Telangana BJP: స్థానిక ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్
Telangana BJP ( image CREdit: twitter)
Political News

Telangana BJP: స్థానిక ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. సమావేశానికి డుమ్మా కొట్టిన కీలక నేతలు!

Telangana BJP: స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికలపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు, గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు రాంచందర్ దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించారు. అన్ని వార్డులు, గ్రామ పంచాయతీలకు పోటీ చేయాలని నిర్ణయించారు. ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే బరిలోకి దిగేలా కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఫ్లోర్ లీడర్లతో కమిటీ వేయనున్నారు. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కమిటీలతోపాటు లీగల్ కమిటీలను కూడా వేయనున్నారు.

సమావేశానికి డుమ్మా కొట్టిన కీలక నేతలు

స్థానిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి ముఖ్యమైన నేతలు డుమ్మా కొట్టారు. అందరూ హాజరు కావాలని రాంచందర్ రావు పేరుతో అఫిషియల్‌గా ప్రతి ఒక్క నేతకు సమాచారం ఇచ్చినా కొంత మంది నేతలు దాన్ని లెక్కలోకి తీసుకోకపోవడం గమనార్హం. అయితే, సమావేశానికి హాజరైన వారిలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, సైదిరెడ్డి తప్ప పెద్దగా మిగిలిన కీలక నేతలెవరూ హాజరు కాకపోవడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. కీలకమైన సమావేశానికి తక్కువ మంది వచ్చారేందని సమావేశానికి హాజరైన నేతలకు అడిగినట్లుగా తెలుస్తోంది.

Also Read: Telangana BJP: జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికల ఫలితాలలో కాషాయ పార్టీ ఘోర పరాజయం.. ఓటమి బాధ్యత ఎవరిది?

సమావేశానికి పార్టీ నేతలు డుమ్మా

నేతలు హాజరు కాకపోవడంతో కేవలం ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం, అధ్యక్షుడిపై విమర్శలు చేయడం వంటి అంశాలకే పార్టీ నాయకులు పరిమితమవుతున్నారనే విమర్శులు బీజేపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి. 140 మందికి సమాచారం ఇస్తే సమావేశానికి పట్టుమని పది మంది కూడా రాలేదని తెలుస్తోంది. సమావేశానికి పార్టీ నేతలు డుమ్మా కొట్టడంపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సమావేశం అనంతరం మీడియాకు వివరణ ఇచ్చారు. ఈ సమావేశానికి ఎనిమిది తొమ్మిది మందికి మాత్రమే సమాచారమిచ్చామని. ఒకరు మాత్రమే గైర్హాజరయ్యారని తెలిపారు. అందరి అభిప్రాయాలు తీసుకున్నామని, దీనిపై మరోసారి ఇతర నేతలతోనూ సమావేశమై ఎన్నికలకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం మొహం పెట్టుకొని పంచాయతీ ఎన్నికలకు వెళ్తాందన్నారు. గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులన్నీ కేంద్ర ప్రభుత్వానివేనన్నారు.

30న రాష్ట్రానికి బీఎల్ సంతోష్

ఈ నెల 30న తెలంగాణకు సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ రానున్నట్లు తెలుస్తున్నది. తెలంగాణ బీజేపీ విస్కృత స్థాయి సమావేశానికి ఆయన హాజరు కాబోతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నగర శివారులో జరిగే ఈ విస్కృత స్థాయి సమావేశానికి ఆయన హాజరై పార్టీ సంస్థాగత నిర్ణయాలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం తదితర అంశాలపై రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఎల్ సంతోష్ రాష్ట్రానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read: Telangana BJP: పోల్ మేనేజ్‌మెంట్‌పై బీజేపీ స్పెషల్ ఫోకస్.. వర్కౌట్ అయ్యేనా..!

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..