The Rise Of Ashoka: ఈ మధ్య కాలంలో రాముడు, శివుడు వంటి దేవుళ్లను బేస్ చేసుకుని సినిమాలు ఎక్కువగా రూపుదిద్దుకుంటున్నాయి. ఎస్ఎస్ రాజమౌళి కూడా తన ‘వారణాసి’లో మహేష్ బాబుని రాముడిగా చూపించబోతున్నట్లుగా క్లారిటీ కూడా ఇచ్చేశారు. ఇంకా ‘మోగ్లీ’ సినిమాలో రాముడి నేపథ్యం ఉంటుందని తెలుస్తోంది. ‘జై హనుమాన్’ సంగతి సరే సరి. అలాగే శివుడిని బేస్ చేసుకుని ‘అఖండ 2’ వచ్చేందుకు సిద్ధమైంది. ఇలా దేవుళ్ల పాత్రలతో, నేపథ్యాలతో వస్తున్న సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తుండటంతో.. మేకర్స్ వాటికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలాంటి జాబితా చిత్రాలలోకి చేరేందుకు ‘ది రైజ్ ఆఫ్ అశోక’ (The Rise Of Ashoka) పేరుతో కూడా ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన సాంగ్‌ని చూస్తే.. శివ భక్తులకు పండగే అని చెప్పొచ్చు.
శివుడి గొప్పదనంపై సాంగ్
‘లూసియా’ ఫేమ్ సతీష్ నినాసం (Sathish Ninasam) హీరోగా, నిర్మాతగా భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ది రైజ్ ఆఫ్ అశోక’. వృద్ధి క్రియేషన్, సతీష్ పిక్చర్ హౌస్ బ్యానర్లపై వర్ధన్ హరి, జైష్ణవి, సతీష్ నినాసం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వినోద్ వి ధోండలే (Vinod V Dhondale) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సతీష్ నినాసంకి జోడిగా ‘కాంతార’, నితిన్ ‘తమ్ముడు’ ఫేమ్ సప్తమి గౌడ (Sapthami Gowda) నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘వినరా మాదేవ’ను (Vinara Maadeva Lyrical Song) మేకర్స్ విడుదల చేయగా, మంచి ఆదరణను రాబట్టుకుంటూ టాప్‌లో ఈ సాంగ్ ట్రెండ్ అవుతోంది. ‘ది రైజ్ ఆఫ్ అశోక’లో ఇది జాతర పాట అని తెలుస్తోంది. ఈ పాటలోని సాహిత్యం వింటే శివుడి గొప్పదనం ఏంటో మరోసారి అందరికీ అర్థమయ్యేలా శ్రీనివాస్ కాళే రచించారు.
మళ్లీ మళ్లీ చూడాలనింపించేలా..
ఆ ఊరి ప్రజలు లార్డ్ శివను ఎంతగా ఆరాధిస్తారు? ఎలా పూజిస్తారు? అనేది ఈ పాటలో, ఇందులోని సాహిత్యంలో చక్కగా చూపించారు. ఊరంతా కలిసి జరుపుకునే జాతర నేపథ్యంలో వచ్చే ఈ పాటలో విజువల్స్ కూడా హైస్టాండర్ట్స్‌లో ఉన్నాయి. శ్రీనివాస్ కాళే సాహిత్యానికి తగినట్లుగా సంతు మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటను మళ్లీ మళ్లీ చూసేలా చేస్తుంది. ఈ పాటను సతీష్ నినాసం, సాద్విని కొప్ప, సిద్దు కలిసి సంయుక్తంగా ఆలపించడం విశేషం. ఈ పాటలో సప్తమి గౌడ లుక్స్, అప్పియరెన్స్, స్టెప్పులు కూడా చాలా బాగున్నాయి. శివతత్వాన్ని బోధిస్తూ వచ్చిన ఈ జాతర పాటను వింటే.. నిజంగా గూస్‌బంప్స్ పక్కా అనే చెప్పాలి. విజువల్స్ కూడా గ్రాండియర్‌గా కనిపిస్తున్నాయి. లహరి మ్యూజిక్ ద్వారా ఈ ఆడియో మార్కెట్లోకి విడుదలైంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అన్ని పనుల్ని పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా మేకర్స్ ఈ అప్డేట్‌లో తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

