Ponnam Prabhakar: ఓవర్ లోడ్ తో వాహనం పట్టుబడితే పర్మిట్ రద్దు
Ponnam Prabhakar ( image credit: twitter)
Telangana News

Ponnam Prabhakar: ఓవర్ లోడ్ తో వాహనం పట్టుబడితే పర్మిట్ రద్దు చేస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక

Ponnam Prabhakar: ఓవర్ లోడ్ అయిన వాహనాలు సీజ్ చేయడంతో పాటు, రెండోసారి ఓవర్ లోడ్ తో వాహనం పట్టుబడితే ఆ వాహనం పర్మిట్ రద్దు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) హెచ్చరించారు. రవాణా శాఖ ఉన్నత స్థాయి అధికారులతో  హఐదరాబాద్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించి మరణాల రేటును నివారించే విధంగా అధికారులు పని చేయాలని ఆదేశించారు. గత 10 రోజుల వ్యవధిలో తనిఖీలు చేపట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన 4748 కేసులు నమోదు చేశారని, మొత్తం 3420 వాహనాలు సీజ్ చేసినట్లు వెల్లడించారు.

Also Read: Ponnam Prabhakar: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.. మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక!

మైనింగ్ శాఖతో సమన్వయం చేసుకోవాలి

ఎన్ఫోర్స్మెంట్ బృందాలు తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు ఓవర్ లోడ్ వల్లే అధికంగా జరుగుతుండడంతో దానిపై దృష్టి సారించారు. ఓవర్ లోడ్ వాహనం రెండోసారినడిపి పట్టుబడితే డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓవర్ లోడ్ పై మైనింగ్ శాఖతో సమన్వయం చేసుకోవాలని, ఎక్కడైతే వాహనాల లోడింగ్ జరుగుతుందో అక్కడే నివారించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హెవీ వెహికల్ డ్రైవర్ కి లైసెన్సు రెన్యువల్ సమయంలో పునఃశ్చరణ తరగతులు ఏర్పాటు చేసేలా కార్యాచరణ తీసుకోవాలని సూచించారు.

ప్రమోషన్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి

రోడ్డు నిబంధనలు అతిక్రమిస్తున్న సమాచారాన్ని ప్రజల నుంచి సమాచారం వచ్చిన రవాణా శాఖ అధికారులు వెంటనే స్పందించాలని ఆదేశించారు. జనవరిలో జరిగే రోడ్డు భద్రత మాసోత్సవాలపై ఇప్పటినుంచే కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రవాణా శాఖలో పెండింగ్ లో ఉన్న ఖాళీల భర్తీ చేయడంతో పాటు, ప్రమోషన్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి 10 రోజులకు ఒకసారి ఎన్ఫోర్స్మెంట్ పై సమీక్షనిర్వహించి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి , రవాణా శాఖ కమిషనర్ ఇలంబరితి , జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, రమేష్, శివ లింగయ్య పాల్గొన్నారు.

Also Read: Ponnam Prabhakar: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కొత్తగా 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు, తీరనున్న కష్టాలు

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!