Actress Hema: నా కేసు కొట్టేశారు.. నా పరువును తీసుకొచ్చిస్తారా?
Actress Hema (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Actress Hema: నా కేసు కొట్టేశారు.. పోయిన నా పరువును తీసుకొచ్చిస్తారా?

Actress Hema: నటి హేమ (Hema) ఓ గుడ్ న్యూస్ షేర్ చేస్తూ.. మీడియాకు ఓ వీడియోను విడుదల చేశారు. అందులో.. ‘‘ఇటీవల మా అమ్మ చనిపోయారు. ఆ దు:ఖాన్ని గుండెల్లో దాచుకుని, మీతో ఓ గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. బెంగళూర్ హైకోర్టు (High Court of Karnataka) వారు నాపై ఉన్న కేసు (Hema Case)ని కొట్టేశారు. ఈ సంతోషకరమైన విషయాన్ని అమ్మతో కూడా షేర్ చేసుకున్నాను. నవంబర్ 3 జడ్జిమెంట్ వచ్చింది. కాకపోతే, ఆ కాపీ చేతికి వచ్చే వరకు అనౌన్స్ చేయకూడదని అన్నారు. అందుకే ఇప్పటి వరకు షేర్ చేసుకోలేకపోయాను. ఈలోపు అమ్మకి సడెన్‌గా స్ట్రోక్ రావడం, చనిపోవడం జరిగింది. అమ్మ నా స్ట్రెంత్, ధైర్యం. ఈ రోజు నేను ఇలా ఉండటానికి కారణం మా అమ్మ. ఇది నేను చాలా సార్లు చెప్పాను. నాకంటూ ఒక ఇష్యూ వచ్చే సరికి.. అమ్మ తట్టుకోలేకపోయింది. నాపై వచ్చిన ట్రోల్స్‌తో అమ్మ బాగా కృంగిపోయింది. అప్పుడే చెప్పాను, అమ్మకు హెల్త్ బాలేదని.

Also Read- Bigg Boss Telugu 9: అందరూ ఒక్కరికే సపోర్ట్ చేస్తారా అంటూ రీతూ ఫైర్.. అడ్డంగా దొరికేసిన తనూజ!

మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నా

సెలబ్రిటీ అయినంత మాత్రాన మాపై ట్రోల్స్ చేసే అధికారం ఎవరికి ఉంది? ఫేక్ న్యూస్‌లు వేయవద్దు అని మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. ఒక్క ఫేక్ న్యూస్‌ని కవర్ చేయడానికి ఎంతగా కిందకు వెళ్లాలో అంతకు వెళ్లి, నాపై ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. నేను ఆ రోజు కూడా చెప్పాను. ఫేక్ న్యూస్ వేయకండి. నేను నిర్దోషిని, నేను ఏ తప్పూ చేయలేదు.. సింహం రెండు అడుగులు వెనక్కి వేస్తుందంటే పారిపోతున్నట్టు కాదు, కచ్చితంగా వస్తాను అని చెప్పా. ఈ రోజు వచ్చా, నిలబడ్డా. భగవంతుడు నాయందు ఉన్నాడు.. నేను కేసు గెలిచాను. కానీ, మా అమ్మ చనిపోయింది. నాపై ట్రోల్స్ వేసిన వారందరూ ఇప్పుడు మా అమ్మను తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా? ఒకవేళ నేను చచ్చిపోయి ఉంటాను. ఇప్పుడు తీర్పు వచ్చి ఉండొచ్చు.. అప్పుడు నన్ను వీళ్లంతా బతికిస్తారా? మనస్సాక్షి అంటూ ఒకటి ఉంటుంది.

Also Read- Ramanaidu Studios: జిహెచ్ఎమ్‌సీ నోటీసులపై రామానాయుడు స్టూడియోస్ రియాక్షన్ ఇదే..

ఎవ్వరినీ వదలను

ఎన్నిసార్లు.. ఎంత పోరాడాలి? పోరాడుతూనే ఉంటామా? ఆ దేవుడు, మా అమ్మ దయవల్ల బతికాను నేను, లేకపోతే నా పరిస్థితి ఏంటి? ఒకటిన్నర సంవత్సరం నుంచి నాలో నేనే మదనపడిపోతున్నాను. మానసికంగా, శారీరకంగా చాలా బాధపడ్డాను. నా హీరో, డైరెక్టర్స్ ఎవరికీ ఫోన్ చేయలేకపోయాను. వాళ్లు నన్ను ఏమీ అనడం లేదు. కానీ మాట పడింది నేను, అవమాన భారాన్ని బరించింది నేను. హెల్త్ పాడైపోయింది మా అమ్మకి. నేను లైవ్‌లో బిర్యానీ చేస్తే.. దానిపై కూడా ట్రోలింగ్ చేశారు. నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను. నా బ్లడ్ టెస్ట్‌లు వాళ్ల దగ్గర లేవు.. ఇప్పుడే తీసుకుంటున్నారని చెప్పినా, రకరకాలుగా వార్తలు రాసేశారు. మీకేం రైట్ ఉందని మా మీద ఇలాంటి రాతలు రాస్తారు. ఇప్పుడు నా కేసు కొట్టేశారు. ఇప్పుడేం చేస్తారు.. పోయిన నా పరువును తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా? ఒకటిన్నర సంవత్సరంగా బయటకు కూడా వెళ్లలేకపోయాను. నాపై ట్రోల్స్ చేసిన వారిని ఎవ్వరినీ వదలను. అందరికీ గుణపాఠం చెప్పే తీరుతాను. ఇప్పటికైనా ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ అని వేయడం మానేసి, అసలు విషయం చెప్పండి. నిజాన్ని నిజంగా వేయండి.. ప్లీజ్’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Chamal Kiran Kumar Reddy: ట్రిపుల్ఆర్ మూసీ రీజువెనేషన్ కు కేంద్రం సహకరించాలి : ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి

Srinivas Goud: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Balakrishna: బోయపాటి నోటి వెంట చిరు, ప్రభాస్ పేరు.. హర్టయిన బాలయ్య!

Tollywood: రషా తడానీ, హర్షాలి.. నెక్ట్స్ టాలీవుడ్‌ను ఊపేసే భామలు వీరేనా?

Sahakutumbanam: తన ఫ్రెండ్ చనిపోతే.. ఆసక్తికర విషయం చెప్పిన బుచ్చిబాబు సానా!