Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’.. ఫస్డ్ డే కలెక్షన్స్!
Raju Weds Rambai (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’.. తొలి రోజు షాకింగ్ కలెక్షన్స్!

Raju Weds Rambai: టాలీవుడ్‌లో ఇటీవల చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూ తాజాగా విడుదలైన ‘రాజు వెడ్స్ రాంబాయి’ (Raju Weds Rambai) చిత్రం అద్భుతమైన ఓపెనింగ్‌ను నమోదు చేసింది. అఖిల్ రాజ్ (Akhil Raj), తేజస్విని (Tejaswini) జంటగా నటించిన ఈ హార్ట్-టచ్చింగ్ లవ్ స్టోరీ, విడుదలైన తొలి రోజే ప్రేక్షకుల నుండి విశేష స్పందనను రాబట్టుకోవడంతో చిత్రయూనిట్ చాలా హ్యాపీగా ఉంది. ఈ చిత్రం తొలి రోజున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రూ. 1.47 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి, ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. చిత్ర నిర్మాతలు అధికారికంగా ఈ కలెక్షన్ల పోస్టర్‌ను విడుదల చేశారు. ఒక చిన్న బడ్జెట్ సినిమాకు తొలి రోజు ఈ స్థాయిలో వసూళ్లు రావడం టాలీవుడ్‌లో ఒక శుభపరిణామంగా చెప్పవచ్చు. ఈ ఊపు చూస్తుంటే, రాబోయే రోజుల్లో ఈ సినిమా కలెక్షన్ల పరంగా మరింత దూకుడు చూపించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Also Read- Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ నెక్ట్స్ ఫిల్మ్‌కు పవర్ ఫుల్ టైటిల్.. ప్రోమో అదిరింది

కంటెంట్ కింగ్.. కథకు జై!

ఈ సినిమాకు ఇంతటి భారీ విజయం లభించడానికి ప్రధాన కారణం బలమైన కంటెంట్, పాజిటివ్ టాక్. ఇండస్ట్రీ నుండి లభించిన అపారమైన మద్దతుతో పాటు, సినిమాలోని కథాంశం ప్రేక్షకులను అమితంగా ఆకర్షిస్తోంది. మరీ ముఖ్యంగా, ఈ హృదయాన్ని తాకే ప్రేమకథ యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించబడిందని వస్తున్న టాక్ సినిమాపై ఇంట్రెస్ట్‌ను మరింత పెంచింది. సినిమాలోని క్లైమాక్స్ అద్భుతంగా ఉందని, ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తుందని వస్తున్న రివ్యూలు, ఈ సినిమాను తప్పక చూడాలనే ఆసక్తిని పెంచుతున్నాయి. సాయిలు కంపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, నిజ జీవితంలోని ఒక ప్రేమ కథను మనసుకు హత్తుకునేలా చూపించడంలో విజయవంతమైందని చెప్పుకోవచ్చు.

Also Read- Akhanda 2: ‘ఓజీ’ రేంజ్‌లో కలెక్షన్స్ రాబడితేనే.. కొండంత బ్రేకీవెన్ టార్గెట్!

నిర్మాణ భాగస్వామ్యం, గ్రాండ్ రిలీజ్

ఈ చిత్రాన్ని డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్‌పై వేణు ఊడుగుల (Venu Udugula), రాహుల్ మోపిదేవి సంయుక్తంగా నిర్మించారు. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ వంటి ప్రముఖ బ్యానర్స్‌పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేశారు. వీరి ప్రచారం, సహకారం కూడా తొలి రోజు కలెక్షన్లకు బాగా దోహదపడింది. దర్శకుడు వేణు ఊడుగుల నిర్మాతగా మారి నిర్మించిన ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్స్ మద్దతు కూడా లభిస్తోంది. టాలీవుడ్ డైరెక్టర్స్ ఈ సినిమాకు వస్తున్న స్పందనను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ.. యూనిట్‌కు అభినందనలు తెలుపుతున్నారు. మొత్తం మీద, ‘రాజు వెడ్స్ రాంబాయి’ తెలుగు ప్రేక్షకులకు నచ్చిన బలమైన కంటెంట్‌తో కూడిన సినిమాగా నిరూపించుకుంటోంది. ఈ సినిమా లాంగ్ రన్‌లో ఎన్ని రికార్డులను సృష్టిస్తుందో, ఎంత కలెక్షన్ రాబడుతుందో చూడాలి. రెండో రోజు కూడా ఈ సినిమాకు కలెక్షన్స్ కుమ్మేశాయని తెలుస్తోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Chamal Kiran Kumar Reddy: ట్రిపుల్ఆర్ మూసీ రీజువెనేషన్ కు కేంద్రం సహకరించాలి : ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి

Srinivas Goud: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Balakrishna: బోయపాటి నోటి వెంట చిరు, ప్రభాస్ పేరు.. హర్టయిన బాలయ్య!

Tollywood: రషా తడానీ, హర్షాలి.. నెక్ట్స్ టాలీవుడ్‌ను ఊపేసే భామలు వీరేనా?

Sahakutumbanam: తన ఫ్రెండ్ చనిపోతే.. ఆసక్తికర విషయం చెప్పిన బుచ్చిబాబు సానా!