Dharmendra Deol: ప్రపంచంలోని అత్యంత అందమైన ఏడుగురు హీరోల్లో ఒకరిగా ఖ్యాతి గడించిన బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర (89) కన్నుమూశారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఇటీవల ఎలాంటి వార్తలు వైరల్ అయ్యాయో తెలియంది కాదు. ఆయన బతికే ఉన్నా.. అందరూ చనిపోయారని వార్తలు, ట్వీట్స్ వేసి ఆ ఫ్యామిలీని మరింత దు:ఖంలోకి నెట్టేశారు. ఈ వార్తలపై ధర్మేంద్ర సతీమణి, బిడ్డలు ఫైర్ కూడా అయ్యారు. అనంతరం హాస్పిటల్ నుంచి ఆయనను డిశ్చార్జ్ చేసి, ఇంటి వద్దే ట్రీట్‌మెంట్ ఇస్తూ వస్తున్నారు. గతకొంత కాలంగా శ్వాసకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న, ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ధర్మేంద్ర పరిస్థితి విషమించడంతో సోమవారం మృతి (Dharmendra Passed Away) చెందినట్లుగా కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దీంతో బాలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది. ఈ మృతి వార్త తెలిసిన సినీ ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
Also Read- Bandi Saroj Kumar: సినీ ప్రపంచానికి పెద్ద సర్‌ప్రైజ్.. ‘పెద్ది’ బుచ్చిమామపై ‘మోగ్లీ’ విలన్ ప్రశంసలు!
ధర్మేంద్ర గురించి ఈ విషయాలు తెలుసా?
ధర్మేంద్ర పూర్తి పేరు ధర్మేంద్ర కెవల్ క్రిషన్ డియోల్ (Dharmendra Deol). 1935 డిసెంబర్ 8న జన్మించారు. 1954లో ప్రకాశ్ కౌర్‌ను, 1980లో బాలీవుడ్ బ్యూటీ హేమమాలినినీ వివాహం చేసుకున్నారు. వీరికి మొత్తం ఆరుగురు సంతానం. బాలీవుడ్ స్టార్స్ సన్నీ డియోల్, బాబీ డియోల్, ఈషా వీరి సంతానమే. 2012లో కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్రను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. 1960లో వచ్చిన ‘దిల్ బీ తేరా హమ్ బీ తేరే’తో ధర్మేంద్ర నటుడిగా అరంగేట్రం చేశారు. ‘షోలే’, ‘డ్రీమ్ గర్ల్’ వంటి చిత్రాలతో నటుడిగా తిరుగులేని స్టార్‌డమ్‌ను ఆయన సొంతం చేసుకున్నారు. దాదాపు 300లకు పైగా చిత్రాల్లో నటించిన ఆయన చివరి చిత్రం ‘ఇక్కీస్’. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. సినిమాలే కాదు, రాజకీయాల్లోనూ ధర్మేంద్ర తన సత్తా చాటారు. 2004 ఎన్నికలలో బికనీర్ నుంచి భారతీయ జనతా పార్టీ తరపున ఆయన ఎంపీగా గెలుపొందారు. టాలీవుడ్ విషయానికి వస్తే.. నందమూరి ఫ్యామిలీతో ధర్మేంద్రకు మంచి అనుబంధం ఉంది. 1973లో ధర్మేంద్ర నటించిన ‘యాదోంకి బారాత్’ సినిమాను ఎన్టీఆర్ ‘అన్నదమ్ముల అనుబంధం’ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో బాలకృష్ణ, మురళీ మోహన్ కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. బాలయ్య, మురళీ మోహన్‌లకు ఇదే ఫస్ట్ 100 డేస్ మూవీ. అలాగే బాలయ్య చేసిన ‘నిప్పులాంటి మనిషి’ చిత్రం కూడా ధర్మేంద్ర మూవీ రీమేకే. ఆ మధ్య క్రిష్ దర్శకత్వంలో వచ్చిన బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రంలో ధర్మేంద్ర భార్య హేమమాలిని తల్లిగా నటించిన విషయం తెలిసిందే. ఒక్క నందమూరి ఫ్యామిలీనే కాదు.. అప్పటి టాలీవుడ్ స్టార్ హీరోలందరితో ధర్మేంద్రకు మంచి అనుబంధం ఉండేదని తెలుస్తోంది.
Also Read- Uttarakhand Accident: ఉత్తరాఖండ్‌లో మరో ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 27 మందికి పైగా..
టాలీవుడ్ నివాళి
ఈ దిగ్గజ నటుడి మృతితో బాలీవుడ్‌లో ఒక శకం ముగిసిందని చెబుతూ సినీ, రాజకీయ ప్రముఖులెందరో నివాళులు అర్పిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, అమిత్ షా, గడ్కరీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వంటి వారంతా విచారం వ్యక్తం చేస్తూ… సంతాపం ప్రకటించారు. ఇక టాలీవుడ్ సినీ ప్రముఖులు ధర్మేంద్ర మృతి.. చిత్ర పరిశ్రమకు తీరని లోటని చెబుతూ నివాళులు అర్పిస్తున్నారు.
ధర్మ్‌జీ కేవలం ఒక పౌరాణిక నటుడు మాత్రమే కాదు, ఒక గొప్ప మానవతావాది కూడా. నేను ఆయన్ని కలిసిన ప్రతిసారీ అనుభవించిన ఆ వినయం, ఆప్యాయత నా హృదయాన్ని ఎంతగానో తాకాయి. నేను ఆయనతో పంచుకున్న మధుర జ్ఞాపకాలను, వ్యక్తిగత క్షణాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఆయన మరణం పట్ల నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. ఆ కుటుంబానికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన లెగసీ ఎప్పటికీ కోట్లాది మంది హృదయాలలో జీవించి ఉంటుందని ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఇంకా నందమూరి బాలకృష్ణ, రవితేజ, విశాల్ వంటి వారంతా సోషల్ మీడియా వేదికగా ధర్మేంద్ర మృతి పట్ల సంతాపం తెలియజేశారు.
Sri Dharmji was not only a legendary actor but also a remarkable human being. The humility and warmth I experienced every time I met him deeply touched my heart. I will forever cherish the fond memories and personal moments I shared with him.
My heartfelt condolences on his… pic.twitter.com/TE4witXItP
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 24, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
