Thaman Trolls: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అత్యధిక చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ, అగ్ర హీరోల ప్రాజెక్టులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ (S.S. Thaman) తరచుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతున్నారు. ఆయన అందించిన పాటలు “ఎక్కడో విన్నట్లుగా” లేదా “కాపీ కొట్టినట్లుగా” ఉన్నాయనేది ఈ ట్రోలింగ్‌కు ప్రధాన కారణం. గతంలో చాలాసార్లు ఈ విమర్శలను ఎదుర్కొన్న థమన్, తాజాగా విడుదలైన ఓ అగ్ర హీరో సినిమా పాటతో మరోసారి ఈ విమర్శల సుడిగుండంలో చిక్కుకున్నారు. ఆ పాటను చూసిన ఫ్యాన్స్ రొటీన్ ట్యూన్ ఇస్తున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
Read also-Arasan Cast: వెట్రిమారన్ ‘సామ్రాజ్యం’లోకి ప్రవేశించిన విజయ్ సేతుపతి.. ఈ కాంబినేషన్ ఊచకోతే!..
‘రాజాసాబ్’ పాటపై ఫ్యాన్స్ ఫైర్..
ఇటీవల అగ్ర కథానాయకుడు ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘రాజాసాబ్’ (Raja Saab) నుంచి విడుదలైన తొలి పాటకు సంబంధించిన ట్యూన్ విషయంలో ఫ్యాన్స్, నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాట ట్యూన్ కూడా గతంలో వచ్చిన ఏదో ఒక పాటను పోలి ఉన్నట్లు, లేదా ఆ ట్యూన్ నుంచి ప్రేరణ పొందినట్లుగా అనిపిస్తోందని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆయా హీరోల అభిమానులు తమ హీరో సినిమాకు కూడా పాత పాటల ట్యూన్లను వాడుతున్నారంటూ థమన్‌పై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు. థమన్‌పై ఇలాంటి కాపీ క్యాట్ ఆరోపణలు కొత్తేమీ కాదు. ఆయన సంగీతం అందించిన ‘అల వైకుంఠపురములో’, ‘వకీల్ సాబ్’, ‘అఖండ’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి అనేక విజయవంతమైన చిత్రాల పాటల సమయంలో కూడా ఇదే విధమైన విమర్శలు వచ్చాయి. కొన్ని సందర్భాలలో, థమన్ స్వయంగా స్పందిస్తూ, అది కేవలం ‘ప్రేరణ’ మాత్రమేనని, లేదా కొన్ని బీట్స్/రైమ్స్ అనుకోకుండా కలిసిపోతాయని వివరణ ఇచ్చుకున్నారు. అయినప్పటికీ, సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు, మీమ్స్ కొనసాగుతూనే ఉన్నాయి.
Read also-Draupadi Poster: ‘ద్రౌపది 2’ నుంచి ఇందుచూడన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. ఏం ఉంది మామా..
వర్క్ లోడే కారణమా?
కొంతమంది నెటిజన్లు, సినీ విమర్శకులు మాత్రం థమన్‌కు మద్దతుగా నిలబడగా, ఈ సమస్యకు అసలు కారణాన్ని విశ్లేషిస్తున్నారు. థమన్ ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత బిజీగా ఉన్న సంగీత దర్శకుడిగా ఉన్నారు. ఒకే సమయంలో అనేక అగ్ర హీరోల భారీ ప్రాజెక్టులకు పనిచేయడం వల్ల ఆయనపై వర్కులోడ్ విపరీతంగా పెరిగింది. “అతిగా పెరిగిన ఈ వర్కులోడ్ కారణంగా, ప్రతి సినిమాకు సరికొత్త, అద్భుతమైన ట్యూన్లను అందించేందుకు ఆయనకు తగిన సమయం దొరకడం లేదు. ఈ ఒత్తిడి వల్లే పాత ట్యూన్లను పోలిన సంగీతాన్ని ఇస్తున్నారేమో” అని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనిని థమన్‌లోని సృజనాత్మకత లోపంగా కాకుండా, అనవసరమైన పని ఒత్తిడిగా చూడాలని సూచిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ట్రోలింగ్ థమన్‌పై మరింత ఒత్తిడి పెంచుతోంది. ఒక వైపు వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న థమన్.. ఈ ఆరోపణలను అధిగమించి, ప్రేక్షకులకు సరికొత్త సంగీత అనుభూతిని ఎప్పుడు అందిస్తారో వేచి చూడాలి. కొందరు థమన్ ఫ్యాన్స్ ఇదంతా వర్క్ ప్రజర్ వల్లే ఇలా జరుగుతుంది అంటూ మద్దతు తెలుపుతున్నారు.

