AB4: ఘట్టమనేని వారసుడి మూవీ టైటిల్ రివీలయ్యేది ఎప్పుడంటే..
AB4 Jaya Krishna Ghattamaneni (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

AB4: ఘట్టమనేని వారసుడి మూవీ టైటిల్ రివీలయ్యేది ఎప్పుడో.. అజయ్ భూపతి చెప్పేశాడు

AB4: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న దివంగత రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) హీరోగా అరంగేట్రం చేయబోతున్న విషయం తెలిసిందే. ‘RX 100, మంగళవారం’ వంటి వైవిధ్య చిత్రాలతో విజనరీ ఫిల్మ్ మేకర్‌గా పేరు పొందిన అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వంలో AB4గా జయకృష్ణ వెండితెర అరంగేట్రం ఉండబోతుందని ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను వైజయంతి మూవీస్‌ అధినేత అశ్విని దత్ సమర్పిస్తుండగా.. చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జయకృష్ణ సరసన నటించే హీరోయిన్‌ని కూడా రీసెంట్‌గానే అధికారికంగా ప్రకటించారు. జయకృష్ణ సరసన ఇందులో బాలీవుడ్‌కు చెందిన రవీనా టాండన్, అనిల్ తడానిల కుమార్తె రషా తడాని హీరోయిన్‌గా తెలుగు వెండితెరకు పరిచయం కాబోతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి సాలిడ్ అప్డేట్‌ని (AB4 Latest Update) దర్శకుడు అజయ్ భూపతి ఎక్స్ వేదికగా తెలియజేశారు. అదేంటంటే..

Also Read- Bigg Boss Telugu 9: హౌస్‌మేట్స్‌పై దేత్తడి హారిక‌ పంచులే పంచులు.. డ్యాన్స్ చేయించిన మానస్.. సందడే సందడి!

టైటిల్, ప్రీ లుక్ రిలీజ్‌కు డేట్, టైమ్ ఫిక్స్

‘‘ప్రతి కథ ప్రేక్షకుల హృదయాలను చేరుకోవడానికి దాని సొంత మార్గాన్ని కలిగి ఉంటుంది’’ అని చెబుతూ ఈ చిత్ర టైటిల్, ప్రీ లుక్‌ను నవంబర్ 27 ఉదయం 11 గంటల 07 నిమిషాలకు రివీల్ చేయబోతున్నట్లుగా దర్శకుడు అజయ్ భూపతి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‌కు సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ ఫైర్ ఎమోజీని పోస్ట్ చేశారు. దీంతో ఈ సినిమాకు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అనేలా క్లారిటీ ఇచ్చినట్లయింది. ఇక ఘట్టమనేని అభిమానులందరూ.. టైటిల్, ప్రీ లుక్ కోసం వెయిట్ చేస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు టైటిల్ ఏంటో కూడా గెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఘట్టమనేని వారసుడి ఎంట్రీ చిత్రానికి ఎలాంటి టైటిల్‌ని ఫిక్స్ చేశారో తెలియాలంటే మాత్రం.. ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.

Also Read- Sampath Nandi: ఏ కడుపునైనా ఎంచుకో.. ఏ గడపనైనా పంచుకో.. కానీ మళ్లీ రా!.. తండ్రి మృతిపై సంపత్ నంది ఎమోషనల్ పోస్ట్!

హార్ట్ టచ్చింగ్ లవ్ స్టోరీగా..

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అద్భుతమైన కొండల మధ్య సాగే హార్ట్ టచ్చింగ్ లవ్ స్టోరీగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. భావోద్వేగాలు, నిజాయితీ, రియలిజం కలగలిపిన ఈ సినిమా కొత్త తరహా ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్రయూనిట్ కూడా ప్రకటించింది. ఇందులో పెయిర్.. ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తారని టీమ్ చెబుతోంది. ‘Uyi Amma’ పాటతో ఇంటర్నెట్‌ను షేక్ చేసిన రషా తడాని పాత్రకు ఇందులో చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని, సినిమా విడుదల తర్వాత టాలీవుడ్‌లో ఆమె బిజీ హీరోయిన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేలా అప్పుడే యూనిట్ టాక్ వినిపిస్తుండటం విశేషం. తన చిత్రాల్లో మహిళా పాత్రలకు బలమైన క్యారెక్టరైజేషన్స్ రాసే దర్శకుడు అజయ్ భూపతి, ఇందులో రషా తడాని కోసం ఇంటెన్స్ క్యారెక్టర్‌ని డిజైన్ చేసినట్లుగా అప్పుడే టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Srinivas Goud: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Balakrishna: బోయపాటి నోటి వెంట చిరు, ప్రభాస్ పేరు.. హర్టయిన బాలయ్య!

Tollywood: రషా తడానీ, హర్షాలి.. నెక్ట్స్ టాలీవుడ్‌ను ఊపేసే భామలు వీరేనా?

Sahakutumbanam: తన ఫ్రెండ్ చనిపోతే.. ఆసక్తికర విషయం చెప్పిన బుచ్చిబాబు సానా!

Jailer 2: ‘జైలర్ 2’లో గెస్ట్ రెల్ చేసేది బాలయ్య కాదట.. ఎవరంటే?