Rahul Sipligunj: కాబోయే భార్యకు రాహుల్ ఊహించని సర్‌ప్రైజ్
Rahul Sipligunj Surprises fiancee (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Rahul Sipligunj: కాబోయే భార్యకు రాహుల్ సిప్లిగంజ్ ఊహించని సర్‌ప్రైజ్.. ఏంటో తెలిస్తే షాకవుతారు

Rahul Sipligunj: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన ప్రత్యేకమైన పాటలతో యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న సింగర్, బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నవంబర్ 27వ తేదీన ఆయన వివాహ వేడుక అత్యంత వైభవంగా జరగనుంది. ఈ శుభకార్యానికి సినీ ప్రముఖులు, అలాగే రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారని తెలుస్తోంది. రాహుల్, హరిణ్య రెడ్డి జంట ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ పెళ్లికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. పెళ్లి తేదీ దగ్గరపడుతుండటంతో, వధూవరుల ఇళ్లలో సందడి రెట్టింపు అయింది. ఇప్పటికే ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్, ముఖ్యంగా సంగీత్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది తాజాగా వైరల్ అవుతోన్న ఫొటోలు చూస్తుంటే తెలుస్తోంది. ఈ సంగీత్ వేడుకలోనే రాహుల్ సిప్లిగంజ్ తన కాబోయే భార్య హరిణ్య రెడ్డి (Harinya Reddy)కి జీవితంలో మర్చిపోలేని ఒక అద్భుతమైన సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఆ సర్‌ప్రైజ్ ఏంటో తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు.

Also Read- IBomma Ravi Investigation: ఆధారాలు ముందు పెట్టినా.. పోలీసులకు పనికి వచ్చే ఎలాంటి సమాచారం రవి ఇవ్వలేదా?

ఊహించని అతిథి రాకతో ఆనందంలో హరిణ్య

హరిణ్య రెడ్డికి టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) అంటే విపరీతమైన అభిమానమని రాహుల్‌కు తెలుసు. అందుకే, తన పెళ్లి వేడుకకు, ముఖ్యంగా సంగీత్ ఫంక్షన్‌కు ఏకంగా యుజ్వేంద్ర చాహల్‌ను అతిథిగా ఆహ్వానించారు. అనుకోకుండా తమ వేడుకలో స్టార్ క్రికెటర్ ప్రత్యక్షం కావడంతో హరిణ్య రెడ్డి సంతోషానికి అంతులేకుండా పోయింది. ఈ ఆనందకరమైన క్షణాలను ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. చాహల్‌తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ, తనకు ఇంతటి గొప్ప సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చినందుకు కాబోయే భర్త రాహుల్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Also Read- Tollywood: ‘దేవర, హరిహర వీరమల్లు, ఓజీ’.. ఈ సినిమాల పార్ట్ 2 సంగతేంటి? డౌటేనా?

అప్పుడు ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌

జానికి, రాహుల్ సిప్లిగంజ్ తన కాబోయే భార్యను సంతోషపెట్టడానికి ఇలాంటి చిన్నచిన్న సర్‌ప్రైజ్‌లు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటారు. నిశ్చితార్థం సమయంలో కూడా ఆయన హరిణ్యకు ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌ను బహుమతిగా ఇచ్చి తన ప్రేమను చాటుకున్నారు. ఇప్పుడు ఏకంగా క్రికెట్ స్టార్‌ను వేడుకకు ఆహ్వానించి, ఆమె ఆనందాన్ని పదింతలు చేశారు. పెళ్లికి మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో, సంగీత్, హల్దీ వంటి వేడుకలను అత్యంత అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఈ నవంబర్ 27న రాహుల్-హరిణ్య కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. మరో వైపు రాహుల్ సిప్లిగంజ్ సింగర్‌గా బిజీగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్‌లో ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వచ్చిన తర్వాత ఆయన రేంజే మారిపోయిందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు.

">

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Srinivas Goud: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Balakrishna: బోయపాటి నోటి వెంట చిరు, ప్రభాస్ పేరు.. హర్టయిన బాలయ్య!

Tollywood: రషా తడానీ, హర్షాలి.. నెక్ట్స్ టాలీవుడ్‌ను ఊపేసే భామలు వీరేనా?

Sahakutumbanam: తన ఫ్రెండ్ చనిపోతే.. ఆసక్తికర విషయం చెప్పిన బుచ్చిబాబు సానా!

Jailer 2: ‘జైలర్ 2’లో గెస్ట్ రెల్ చేసేది బాలయ్య కాదట.. ఎవరంటే?