజీ రూ.100 దాకా ఉండడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో గత్యంతరం లేక పావు అరకిలో కొనుగోలుతో రోజులను నెట్టుకొస్తున్నారు. కేవలం కొద్దిరోజులు మాత్రమే ధరలు తగ్గుముఖం పడుతున్న తరచుగా రేట్లు పెరుగుతుండడంతో కూరగాయలు కొనలేని పరిస్థితి దాపురిస్తోంది.

అధిక వర్షాలు.. మొంథా తుపాన్ ప్రభావం

జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District)లో 3,200 ఎకరాల్లో వివిధ రకాల కూరగాయల పంటలను సాగు చేశారు. అధిక వర్షాలు మంతా తుపాన్ వల్ల పంట దిగుబడిలపై ప్రభావం చూపాయి. దీంతో కూరగాయల ధరలు తరచుగా పెరుగుతున్నాయి. రైతుల నుంచి తక్కువ ధరలకు వేలంలో కొనుగోలు చేస్తున్నా వినియోగదారుడికి చేరేసరికి కిలో మీద రూ.50 దాకా వ్యత్యాసం వస్తున్నది. ముఖ్యంగా పచ్చి మిరప, కాకర, బీన్స్, క్యాబేజీ, బీర, టమాటా, క్యాప్సికం రూ.100 దాకా మార్కెట్‌లో ధరలు ఉండడంతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. కార్తీక మాసంలో కూరగాయల సాగు వినియోగం ఎక్కువగా ఉన్న ధరలు తగ్గకపోగా ప్రస్తుతం సైతం అధిక ధరలతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. జిల్లాలో ఉల్లి సాగు ఆశాజనకంగా ఉండడంతో ఉల్లి ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉన్నాయి.

Also Read: TG High Court: హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు సీరియస్.. విచారణకు హాజరుకాకపోతే..

రబీలో పెరగనున్న కూరగాయల సాగు

ఇప్పటికే వాణిజ్య పంటలైన పత్తి పంట పూర్తి కాగా మిరప పంటలు సైతం కింది,పై ముడతలు, వైరస్ , నల్ల తామర పురుగుల కారణంగా మొక్క ఎదుగుదల లేక ఎరుపు రంగులోకి మారడంతో పంట సాగు సైతం చివరి దశకు వచ్చింది. కొన్ని మిరప రకాలు ఇప్పటికే వైరస్ వ్యాప్తితో పలు పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు ప్రస్తుతం కూరగాయల సాగుతో పాటు ఇతర పంటల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. రానున్న రోజులలో విస్తీర్ణం పెట్టడంతో కూరగాయల రేట్లు తగ్గు ముఖం పట్టే అవకాశం ఉందని ఉద్యానవన అధికారులు అంచనా వేస్తున్నారు.

ర్యాడ్ ద్వారా సబ్సిడీ

జిల్లాలో కూరగాయల సాగు చేసే రైతుల గుర్తింపులో భాగంగా మూడు కాంపొనెంట్ లైనా బర్రెలు, కోళ్ల ఫారం, అవెన్యూ ప్లాంటేషన్ కలిగిన రైతులకు సబ్సిడీ కింద పదివేల ప్రోత్సాహంతో పాటు క్రెట్లు, మొక్కల కోసం వర్మి కంపోస్ట్ బెడ్లు ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తున్నది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎక్కువగా కూరగాయలు సాగు చేసే ఎర్రవల్లితో పాటు వడ్డేపల్లి, శేషంపల్లి సమీప గ్రామాలను ఈ పథకంలో చేర్చి కూరగాయలు సాగు చేసే రైతులకు ఈ పథకం ద్వారా సహకారాన్ని అందిస్తున్నది. రానున్న రోజులలో కూరగాయల సాగు విస్తీర్ణం పెరిగి దిగుబడిలో వచ్చే అవకాశం ఉండడంతో కూరగాయల ధరలు సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని ఉద్యానవన అధికారులు పేర్కొంటున్నారు.

Also Read: Mokshagna Teja: మళ్లీ వార్తల్లోకి నందమూరి వారసుడి ఎంట్రీ.. దర్శకుడు ఫిక్సయ్యాడా!

Just In

01

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ విచారణపై కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

FIR At Doorstep: ఫోన్ చేస్తే ఇంటికే పోలీస్… సూర్యాపేట జిల్లా ఎస్పీ ప్రకటన.. కొత్తగా పోలీసింగ్

Rangareddy District: చనిపోయాడనుకొని మరచిపోయారు.. ఎనిమిదేళ్ల తర్వాత ప్రత్యక్షం.. రంగారెడ్డిలో ఘటన

Ind vs NZ 1st T20: తొలి టీ20లో టీమిండియా విధ్వంసం.. కివీస్‌ ముందు భారీ టార్గెట్!

Municipal Politics: మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై మైనంపల్లి హన్మంతరావు కీలక వ్యాఖ్యలు