CM Revanth Reddy: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 8, 9వ తేదీల్లో ప్రపంచంలోని 50దేశంలోని వ్యాపార దిగ్గజలతో సమ్మిట్ కార్యక్రమం చేయనున్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఫోర్త్ సిటీలో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్(Global Summit) ఏర్పాట్లును ఆదివారం సీఎం పరిశీలించారు. ఈ సందర్బంగా సీఎం భారత్ ఫ్యూచర్ సిటీ(Future City)లో వచ్చే నెల 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు పై అధికారులతో సమీక్షించారు. గ్లోబల్ సమ్మిట్ లో తెలంగాణ రైజింగ్ -2047 ప్రణాళికను ఆవిష్కరించునున్నారు. ఈ సమ్మిట్ కు దేశ విదేశీ ప్రతినిధులు హాజరవుతున్నందున సమ్మిట్ ఏర్పాట్లు, శాంతిభద్రతల నిర్వహణలో లోపాలు ఉండొద్దని సూచించారు. సమ్మిట్ వేదికగా తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ ఆవిష్కరణ తదితర అంశాల పై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్ధేశం చేశాను.
Also Read: Kadiyam Srihari: ఉపఎన్నికలు వస్తే పారిపోను తప్పకుండా పోటీ చేస్తా.. గెలుస్తా ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఇబ్బందులు రావొద్దని..
వివిధ దేశాల అంబాసిడర్లు కూడా పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దని అధికారులను ఆదేశించారు. పాస్ లు లేకుండా ఎవరు ఎంట్రీ కావడానికి వీలు లేదని ఆదేశాలు జారీ చేశారు. సమ్మిట్ కు సంబంధం లేని వారికి ఎట్టి పరిస్థితుల్లో ఎంట్రీ ఇవ్వకూడదన్నారు. శాఖల వారీగా పకడ్బందీగా అధికారులకు ఎంట్రీ ఉంటుందని, ఏర్పాట్లను నేను ఎప్పటికప్పుడు పరిశీలిస్తానని స్పష్టం చేశారు. పోలీస్ లు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్కింగ్ కు ఇబ్బంది రావొద్దని పేర్కొన్నారు. బందో బస్తు కు వచ్చే పోలీస్ సిబ్బంది కి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. సమ్మిట్ కు హాజరయ్యే మీడియా కు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Also Read: Global Peace: గ్లోబల్ పీస్ హానర్స్ 2025లో ఎమోషనల్ అయిన రణ్‌వీర్ సింగ్.. ఎందుకంటే?

