Virat Kohli Played Score Says Ex India Star Aakash Chopra
స్పోర్ట్స్

Please: డోంట్ కాల్ కింగ్‌, వైరల్ అవుతున్న కోహ్లీ డైలాగ్స్‌

Don’t Call King, Kohli’s Dialogues Going Viral : ఐపీఎల్ 17వ సీజన్ మరో రెండు రోజుల్లో షురూ కానుంది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ అన్ బాక్స్ పేరిట ఒక ప్రోగ్రాం నిర్వహించింది. ఫ్యాన్స్‌ ఎక్కువమంది ప్రోగ్రాంకి వచ్చారు. అందరూ కింగ్ కొహ్లీ అని పిలుస్తున్నారు. తను 2008 నుంచి ఒకే ఫ్రాంచైజీకి ఆడుతున్నాడు. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా దానీష్ సేత్ వచ్చాడు.

అయితే తను కూడా అందరిలాగే కింగ్ కొహ్లీ అని పిలిచే సరికి తను స్వీట్‌గా వార్నింగ్‌ ఇచ్చాడు. నన్ను విరాట్ అని పిలవండి చాలు.. నిజానికి ఆ పేరు పెట్టి పిలుస్తుంటే నేను చాలా ఇబ్బందిగా ఫీలవుతున్నాను. అంతేకాదు అది ఒక నెగిటివ్ వైబ్రేషన్‌లా క్రియేట్ అవుతుంటుంది. మనం నిజంగానే కింగ్ ఏమో అనే భ్రాంతిని కలిగిస్తుంది. అది అప్పుడప్పుడు ఆటపై కూడా ఎఫెక్ట్‌ చూపిస్తుంటుంది. ఇక నుంచి ఫ్యాన్స్‌ అందరూ విరాట్ అనే పిలవండి. ఆ పేరైతేనే నాకు కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఊరికినే లేనిపోని ట్యాగ్‌లు పెట్టి నన్ను ఇబ్బందిపెట్టవద్దని అందరిని వేడుకున్నాడు. ప్రస్తుతం కోహ్లీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Read More: తారాస్థాయికి క్రికెటర్ల ఫ్యాన్స్‌ మధ్య మాటల యుద్ధం

ఇక విరాట్ కోహ్లీ బెంగ‌ళూరు జ‌ట్టుకు ఐపీఎల్ టోర్నీ మొద‌టి సీజ‌న్ (2008) నుంచి ఆడుతున్నాడు. దీంతో ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఆయ‌న‌ను ‘కింగ్ కోహ్లీ’ అని ముద్దుగా పిలుస్తుంటారు. అయితే, ఈ కార్యక్రమంలో విరాట్ కోహ్లీ ఇదే విష‌యమై హోస్ట్ దానీష్ సేత్‌తో పాటు అభిమానుల‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.ఇక ఈ కార్యక్రమంలో ఇటీవ‌ల డ‌బ్ల్యూపీఎల్ ట్రోఫీ గెలిచిన ఆర్‌సీబీ మ‌హిళా జ‌ట్టును బెంగ‌ళూరు యాజ‌మాన్యం ఘ‌నంగా స‌త్క‌రించింది.

డ‌బ్ల్యూపీఎల్ రెండో సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ను ఓడించి బెంగ‌ళూరు టైటిల్ కైవ‌సం చేసుకున్న విష‌యం తెలిసిందే. దీంతో ఆర్‌సీబీ అభిమానులు 16 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించి త‌మ కోరిక‌ను నెర‌వేర్చార‌ని సంబ‌ర ప‌డిపోతున్నారు. ఈ విష‌య‌మై కూడా కోహ్లీ మాట్లాడాడు.ఆర్‌సీబీ మ‌హిళ‌లు డ‌బ్ల్యూపీఎల్ టైటిల్ గెల‌వ‌డం నిజంగా అద్భుతం. మేము కూడా ఈసారి ఐపీఎల్‌లో విజ‌యం సాధించి ట్రోఫీల‌ను డ‌బుల్ చేస్తే, అది క‌చ్చితంగా ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పుకొచ్చాడు.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు