Talasani Srinivas Yadav: జీవో 46 మళ్లీ ఇదొక మోసం అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) ఆరోపించారు. తెలంగాణ భవన్ లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. 70ఏళ్ల తర్వాత కూడా మా హక్కులు మాకు రాకపోతే బిక్షం ఎత్తుకోవాలా అని నిలదీశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పారన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ గెలిస్తే ఆరు నెలల్లోగా ఆ హామీని అమలు చేస్తామని హామీ ఇచ్చారని, సంవత్సరం తర్వాత కులగణన అని భారీ మోసానికి తెరలేపారని మండిపడ్డారు.
మళ్ళీ ఇప్పుడు డ్రామాలు
కులగణన ఎక్కడ కూడా ప్రణాళికల బద్దంగా జరిగిన దాఖలాలు లేవు అన్నారు. ముఖ్యమంత్రి 62,000 మంది లెక్క తేలలేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పారన్నారు. మళ్లీ కులగణన చేసినా తప్పుడు లెక్కలతో సరిపెట్టారని ఆరోపించారు. ఆదరాబాదరాగా జీవో లు తీశారు..ఆది మేము చెల్లదు అంటే మీరు వ్యతిరేకిస్తున్నారు అన్నారు.. మళ్ళీ ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్ తో పాటు చాలా హామీలు ఉన్నాయన్నారు. నిధులు ,బీసీ సబ్ ప్లాన్ ,బడ్జెట్ లో ఏడాదికి 20 వేల కోట్ల రూపాయలు అని రెండేళ్లలో 20% కూడా చేయలేదని మండిపడ్డారు. ఎంబీసీ ల సంక్షేమాన్ని పర్యవేక్షించేందుకు ఎంబీసీ ని మంత్రి చేస్తామన్నారని, మండలానికి ఒక నవోదయ పాఠశాల అని, చేతివృత్తులకు సాయం అన్నారు ఏదీ చేయలేదని మండిపడ్డారు.
Also Read: Football Stadium: క్రీడాకారులకు గుడ్ న్యూస్.. సిటీలో రెండు ఫుట్ బాల్ స్టేడియాలు
బీసీలకు క్షమాపణ
భవిష్యత్తులో జిల్లాలో కూడా ధర్నాలు చేపట్టబోతున్నామని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని విడిచిపెట్టేది లేదన్నారు. మా బతుకులతో కాంగ్రెస్ చెలగాటం ఆడాలనుకుంటుందని.. వణుకు పుట్టిస్తాం అని హెచ్చరించారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ బీసీ కులాలకు రిజర్వేషన్లు రాకుండా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. రేవంత్ ఇప్పుడు బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాష్ట్ర నాయకులు ఆనంద్ కుమార్ గౌడ్, రాజారామ్ యాదవ్ పాల్గొన్నారు.
Also Read: VC Sajjanar: సైబర్ మోసాలకు చెక్ పెట్టేది ప్రజల అవగాహన మాత్రమే : హైదరాబాద్ సీపీ సజ్జనార్

