The Raja Saab: డిజప్పాయింట్.. రెబల్ సాబ్ సాంగ్ ఎలా ఉందంటే?
The Raja Saab Song (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

The Raja Saab: ‘పాన్ ఇండియా నెంబర్ 1 బ్యాచ్‌లర్ నేనేలే’.. ‘రెబల్ సాబ్’ సాంగ్ ఎలా ఉందంటే?

The Raja Saab: ప్రజంట్ టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ విడుదల అవుతున్నా, దానిపై అభిమానులు ఊహించని విధంగా అంచనాలను పెంచేసుకుంటున్నారు. ఆ అంచనాలను అందుకునేలా ఆ కంటెంట్ లేకపోతే.. నిర్మాణ సంస్థను దూషించే వరకు వెళుతున్నారు. ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) ‘రాధే శ్యామ్’ (Radhe Shyam) విషయంలో ఇది బాగా జరిగింది. అప్పటి నుంచి ప్రభాస్ సినిమాల విషయంలో మేకర్స్ చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతుల్లో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నా, అందులో ముందుగా వచ్చేది మాత్రం ‘ది రాజా సాబ్’ (The Raja Saab) చిత్రమే. ఈ సినిమా సంక్రాంతి సందడిని ముందే తెస్తూ.. జనవరి 9న విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రొమోషన్స్‌పై దృష్టి పెట్టి ఇప్పటికే ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ సింగిల్ ‘రెబల్ సాబ్’ (Rebel Saab Song)ని మేకర్స్ వదిలారు.

Also Read- Akhanda 2: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసిన ‘అఖండ 2’ టీమ్.. ఫొటోలు వైరల్!

ఫ్యాన్స్ డిజప్పాయింట్

ఈ సాంగ్‌కు సంబంధించి ఇప్పటికే వచ్చిన ప్రోమో మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా వచ్చిన ఫుల్ సాంగ్ మాత్రం డ్యాన్స్ విషయంలో అభిమానులను డిజప్పాయింట్ చేస్తోంది. ‘బొమ్మాళీ’ అంటూ సాగే పాటలో ప్రభాస్ డ్యాన్స్ ఏ విధంగా చేశారో తెలియంది కాదు. కానీ ఈ మధ్య ఆయన సరిగా డ్యాన్స్‌పై ఫోకస్ పెట్టడం లేదు. ఈ పాటలో డ్యాన్స్ వేరే లెవల్‌లో ఉంటుందని మేకర్స్ చెబుతూ వచ్చారు. కానీ, ఫ్యాన్స్ ఊహించుకున్నంతగా అయితే లేదనే చెప్పాలి. ఇక పాట విషయానికి వస్తే.. సంగీత దర్శకులు థమన్ ఈ పాటను చాలా విభిన్నంగా కంపోజ్ చేశారు. ఇంకా చెప్పాలంటే అసలు ఈ పాటని థమనైనా కంపోజ్ చేసింది అనేలా కూడా కొందరు అనుకుంటున్నారంటే.. ప్రభాస్ కోసం ఆయన ఎంతగా వైవిధ్యతను చాటాడో అర్థం చేసుకోవచ్చు.

Also Read- Dharma Mahesh: కాంట్రవర్సీ హీరో ధర్మ మహేష్.. తన కొడుకు బర్త్‌డే రోజు ఏం చేశాడంటే?

సాంగ్‌ హైలెట్స్ ఇవే..

ముఖ్యంగా ప్రభాస్ రియల్ లైఫ్‌కు చాలా దగ్గరగా ఉందీ సాంగ్. ‘పాన్ ఇండియా నెంబర్ 1 బ్యాచ్‌లర్ నేనేలే’.. అనే సాహిత్యంతో వచ్చిన ఈ సాంగ్ ప్రభాస్ పెళ్లి నేపథ్యంలో ఉండటం అందరినీ ఆకర్షిస్తోంది. మధ్యలో ఆధ్యాత్మికతను జోడించిన విధానం, తెర అంతా కలర్‌ఫుల్‌గా ఉండటం.. ఇవన్నీ కూడా ఫ్యాన్స్‌కు ట్రీట్ అనే చెప్పాలి. ప్రభాస్ కూడా ఫ్యాన్స్ ఎలా కావాలని అనుకుంటున్నారో.. అలా ఇందులో కనిపించి, వారి కోరిక తీర్చేశారు. ఈ విషయంలో మారుతికి అభిమానులు థ్యాంక్స్ చెబుతున్నారు. ప్రభాస్ స్టైలిష్‌గా, వింటేజ్ లుక్‌లో కనిపించిన తీరు, సాహిత్యం, థమన్ సంగీతం ఈ పాటకు హైలెట్. ప్రభాస్ డ్యాన్స్ ఒక్కటి మాత్రం కృత్రిమంగా అనిపిస్తోంది. టాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bapatla SP: సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఆ జిల్లా ఎస్పీ కీలక సూచనలు!

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకా ఏం మిగిలింది?.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Hyderabad Crime: చెంగిచెర్లలో వరుస దొంగతనాలపై క్లూ సేకరించిన పోలీసులు..?

Anaganaga Oka Raju: పండక్కి రాజు గారి హవా మామూలుగా లేదుగా.. రెండ్రోజుల గ్రాస్ ఎంతంటే?

Medaram Jatara 2026: మేడారంకు పోటెత్తిన భక్తులు.. ఓరి నాయనా ట్రాఫిక్‌తో కల్లుచెదిరేలా నిలిచిపోయిన వాహనాలు