Danam Nagender: స్పీకర్‌కు ఎమ్మెల్యే దానం లేఖ..
Danam Nagender(image Credit: swetcha reporter)
Political News

Danam Nagender: స్పీకర్‌కు ఎమ్మెల్యే దానం లేఖ.. వివరణకు అదనపు గడువుకు విజ్ఞప్తి

Danam Nagender: పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, స్పీకర్‌కు తన వివరణ ఇచ్చేందుకు మరింత సమయం కోరారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జారీ చేసిన నోటీసుల గడువు ఆదివారం నాడు ముగిసింది. దీంతో, మరికొంత గడువు ఇవ్వాలంటూ స్పీకర్ నోటీసులకు ఎమ్మెల్యే దానం స్పందించారు. ఈ మేరకు స్పీకర్‌‌కు ఆయన లేఖ రాశారు. దానం లేఖను స్పీకర్ గడ్డం ప్రసాద్ పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

8 మంది ముందు హాజరై వివరణ

ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 8 మంది ముందు హాజరై వివరణ ఇచ్చారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రమే వివరణ ఇవ్వాల్సి ఉంది. కడియం శ్రీహరి కూడా వివరణ ఇచ్చేందుకు అదనపు సమయం ఇవ్వాలంటూ స్పీకర్‌ను కోరారు. వీరిద్దరు ఎమ్మెల్యేలు ఏమని వివరణ ఇస్తారు?, ఎప్పుడు స్పందిస్తారు?, ఇంకేమైనా వ్యూహాలు ఉన్నాయా? అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Also Read: Medak District: బలవంతంగా భూసేకరణ.. కన్నెర్ర చేసిన రైతులు.. అధికారులను బంధించి..!

మంత్రి సీతక్క సమక్షంలో భారీ చేరికలు

తాడ్వాయి మండలం బయ్యక్కపేట గ్రామానికి చెందిన 35 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి సీతక్క సమక్షంలో హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ములుగు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా నేతలు చెప్పారు. ఈ జాబితాలో వెంకటాపూర్ మండలం జవహర్ నగర్ గ్రామానికి చెందిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీకి చెందిన 20 మంది నేతలు ఉన్నారు.

మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అర్రెం లచ్చు పటేల్

వారికి కాంగ్రెస్ కండువా కప్పి మంత్రి సీతక్క సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కల్యాణి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి భగవాన్ రెడ్డి, తాడ్వాయి మండల పార్టీ అధ్యక్షుడు బొల్లు దేవేందర్, వెంకటాపూర్ మండల పార్టీ అధ్యక్షుడు చెన్నోజు సూర్యనారాయణ, మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అర్రెం లచ్చు పటేల్, వెంకటాపూర్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బండి శ్రీను, యూత్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు మారం సుమన్ రెడ్డి, జిల్లా నాయకులు, యూత్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Also Read: Danam Nagender: దానం నాగేందర్ రాజీనామా? అనర్హత కంటే ముందే చేసే యోచన!

Just In

01

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం