MLA Murali Naik: గ్రామాభివృద్ధే కాంగ్రెస్ సర్కార్ ధ్యేయం
MLA Murali Naik ( IMAGE CREDIT: SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

MLA Murali Naik: గ్రామాభివృద్ధే కాంగ్రెస్ సర్కార్ ధ్యేయం : ఎమ్మెల్యే భూక్యా మురళి నాయక్!

MLA Murali Naik: పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కేవలం స్వప్రయోజనాల కోసం కొన్ని పట్టణాలను మాత్రమే అభివృద్ధి చేశారని, మారుమూల గ్రామాల్లో ప్రజల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని మహబూబాబాద్ ఎమ్మెల్యే డా. భూక్యా మురళి నాయక్ ఆరోపించారు. దేశాభివృద్ధిలో గ్రామాలే కీలకమని నమ్మే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్, గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక చొరవ చూపుతుందని ఆయన అన్నారు.  మహబూబాబాద్ మండలం వేంనూరు గ్రామంలో రూ. 4 కోట్ల వ్యయంతో నిర్మించబోయే నూతన సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మురళి నాయక్ శంకుస్థాపన చేశారు.

Also Read: MLA Murali Naik: పారిశుద్ధ్య విషయంలో అలసత్వం వహించొద్దు: ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్

పేదలకు 200 యూనిట్ల

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో గ్రామాలలో సబ్ స్టేషన్లు దూరంగా ఉండటం వల్ల విద్యుత్ అంతరాయం ఏర్పడి, వృద్ధులు, చిన్న పిల్లలకు ఇబ్బందులు ఎదురయ్యేవని గుర్తు చేశారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని, ప్రతి గ్రామంలో విద్యుత్ అంతరాయం ఉండకూడదనే తపనతో మారుమూల గ్రామాలలో సబ్ స్టేషన్ నిర్మాణాలను చేపట్టి, ఉచిత విద్యుత్ అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. ఇప్పటికే గృహజ్యోతి పథకం ద్వారా పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తుందంటే అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనమేనని ఆయన సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళి నాయక్ వెంట విద్యుత్ శాఖ అధికారులు, మండల నాయకులు, గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read: MLA Murali Naik: విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం : ఎమ్మెల్యే మురళీ నాయక్

Just In

01

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..

Sree Vishnu: శాకాహార ప్రియులందరికీ హీరో శ్రీ విష్ణు సజెషన్ ఇదే..

Crime News: జైలు నుంచి ఇటీవలే విడుదల.. అంతలోనే చంపేశారు.. దారుణ ప్రతీకార హత్య

Bandla Ganesh: ‘మోగ్లీ 2025’పై బండ్ల గణేష్ రివ్యూ.. ‘వైల్డ్’ అర్థమే మార్చేశారు

Bondi Beach Attack: యూదులే టార్గెట్.. బోండీ బీచ్ ఉగ్రదాడిలో సంచలన నిజాలు వెలుగులోకి