TG High Court: స్థానిక సంస్థల ఎన్నికలపై విచారణను హైకోర్టు నేటికి వాయిదా వేసింది. హైకోర్టు ఛీఫ్ జస్టిస్ అందుబాటులో లేకపోవటంతో ఈ నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించగా కొంతమంది బీసీలకు కల్పించిన రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిని విచారించిన హైకోర్టు రిజర్వేషన్లు 50శాతానికి మించరాదని గతంలోనే పేర్కొంది.
Also Read: TG High Court: స్థానిక సంస్థల ఎన్నికలపై.. ఈసీని ప్రశ్నించిన హైకోర్టు!
ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలి
క్రితం సారి విచారణ సందర్భంగా ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని హైకోర్టుకు తెలిపాయి. కాగా, స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు సోమవారం తుది తీర్పు ఇవ్వాల్సి ఉంది. అయితే, ప్రధాన న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో విచారణ నేటికి వాయిదా పడింది. హైకోర్టు తీర్పు తరువాత క్యాబినెట్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. మంగళవారం మధ్యాహ్నం లోపు హైకోర్టు తీర్పు వస్తుందని భావిస్తున్న ప్రభుత్వం ఆ వెంటనే క్యాబినెట్ సమావేశాన్ని జరపాలని నిశ్చయించినట్టు సమాచారం.
