Syamala: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై శ్యామల ఫైర్..
Syamala on Balakrishna (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Syamala: హిందూపురంలో అంత రచ్చ జరుగుతుంటే ఎమ్మెల్యే ఎక్కడ? బాలకృష్ణపై శ్యామల ఫైర్..

Syamala: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ (Hindupur MLA Nandamuri Balakrishna)కు ఎందుకు బీసీలు అంటే అంత కక్ష అని అన్నారు వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల (Are Syamala). హిందూపురం నియోజకవర్గంలో ఒక బీసీ మహిళ అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) ఇన్చార్జ్ కురుబ దీపిక పార్టీ కార్యాలయం పై దాడి చేసి ధ్వంసం చేయడమే కాకుండా.. పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడంపై ఆమె ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే పీఏ చెబితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రశాంత్ గౌడ్‌పై అక్రమంగా కేసు పెట్టారనేలా ఆరోపణలు చేస్తూ.. ఇంత జరుగుతున్నా, ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజక వర్గంలో ఇంత జరుగుతుంటే, ఆయన సినిమా ప్రొమోషన్స్ చేసుకుంటున్నారని, ఇది కరెక్ట్ కాదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు శ్యామల విడుదల చేసిన వీడియోలో..

Also Read- Teacher Naresh Kaushik: ఫేర్వెల్ పార్టీ‌లో ఈ లెక్కల మాస్టర్ చేసిన డ్యాన్స్‌కి జానీ మాస్టర్ ఫిదా.. వీడియో వైరల్!

ఎమ్మెల్యే బాలకృష్ణ ఎందుకు మాట్లాడటం లేదు?

‘హిందూపురంలో అసలేం జరుగుతుంది? కొన్ని రోజుల క్రితం వైఎస్ఆర్‌సీపీ (YSRCP) పార్టీ కార్యాలయంపైకి వచ్చి, ఇష్టమొచ్చినట్లు దాడులు చేసి, విధ్వంసం సృష్టించారు. అక్కడున్న కార్యకర్తలను కొట్టారు. ఆ తర్వాత మళ్లీ వైసీపీ నాయకుల మీదే కేసులు పెట్టారు. నిన్నటికి నిన్న చూసుకుంటే, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ సీఐ లక్ష్మీ దుర్గయ్య.. వైసీపీ లీడర్ ప్రశాంత్ గౌడ్ మీద అక్రమంగా కేసు పెట్టారు. ఇంత జరుగుతున్నా కూడా.. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకాయన స్పందించడం లేదు. మా వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యాలయంపై దాడి జరిగినప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. ఈ రోజు కూడా మాట్లాడటం లేదు ఎందుకని?

Also Read- Something is Fishy: యోధురాలిగా హౌస్‌లోకి అందాల భామ ఎంట్రీ.. ఫిష్ టాస్క్‌‌లో ఎవరు గెలిచారు?

రాబోయే రోజుల్లో ప్రతికార చర్య తప్పదు

నాకు కూడా సినిమాలంటే చాలా గౌరవం. నేను అక్కడ నుంచి వచ్చినదాన్నే. మీరు మీ సినిమా ప్రొమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇది కూడా మీ డ్యూటీనే కదా. ఈ నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. మీరు మాట్లాడాలి కదా. మీ పీఏనే ఎక్సైజ్ సీఐ మీద ఒత్తిడి తెచ్చి, ఇలా అక్రమంగా కేసులు పెట్టిస్తున్నారన్న విషయం.. మీకు తెలుసని అందరికీ తెలుసు. దీనిపై మీ స్పందనేంటి? డైరెక్ట్‌గా అడుగుతున్నాను. మీరు కచ్చితంగా దీనిపై స్పందించాలి. ఇలా అక్రమంగా కేసులు పెట్టేసి, కార్యాలయాలపై దాడులు చేసేసి, కార్యకర్తలను కొట్టేస్తే మాత్రం.. ఇలాగే నోరు మూసుకుని కూర్చుంటారులే అనుకుంటే మాత్రం అది మీ పొరపాటే. ఇదే సాంప్రదాయం కొనసాగిస్తే రాబోయే రోజుల్లో ప్రతికార చర్య తప్పదు అని హెచ్చరిస్తున్నాము’’ అంటూ శ్యామల ఫైర్ అవుతున్నారు.

">

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CM Revanth Reddy: ప్రభుత్వానికి, ఆర్మీకి మధ్య సమస్యలు చర్చలతోనే పరిష్కారమవుతాయి: సీఎం రేవంత్ రెడ్డి

Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో దారుణం.. ఓ ఉపాద్యాయుడి ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు

Medaram Jatara: మేడారం జాతర పనుల పురోగతిపై మంత్రి సీతక్క ఆకస్మిక తనిఖీ..!

Chevella Municipality: మున్సిపల్ చైర్మన్ పీఠంపై కాంగ్రెస్‌లో ఉత్కంఠ పోటీ.. అందరి చూపు అటువైపే..!

Peddi: ‘పెద్ది’ ఈ ఫొటో ఎక్కడిది? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పిక్!