Labour Policy: దేశంలో పని దొరికే అవకాశాలు పెరిగాయా..?
Jobs ( Image Source: Twitter)
జాతీయం

Labour Policy: దేశంలో పని దొరికే అవకాశాలు పెరిగాయా.. 29 చట్టాల విలీనం తర్వాత వచ్చిన భారీ మార్పులు?

 Labour Policy: భారతదేశంలో దశాబ్దాలుగా అమల్లో ఉన్న 29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చిన కేంద్ర ప్రభుత్వం, కార్మిక వ్యవస్థలో స్వాతంత్య్రానంతర కాలంలో జరిగిన అతిపెద్ద సంస్కరణగా దీనిని ప్రచారం చేస్తోంది. అయితే, ఈ మార్పులు నిజంగా సింప్లిఫికేషన్ కే దారి తీయనున్నాయా? లేక పాత చట్టాలను కొత్త కవర్‌లో పెట్టినట్టేనా? అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

ఏ నాలుగు కోడ్‌లు?

Code on Wages (2019), Industrial Relations Code (2020), Code on Social Security (2020), Occupational Safety, Health and Working Conditions Code (2020). విడివిడిగా ఉన్న చట్టాలను ఒకే ఫ్రేమ్‌వర్క్‌లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

భారత కార్మిక చట్టాలు చాలా క్లిష్టంగా ఉన్నాయన్న విమర్శలు ఎన్నో సంవత్సరాలుగా వస్తూనే ఉన్నాయి. వేతనాల నుంచి ఫ్యాక్టరీలు, కాంట్రాక్ట్ లేబర్ నుంచి సొసైటీ సెక్యూరిటీ వరకు, అన్నింటికి తదితర చట్టాలు, రిజిస్ట్రేషన్లు, తనిఖీలు వంటివి ఉండేవి. వ్యాపారాలు ఒకే అంశానికి సంబంధించి ఎన్నో విభాగాలకు వెళ్లాల్సి రావడం వల్ల గందరగోళం ఎక్కువగా ఉండేది. అదనంగా, పలుచట్టాలు స్వాతంత్య్రానికి ముందే వచ్చినవి కావడంతో, నేటి ఉద్యోగ పరిస్థితులకు పూర్తిగా సరిపోకపోవడం ప్రధాన సమస్యగా మారింది.

Also Read: GHMC Tax Collection: ప్రాపర్టీ ట్యాక్స్ టార్గెట్ ఫిక్స్ చేసిన బల్దియా.. వసూలు చేయకుంటే జీతాలు లేవని స్పష్టీకరణ

కొత్త లేబర్ కోడ్‌లతో కార్మికుల పరిస్థితిలో ఏం మారుతుంది?

భారత ప్రభుత్వం అమలు చేయబోతున్న నాలుగు కొత్త లేబర్ కోడ్‌లు ఉద్యోగుల పని జీవితం, భద్రతా హక్కులు, వేతన వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. ఇవి అమల్లోకి వస్తే, కార్మికులకు కొన్ని స్పష్టమైన లాభాలు కనిపించొచ్చు. అయితే, మరోవైపు కొన్ని ఆందోళనలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

కార్మికులకు కలిగే అవకాశమైన లాభాలు

1. వేతనాల్లో మరింత రక్షణ

కొత్త కోడ్‌లు వేతన నిర్వచనాలను స్పష్టంగా చేస్తుండటంతో, బేసిక్ పే అలవెన్సులు వంటి అంశాలపై జరిగే వివాదాలు తగ్గే అవకాశం ఉంది. కనిష్ట వేతనాలను మరింత సమగ్రంగా అమలు చేయడానికి ఇది తోడ్పడుతుంది.

2. సోషల్ సెక్యూరిటీ పరిధి విస్తరణ

PF, ESI, గ్రాచ్యుటీ వంటి లాభాలు మరింత మంది ఉద్యోగులకు చేరే అవకాశం ఉంది. ముఖ్యంగా, అమలు సక్రమంగా జరిగితే, వేలాది మంది అనియంత్రిత రంగ కార్మికులకు కూడా భద్రతా వలయాలు అందే అవకాశం ఉంది.

3. గిగ్, ప్లాట్‌ఫార్మ్ వర్కర్లకు చట్టబద్ధ గుర్తింపు

స్విగ్గీ, జొమాటో, ఊబర్, రైలన్స్ వంటి ప్లాట్‌ఫార్మ్‌లలో పనిచేసే వర్కర్లు తొలిసారి చట్టపరమైన “worker category” లో చేర్చబడ్డారు.
వీరి కోసం ప్రత్యేక సోషల్ సెక్యూరిటీ ఫండ్ ప్రతిపాదించడం ఒక కీలక మార్పుగా భావిస్తున్నారు.

4. భద్రత & వర్క్ కండిషన్‌లలో మెరుగుదల

ఒకే కోడ్ కింద సేఫ్టీ స్టాండర్డ్స్‌ను సమీకరించడం వల్ల ఫ్యాక్టరీలు, గనులు, ప్రమాదకర రంగాల్లో పనిచేసే కార్మికులకు మెరుగైన రక్షణ లభించొచ్చు.

5. ఉద్యోగ నిబంధనల్లో స్పష్టత

ప్రతీ ఉద్యోగికి compulsory offer letter ఇవ్వాలని కోడ్ స్పష్టంగా చెబుతోంది. దీంతో పనిచేసే నియమాలు, అంచనాలు, వేతన నిర్మాణం మరింత పారదర్శకంగా మారే అవకాశం ఉంది.

Just In

01

Huzurabad: హుజురాబాద్ పురపాలక సంఘం పరిధిలో.. వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితా విడుదల!

MP Dharmapuri Arvind: కేటీఆర్ మాది గాలివాటమా? మీ చెల్లిని అడుగు.. ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు!

BJP Group Politics: బీజేపీలో గ్రూప్ పాలిటిక్స్.. ఆ తరహా రాజకీయాలుంటే తప్పేంటి.. బీజేపీ ఎంపీల భిన్న స్వరాలు!

Naveen Polishetty: క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తే.. అవుట్ పుట్ ‘రాజు’లా ఉంటుంది

CM Revanth Reddy: ఆదిలాబాద్‌లో యూనివర్సిటీ, ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేస్తాం.. నిర్మల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు!