Hidma Encounter: హిడ్మా ఎన్ కౌంటర్ ఒక బూటకం
Hidma Encounter ( image CREDIT: SWETCHA REPORTER)
ఆంధ్రప్రదేశ్

Hidma Encounter: హిడ్మా ఎన్ కౌంటర్ ఒక బూటకం.. అతడ్ని దేవ్ జీనే చంపించాడు.. మనీష్ కుంజం

Hidma Encounter: కేంద్ర ప్రభుత్వానికి మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఎన్కౌంటర్ బూటకమని, దేవ్జీనే చంపించాడని, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ అటవీ ప్రాంతంలో జరిగిన దాడులన్నింటికీ ఆయననే బాధ్యుడిని చేస్తూ తప్పుడు ప్రచారం చేశారని బస్తారియా రాజు మోర్చా నాయకుడు మనీష్ కొంచెం ఆరోపించారు. ఈ విషయం కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  మనీష్ కుంజం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులు కీలక బాధ్యతల్లో ఉన్నప్పుడు జరిగిన దాడులన్నీ కూడా హిడ్మా ఆధ్వర్యంలోనే జరిగాయని దుష్ప్రచారం చేయడం మంచిది కాదన్నారు. 50 మంది ఒకే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా అరెస్ట్ అవుతారని వారు అక్కడకు ఎందుకు వెళ్లారని మనీష్ కొంచెం ప్రశ్నించారు.

దేవ్ జి నే పోలీసులకు సమాచారం

మావోయిస్టు పార్టీ దేవ్ జి వీరందరిని ఏపీకి తీసుకెళ్లి సరెండర్ చేయించి తన భవిష్యత్తు కోసం ప్రణాళిక రచించారని ఆరోపించారు. మావోయిస్టులంతా అరెస్టు అవ్వాలంటే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోనే కావాలని ఇందులో ఎక్కువమంది సుక్మా, బీజాపూర్ జిల్లాలతో పాటు సమీప ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే హిడ్మా ను చంపించేందుకు దేవ్ జి నే పోలీసులకు సమాచారం అందించి దుశ్చర్యకు పాల్పడేలా చేశాడని ఆరోపించారు. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారి నాయకత్వం వహిస్తున్నారన్న విషయం గుర్తుపెట్టుకోవాలని మనీష్ కుంజం విమర్శించారు.

Also Read: Hidma Encounter: భారీ విధ్వంసం చేయడానికి ఆంధ్రాకు హిడ్మా దళం.. నూతన టెక్నాలజీ చిక్కులో పడి ఎన్కౌంటర్!

మనీష్ కొంచెం ఆవేదన వ్యక్తం

హిడ్మా ను ఎన్కౌంటర్ చేసిన తర్వాత మిగతా వారంతో సేఫ్ అయ్యారని, తెలుగు నాయకులంతా ఇక్కడి ప్రభుత్వంతో కలిసి క్షేమంగా ఉన్నారన్నారు. తాడిమెట్ల ఘటన సమయంలో రామన్న సబ్ జోనల్ కమిటీ కార్యదర్శిగా ఉన్నారని, 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన ఘటనలో కూడా వేరే నాయకులు సారథ్యం వహించారని తెలిపారు. ఆ సమయంలో జోనల్ కమిటీలో ఉన్న హిడ్మా ను బాధ్యుడిని చేశారని మనీష్ కొంచెం ఆవేదన వ్యక్తం చేశారు. జీరం ఘాట్ ఘటనలోనూ హిడ్మా దే మాస్టర్ మైండ్ అనడం, క్యాంపును దగ్ధం చేసిన ఘటనకు కూడా ఆయనే బాధ్యుడిని చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. బస్తర్ అటవీ ప్రాంతంలో జరిగిన ప్రతి ఘటనలోనూ తమ ప్రాంత ఆదివాసి యువకులను బదనాం చేశారన్నారు.

ప్రతి ఘటనకు కూడా ఆంధ్రా నాయకులే బాధ్యత

దండకారణ్యంలో జరిగిన ప్రతి ఘటనకు కూడా ఆంధ్రా నాయకులే బాధ్యత అని బస్తర ప్రాంత యువకులు నాయకుల ఆదేశాలను మాత్రమే పాటించారన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులు ఏది చెప్తే అది చేశారని, బస్తర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఘటనల్లో హిడ్మా మాస్టర్ మైండ్ లేదని, మాస్టర్ మైండ్ అంతా కూడా ఆంధ్ర వారిదేనని మనిషి కొంచెం ఆరోపించారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా ఏర్పడిన సల్వాజుడుం ఏర్పాటుకు కూడా ప్రభుత్వానికి బాధ్యత అన్నారు. చత్తీస్గఢ్ కు చెందిన మావోయిస్టులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లి లొంగి పోవాల్సిన అవసరం లేదని ఇక్కడే లొంగిపోతే పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులకు స్థానిక పోలీసులపై విశ్వాసం పెట్టుకుని లొంగిపోయేందుకు వచ్చే వారికి తాను అండగా ఉంటానన్నారు.

Also Read: Hidma Encounter: భారీ ఎన్ కౌంటర్.. కరుడుగట్టిన మావోయిస్టు హిడ్మా హతం

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..