Something is Fishy: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 79వ రోజు (Bigg Boss Telugu Season 9 Day 79)ను బిగ్ బాస్ చాలా ఆసక్తికరంగా ప్లాన్ చేశారు. సోమవారం నామినేషన్స్ ఎంత వాడిగా, వేడిగా జరిగాయో తెలిసిందే. మరీ ముఖ్యంగా సంజన, రీతూ మధ్య వార్‌లో సంజన మాట్లాడిన మాటలను అందరూ ఖండించారు. రాత్రి పూట పవన్‌తో ఉంటావు నీవు అని రీతూని టార్గెట్ చేస్తూ సంజన చేసిన వ్యాఖ్యలు నిజంగా దుమారాన్నే రేపాయి. మొత్తంగా అయితే ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి కెప్టెన్ రీతూ (Captain Rithu) తప్ప.. అందరూ నామినేట్ అయ్యారు. అందులో తనూజని ఎక్కువ మంది నామినేట్ చేశారు. లాస్ట్ వీక్ ఇమ్ము తన దగ్గర ఉన్న పవరాస్త్రతో ఎలిమేషన్స్ ఆపగలిగాడు కానీ, ఈ వారం మాత్రం ఎలాంటి ఛాన్స్ లేదు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
Also Read- Rahul Sipligunj: కాబోయే భార్యకు రాహుల్ సిప్లిగంజ్ ఊహించని సర్‌ప్రైజ్.. ఏంటో తెలిస్తే షాకవుతారు
బయటి నుంచి వచ్చే యోధులను ఓడించాలి
ఇక నామినేషన్స్ అనంతరం కెప్టెన్సీ కంటెండర్ షిప్ టాస్క్ జరుగుతుందనే విషయం తెలిసిందే. ఈ వారం ఈ టాస్క్‌ను చాలా వెరైటీగా ప్లాన్ చేశాడు బిగ్ బాస్. ‘‘ఈ రణరంగం చివరి అంకానికి చేరుకుంది. బిగ్ బాస్ చివరి కెప్టెన్సీ కంటెండర్ షిప్ యుద్ధం ప్రారంభమైంది. ఇప్పటి వరకు కెప్టెన్సీ కంటెండర్ షిప్ (Captaincy Contendership)లో నిలవడానికి మీలో మీరు యుద్ధం చేశారు. కానీ ఈసారి పరిస్థితి మీ ఊహలకు అందని స్థాయిలో ఉంటుంది. ఈసారి మీరు చేసే యుద్ధంలో బయటి నుంచి ఈ ఇంటిలోకి వచ్చే యోధులను ఓడించాల్సి ఉంటుంది’’ అని బిగ్ బాస్ చెప్పగానే హౌస్‌లోకి పాత సీజన్ కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ (Gautham Krishna) అడుగు పెట్టి.. భరణి (Bharani)తో టాస్క్ ఆడుతున్నట్లుగా ఆల్రెడీ వచ్చిన ప్రోమోలో చూపించారు. తాజాగా మరో ప్రోమోని బిగ్ బాస్ టీమ్ విడుదల చేసింది.
Also Read- Tollywood: ‘దేవర, హరిహర వీరమల్లు, ఓజీ’.. ఈ సినిమాల పార్ట్ 2 సంగతేంటి? డౌటేనా?
సమ్‌థింగ్ ఈజ్ ఫిషీ
సమ్‌థింగ్ ఈజ్ ఫిషీ (Something is fishy) అంటూ వచ్చిన ఈ ప్రోమోలో.. హౌస్‌లోకి పాత కంటెస్టెంట్, అందాల భామ ప్రియాంక (Priyanka) ఎంట్రీ ఇచ్చింది. ఆమెను చూసి ఇంటిలోని కుర్రాళ్ల ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి. అందరి పరిచయం అనంతరం.. అంత ఎందుకు ఏడుస్తున్నావ్ అని ఇమ్మూని ప్రియాంక అడుగుతుంటే.. ‘నువ్వు గుర్తొస్తున్నావ్ ప్రియాంక’ అంటూ ఇమ్ము కామెడీ చేస్తున్నాడు. ‘ప్రతి ఒక్కరికీ అదే చెబుతావా?’ అంటూ ప్రియాంక కూడా సరదాగా చెప్పింది. ‘మీరందరూ గుసగుసలాడే పాయింట్స్ నాకు చెప్పండి’ అని ప్రియాంక అడగగానే కెప్టెన్ రీతూ సరదాగా ఓ కథ చెబుతోంది. ‘ఈ యోధురాలిని చూడగానే మాలో ఉన్న యోధులందరూ బయటకు వచ్చేస్తున్నారు’ అంటూ ఇమ్మానియేల్ చేస్తున్న కామెడీ హైలెట్ అని చెప్పుకోవాలి. ఇక బిగ్ బాస్ టాస్క్ వివరాలు చెబుతున్నారు. ‘ఈ సమ్‌థింగ్ ఈజ్ ఫిషీ అనే టాస్క్‌లో గెలవాలంటే.. శాక్స్‌ని పట్టుకుని ఫిష్ స్కెలెటన్ దగ్గరకు వచ్చి, శాక్స్‌లోని ఫిస్ బోన్స్‌ని సరైన ఆర్డర్‌లో ఫిక్స్ చేసి, ఫిష్‌ని పూర్తి చేయాలి. ట్విస్ట్ ఏమిటంటే.. పోటీ దారులకు ఒక్క చెయ్యి మాత్రమే అందుబాటులో ఉంటుంది’ అని బిగ్ బాస్ చెప్పారు. కెప్టెన్సీ కంటెండర్‌గా కళ్యాణ్ (Kalyan) ఈ టాస్క్‌లో ప్రియాంకతో పోటీ పడుతున్నాడు. ఈ టాస్క్‌లో ఎవరు గెలిచారనేది మాత్రం ఈ ప్రోమోలో చూపించలేదు. ఫైనల్‌గా ఈ టాస్క్‌లో ఎవరు గెలిచారనేది తెలియాలంటే మాత్రం నైట్ ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
