Draupadi Poster: ‘ద్రౌపది 2’ నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
Draupadi-2(x)
ఎంటర్‌టైన్‌మెంట్

Draupadi Poster: ‘ద్రౌపది 2’ నుంచి ఇందుచూడన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. ఏం ఉంది మామా..

Draupadi Poster: ప్రేక్షకులలో ఎంతో ఆసక్తిని పెంచుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ద్రౌపది 2’ నుంచి తాజాగా అప్డేట్ విడుదలైంది. హీరో రిచర్డ్ రిషి నటిస్తున్న ఈ సినిమా నుంచి, కథానాయిక రక్షణ ఇందుచూడన్ పోషిస్తున్న ద్రౌపది దేవీ కి సంబంధించిన పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ సినిమా స్థాయిని, నాణ్యతను చాటిచెబుతోంది. విడుదలైన పోస్టర్‌లో రక్షణ ఇందుచూడన్ ద్రౌపది దేవి పాత్రలో కనబరుస్తున్న గాంభీర్యం, హుందాతనం సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆమె కట్టుబొట్టు, అలంకరణ, ఆహార్యం అన్నీ కూడా ఆ పాత్రకు తగినట్టుగా అత్యంత కళాత్మకంగా తీర్చిదిద్దబడ్డాయి. దైవత్వం ఉట్టిపడే ఆమె లుక్.. ద్రౌపది దేవి పాత్రకు రక్షణ ఎంతటి న్యాయం చేస్తుందో చెప్పకనే చెబుతోంది.

Read also-Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ ఓటీటీ అఫిషియల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?.. చూడాలంటే?..

పోస్టర్ నేపథ్యం (బ్యాక్‌గ్రౌండ్‌)లో కనిపిస్తున్న అద్భుతమైన సెట్ వర్క్ సినిమాకు పెడుతున్న భారీ బడ్జెట్‌ను, నిర్మాణ విలువలను స్పష్టం చేస్తోంది. నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ల మీద సోల చక్రవర్తి ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారని అర్థమవుతోంది. సమాజంలో చర్చనీయాంశమైన అంశాలను తెరకెక్కించడంలో ప్రత్యేకతను చాటుకున్న దర్శకుడు మోహన్. జి ఈ ‘ద్రౌపది 2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రిచర్డ్ రిషి, రక్షణ ఇందుచూడన్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని, చిత్ర విడుదల తేదీని ప్రకటించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Read lso-Dharmendra Death: బాలీవుడ్ సినీ దిగ్గజం ధర్మేంద్ర మృతితో షోలే రోజులు గుర్తుచేసుకున్న అమితాబ్.. పోస్ట్ వైరల్..

ఈ భారీ చిత్రానికి సాంకేతిక నిపుణులు కూడా అత్యున్నతమైనవారు పనిచేస్తున్నారు. సంగీత దర్శకుడు జిబ్రాన్ తన అద్భుతమైన బాణీలతో ఈ చిత్రానికి ప్రాణం పోయనున్నారు. ఫిలిప్ ఆర్ సుందర్ కెమెరామెన్‌గా ప్రతి సన్నివేశాన్ని మరింత కళాత్మకంగా మలచనున్నారు. దేవరాజ్ ఎస్ ఎడిటర్‌గా, ఎస్ కే ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ముఖ్యంగా, ఈ చిత్రంలోని భారీ పోరాట సన్నివేశాల్ని యాక్షన్ సంతోష్ అత్యంత ప్రమాణాలు పాటిస్తూ కంపోజ్ చేస్తుండటం సినిమాపై అంచనాలను పెంచుతోంది. సామ్రాట్ అందించిన శక్తివంతమైన సంభాషణలు (డైలాగ్స్) సినిమాకు మరింత బలాన్ని చేకూర్చనున్నాయి. మొత్తం మీద, ‘ద్రౌపది 2’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన కొద్దిసేపట్లోనే ప్రేక్షకులలో విశేషమైన స్పందనను రాబట్టుకుంది. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ చిత్రం సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలవాలని సినీ పెద్దలు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ పోస్టర్ విడుదలైన తర్వాత ఈ సినిమాపై ఉన్న ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు