Sridhar Babu: రూ.5 లక్షల కోట్ల స్కాం ఆరోపణ నిరాధారం
Sridhar Babu (IMAGE Credit: swetcha reporter)
Political News

Sridhar Babu: రూ.5 లక్షల కోట్ల స్కాం.. దమ్ముంటే ఆధారాలను బయటపెట్టి మాట్లాడు!

Sridhar Babu: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.5 లక్షల కోట్ల విలువైన 9,298 ఎకరాల భూమిని కేవలం రూ.4,500 కోట్లకు విక్రయించాలని చూస్తున్నారంటూ ఆరోపించిన మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. ‘రూ.5 లక్షల కోట్ల స్కాం ఆరోపణ పూర్తిగా నిరాధారం, అవాస్తవం.. దమ్ముంటే ఆధారాలను బయటపెట్టి మాట్లాడాలి. లేదంటే.. మీరు పదే పదే చేస్తున్న ప్రచారం కేవలం పచ్చి అబద్ధం, రాజకీయ దురుద్దేశం అని ఒప్పుకుని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.

రూ.5 లక్షల కోట్ల స్కాం అంటూ పాత రికార్డు

ఈ మేరకు  ఒక మీడియా ప్రకటన విడుదల చేశారు. ఆరోపణలు చేయడం, అబద్ధాలు ప్రచారం చేయడం బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావుకు వెన్నతో పెట్టిన విద్య’ అని ధ్వజమెత్తారు. తిమ్మిని బమ్మిని చేయడంలో వారిని మించిన వారు మరొకరు లేరని మరోసారి నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. ‘మీరు అధికారం కోల్పోయారనే బాధతో రూ.5 లక్షల కోట్ల స్కాం అంటూ పాత రికార్డును పదే పదే వాయించే బదులు, మీరు ఆగస్టు 2023లో తెచ్చిన ఫ్రీహోల్డ్ జీవోల 19, 20, 21 వెనుకున్న లక్షల కోట్ల రూపాయల మతలబు గురించి ముందు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.

Also ReadSridhar Babu: ఏఐతో పోయే ఉద్యోగాల కంటే వచ్చేవే ఎక్కువ.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్

చౌకబారు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు 

గతంలో మంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేయడం సిగ్గుచేటని శ్రీధర్ మండిపడ్డారు. ‘‘పారదర్శకంగా రాష్ట్ర ఖజానాకు రూ.4 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల వరకు ఆదాయాన్ని సమకూర్చేందుకు మేము ప్రయత్నిస్తుంటే.. స్కామ్‌లు చేసి చేసి అలవాటైన బీఆర్ఎస్ నేతలకు మాత్రం ఇది మింగుడు పడటం లేదు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు 4 నెలల ముందు ప్రభుత్వ లీజ్ ల్యాండ్స్‌కు ఫ్రీహోల్డ్ రైట్స్ ఇచ్చి, 100 శాతం, 200 శాతం ఛార్జీలు విధించి మీరు వసూలు చేద్దామనుకున్న రూ.లక్షల కోట్ల సంగతేంటి. అసలు ప్రభుత్వంతో సంబంధం లేని సీఎం రేవంత్ రెడ్డి సోదరులపై ఆరోపణలు చేస్తే రాష్ట్ర ప్రజలు నమ్ముతారనే భ్రమ నుంచి బయటకు రావాలి.

ప్రాపర్టీస్ కేవలం 4,740 ఎకరాలే

రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా యువతకు ఉద్యోగాలు దక్కకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో సమాధానం చెప్పాలి. వాస్తవాలను దాచిపెట్టి తమ ప్రభుత్వం 9,292 ఎకరాలు అమ్మకానికి పెట్టిందంటూ మాపై దుష్ర్పచారం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ భూముల్లో పరిశ్రమలకు ప్లాటింగ్ చేసిన ఏరియా, లేదా ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీస్ కేవలం 4,740 ఎకరాలే. ఇవి పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భూములు. మిగిలిన భూములు రోడ్లు, డ్రెయినేజీ లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించాం. ఇప్పటికైనా నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలి’’ అని హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలకు మంత్రి శ్రీధర్ బాబు హితవు పలికారు.

Also Read: Sridhar Babu: గత ప్రభుత్వంలోనే ఆర్థిక అరాచకం.. కేటీఆర్‌‌పై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం

Just In

01

Gadwal District: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.. పట్టుకుని వదిలేసిన పీడిఎస్ బియ్యం వాహనం ఎవరిది?

Khammam Municipal Elections: ఎదులాపురం మున్సిపాలిటీ ఎన్నికలకు సిద్ధం.. 10 ఏళ్ల ప్రత్యేక అధికారి పాలనకు ముగింపు?

Medaram Jatara 2026: మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు చేపట్టిన కాంగ్రెస్ సర్కార్.. మూడు కోట్ల భక్తుల కోసం సమగ్ర ప్రణాళిక!

Ranga Reddy District: రైతుల భూములపై రియల్టర్ల కన్ను.. ఫామ్ ల్యాండ్ వెంచర్లపై నియంత్రణ ఎక్కడ?

Municipal Elections: మున్సిపాలిటీలకు రిజర్వేషన్ల ఖరారు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం!