Arasan Cast: ‘సామ్రాజ్యం’లోకి ప్రవేశించిన విజయ్ సేతుపతి..
Vijay-Sethupathi(X)
ఎంటర్‌టైన్‌మెంట్

Arasan Cast: వెట్రిమారన్ ‘సామ్రాజ్యం’లోకి ప్రవేశించిన విజయ్ సేతుపతి.. ఈ కాంబినేషన్ ఊచకోతే!..

Arasan Cast: కోలీవుడ్ సినిమా రంగంలో మరో కాంబినేషన్ హాట్ టాపిక్ గా మారుతోంది. అది మరెంతో కాదు.. సెన్సేషనల్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో, పవర్-ప్యాక్డ్ హీరో శిలంబరసన్ (శింబు) ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘అరసన్’. తెలుగులో ఈసినిమా ‘సామ్రాజ్యం’గా విడుదల కానుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లోకి ‘మక్కళ్ సెల్వన్’ విజయ్ సేతుపతి అడుగుపెట్టారు. ఈ అనూహ్యమైన కాంబినేషన్ కలవడంతో ‘అరసన్’ చిత్రం ఇప్పుడు ఒక్కసారిగా భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌గా మారింది. దీనిని చూసిన అభినులు సంబరాలు చేసుకుంటున్నారు. తన నేచురల్ నటనతో కట్టి పడేసే విజయ్ సేతుపతి విట్రిమారన్ సినిమాలో చేస్తున్నారంటే ఆ సినిమా ప్రేక్షకుల్లో మరింత బజ్ రేపుతోంది.  తాజాగా ఈ ఆసక్తికరమైన విషయాన్ని చిత్ర నిర్మాత కలైపులి ఎస్. థాను తన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. విజయ్ సేతుపతిని టీమ్‌లోకి ఆహ్వానిస్తూ విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఆ పోస్టర్‌పై “మణిదమ్ ఇనైగిరదు, మగత్తువమ్ తెరిగిరదు” (మానవత్వం కలుస్తోంది, గొప్పదనం కనిపిస్తోంది) అనే క్యాప్షన్ ఇవ్వడం, ‘మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతికి స్వాగతం’ అని పేర్కొనడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Read also-Draupadi Poster: ‘ద్రౌపది 2’ నుంచి ఇందుచూడన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. ఏం ఉంది మామా..

క్రేజీ కాంబినేషన్స్ రిపీట్

వెట్రిమారన్ – విజయ్ సేతుపతి: వీరిద్దరూ కలిసి ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘విడుదలై’ పార్ట్స్ 1, 2 ల కోసం పనిచేశారు. వెట్రిమారన్ గతంలో ‘వడ చెన్నై’ చిత్రంలో ‘రాజన్’ పాత్ర కోసం విజయ్ సేతుపతిని మొదట సంప్రదించారని, డేట్స్ సమస్యల కారణంగా అది కుదరలేదని కూడా చెప్పారు. ఇప్పుడు ‘అరసన్’ ద్వారా ఆ లోటు తీరిపోనుంది. శింబు – విజయ్ సేతుపతి.. ఈ ఇద్దరు స్టార్స్ గతంలో మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ చిత్రం ‘చెక్క చివంత వానమ్’లో కలిసి నటించారు. మళ్లీ ఇన్నేళ్లకు వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోనుండటం అభిమానులను ఎంతగానో సంతోషపరుస్తోంది. శింబు, విజయ్ సేతుపతి లాంటి ఇద్దరు బలమైన నటులు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఆ సినిమా స్థాయి వేరుగా ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read also-Dharmendra Death: బాలీవుడ్ సినీ దిగ్గజం ధర్మేంద్ర మృతితో షోలే రోజులు గుర్తుచేసుకున్న అమితాబ్.. పోస్ట్ వైరల్..

‘వడ చెన్నై’ యూనివర్స్‌లో భాగం

ఈ చిత్రం ప్రముఖంగా వెట్రిమారన్ సృష్టించిన ‘వడ చెన్నై’ యూనివర్స్‌లో భాగమని దర్శకుడు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే, ఇది ధనుష్ హీరోగా వచ్చిన ‘వడ చెన్నై’ సినిమాకు సీక్వెల్ కాదని, ఆ ప్రపంచానికి సంబంధించిన మరో తెలియని కథ అని తెలిపారు. ఈ కథలో విజయ్ సేతుపతి పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందని, విలన్ పాత్రలో కనిపించే అవకాశం ఉందని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న టీజర్ అంచనాలను మరింత పెంచింది. ఈ చిత్రంలో సముద్రఖని, కిశోర్, ఆండ్రియా జెరెమియా వంటి నటులు కూడా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులలో ‘అరసన్’ ఒకటిగా నిలవనుంది. ఇలాంటి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు డడుదల అవుతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Just In

01

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?

MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!

Akhanda2: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసలు పొందిన బాలయ్య ‘అఖండ 2 తాండవం’..

Gold Rates: ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?

Chiranjeevi Movie: ‘మనశంకరవరప్రసాద్ గారు’ షూటింగ్ పూర్తి.. ఎమోషన్ అయిన దర్శకుడు..