Harish Rao: రాష్ట్రంలో అతి పెద్ద పవర్ కుంభకోణానికి రూపకల్పన
Harish Rao (imagecredit:swetcha)
Technology News

Harish Rao: రాష్ట్రంలో అతి పెద్ద పవర్ కుంభకోణానికి రూపకల్పన: హరీష్ రావు

Harish Rao: రాష్ట్రంలో మరో అతి పెద్ద పవర్ స్కాంకు రూపకల్పన జరిగిందని, ఇది అక్షరాలా రూ.50 వేల కోట్ల కుంభకోణమని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) విమర్శించారు. ఇందులో దాదాపు 30 నుంచి 40 శాతం కమీషన్లు దండుకోనున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఎప్పుడు ఏది మాట్లాడినా, ఏం చేసినా, ఏది చేయకున్నా దాని వెనుక ఒకే ఒక్క మిషన్ ఉంటుందని, అదే కమీషన్ అని మండిపడ్డారు. పదేళ్ల పాటు సకల వర్గాల సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న తెలంగాణను, ఇవాళ బడా స్కాములకు, సకల దుర్మార్గాలకు, అరాచకాలకు కేంద్రంగా మార్చేశారన్నారు.

డర్టీ పాలిటిక్సే కదా?

ఈ ప్రభుత్వంలో క్యాబినెట్ మీటింగులు వాటాలు, కమీషన్ల కోసం పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. సోమవారం క్యాబినెట్ మీటింగ్ దేనికోసం పెట్టారని, అసలు ఏం మాట్లాడుకున్నారని అడిగారు. ఆ విషయాలు చెప్పకుండా రూ.5 లక్షల కోట్లు దండుకునే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ‘‘కాంగ్రెస్ దోపిడీని బయట పెట్టినప్పుడల్లా ఓ ఎంక్వైరీ అంటారు, లేకుంటే ఓ కమిషన్ అంటారు. రెండేళ్లుగా మీరు చేస్తున్నది ఈ డైవర్షన్ డర్టీ పాలిటిక్సే కదా? ల్యాండ్ స్కామ్‌పై ఎందుకు సూటిగా సమాధానం చెప్పరు’’ అని నిలదీశారు. ‘‘రామగుండం, పాల్వంచ, మక్తల్‌లో 800 మెగావాట్ల నిర్ణయం తీసుకున్నారని, రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి ఎన్టీపీసీ, జెన్ కోకు అవకాశం కల్పిస్తారట. ఏది తక్కువ వ్యయంతో ప్లాంటు నిర్మించి, తక్కువ రేటుకు కరెంట్ ఇస్తాం అంటే దానికే అవకాశం ఇస్తారట. ఎంత డ్రామా?. ఒక మెగా వాట్ ఉత్పత్తికి రూ.12.23 కోట్ల ఖర్చుతో మొత్తం 2400 మెగా వాట్లు ఉత్పత్తి చేసేందుకు ఇప్పటికే ఎన్టీపీసీ డీపీఆర్ చేసుకున్నది. కానీ జెన్ కో డీపీఆర్‌లో మాత్రం మెగా వాట్ ఉత్పత్తికి రూ.14 కోట్లు అవుతుందని స్పష్టంగా పేర్కొంది.

Also Read: Saree Distribution: సూర్యాపేటలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ.. పర్యాటక సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి!

బడా స్కామ్ ప్లాన్..

ఇందులో ఏది మేలు. ఎక్కువ ధరనా, తక్కువ ధరనా’’ అని హరీశ్ రావు అడిగారు. గతంలో బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చు చూస్తే మెగా వాట్ కాస్ట్ వైటీపీపీ(YTPP) రూ.8.63 కోట్లు, భద్రాద్రి రూ.9.74 కోట్లు, ఎన్టీపీసీ(NTPC) రూ.12.23 కోట్లు అని వివరించారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించబోయే పవర్ ప్లాంట్ కాస్ట్ ఫర్ మెగా వాట్ రూ.14 కోట్లకు పెంచారని మండిపడ్డారు. దీని వెనుక బడా స్కామ్ ప్లాన్ ఉన్నదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం, ఎన్టీపీసీ 2,400 మెగా వాట్ల కరెంట్ ఇస్తా అంటే వద్దని 10 రూపాయలకు తయారు చేస్తం అంటున్నారని, ఎన్టీపీసీని తిరస్కరించడం వెనుక ఉన్న మతలబు ఏంటని ప్రశ్నించారు. ‘‘కేసీఆర్ ముందు చూపుతో నల్లగొండ జిల్లా దామరచర్లలో 4,000 మెగా వాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సంకల్పించారు. నాడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komati reddy Venkat Reddy) తాము అధికారంలోకి వస్తే ప్రాజెక్ట్ ఆపేస్తాం అన్నారు. ఇప్పుడు కమీషన్ల కోసమా? వాటాలా కోసమా? ఎందుకు పెదవులు మూసుకున్నారు. సమాధానం చెప్పాలి. పైసలు లేవు అంటారు. లక్ష కోట్లతో ఫ్యూచర్ సిటీ*(Future City) అంటరు. మూసీ సుందరీకరణ అంటరు. అప్పులు తెచ్చి ప్లాంట్లు కడుతా అంటారు. దేనిపైనా క్లారిటీ లేదు’’ అని హరీశ్ రావు అన్నారు. రూ.50 వేల కోట్ల స్కామ్ బయటపెట్టామని, దమ్ముంటే సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. త్వరలో హైదరాబాద్ అండర్ గ్రౌండ్ కేబుల్ స్కాం, పంపుడ్ స్కోరేజీ, బ్యాటరీ స్టోరేజీ స్కాములు బయటపెడుతామని చెప్పారు.

Also Read: Fortuner Monthly EMI: రూ.40 లక్షల ఫార్చ్యూన్ కారు.. జీరో డౌన్ పేమెంట్.. నెలకు ఈఎంఐ ఎంతంటే?

Just In

01

Political News: ఇవి బురద రాజకీయాలు.. వైసీపీ, బీఆర్ఎస్‌లపై టీడీపీ ఎంపీ ఫైర్

Cheen Tapak Dum Dum: సమంత క్లాప్‌తో మొదలైన ‘చీన్ టపాక్‌ డుం డుం’.. వివరాలివే!

BRS Complaint on CM: సీఎంపై చర్యలు తీసుకోండి.. డీజీపీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఫిర్యాదు

Anaganaga Oka Raju: సెంచరీ కొట్టేసిన రాజుగారు.. నిర్మాత పంట పండిందిపో!

MP Chamal Kiran: దావోస్‌ ‘వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్’ వేదికపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి