Akhanda 2 Trailer: ‘అఖండ 2: తాండవం’ మూవీ ట్రైలర్ రివ్యూ
Akhanda 2 Trailer (Image Source: Youtube)
ఎంటర్‌టైన్‌మెంట్

Akhanda 2 Trailer: ‘అఖండ 2: తాండవం’ మూవీ ట్రైలర్ ఎలా ఉందంటే..

Akhanda 2 Trailer: నందమూరి అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: Thaandavam) మూవీ ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్ ‘తాండవం’, సెకండ్ సింగిల్ ‘జాజికాయ’ సినిమాపై భారీగా అంచనాలను పెంచేయగా, ఆ అంచనాలను డబుల్, త్రిబుల్ చేసేలా ఈ ట్రైలర్ ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapatri Srinu) కాంబోలో రాబోతున్న నాల్గవ చిత్రమిది. వీరి కాంబినేషన్ అంటేనే ట్రైలర్, టీజర్‌లతో పని లేకుండా ఓ రేంజ్‌లో అంచనాలు ఉంటాయనే విషయం తెలియంది కాదు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యేందుకు ముస్తాబవుతోన్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని శుక్రవారం కర్ణాటకలో జరిగిన గ్రాండ్ వేడుకలో కరుణడ చక్రవర్తి శివరాజ్ కుమార్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే..

Also Read- The Great Pre-Wedding Show OTT: ‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో’ స్ట్రీమింగ్‌ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?

సర్జికల్ స్టైకే..

‘కష్టం వస్తే దేవుడు వస్తాడు అని నమ్మే జనానికి.. కష్టం వచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి. అలా వాళ్లు నమ్మిన రోజు భారతదేశం తునాతునకలు అయిపోతుంది’ అని విలన్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ఈ డైలాగ్ వస్తుంటే.. విజువల్ మాత్రం కట్టిపడేసేలా ఉంది. మహా కుంభమేళాను చూపిస్తూ.. ఒక్కసారిగా ఆధ్యాత్మికతవైపు తీసుకెళ్లారు. ‘8 కంఠాలు తెగాలి. రక్తం చిందాలి’ అనే డైలాగ్‌తో ఆది పినిశెట్టి విలనిజం పరిచయం చేశారు. ‘అఖండ’ ఫస్ట్ పార్ట్‌కు లింక్ చేస్తూ కొన్ని సన్నివేశాలు చూపించిన అనంతరం.. మొదటి పార్ట్‌లో రక్షించిన పాపకు మళ్లీ ప్రమాదం వచ్చినట్లుగా చూపిస్తూ.. అఖండుడి గర్జనకు స్వాగతం పలికారు. ‘ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్లినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం. ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం. సనాతన హైందవ ధర్మం’ అంటూ అఖండుడు కళ్లు పెద్దవి చేసి డైలాగ్ చెబుతుంటే.. గూస్‌బంప్స్ పక్కా. కొన్ని వీరోచిత యాక్షన్ సన్నివేశాల అనంతరం ‘దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు. దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్టైక్’ అనే పవర్ ఫుల్ డైలాగ్ అనంతరం.. ఒళ్లు గగుర్పొడిచేలా యాక్షన్ సన్నివేశాలనంతరం టైటిల్‌ కార్డు పడింది. ‘ఇప్పటి వరకు ప్రపంచపటంలో ఉన్న దేశ రూపాన్ని మాత్రమే చూసి ఉంటావ్.. ఎప్పుడూ మా దేశ విశ్వరూపాన్ని చూసుండవ్. మేము ఒకసారి లేచి శబ్ధం చేస్తే.. ఈ ప్రపంచమే నిశ్శబ్ధం’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌కు తెరపడింది. మొత్తంగా అయితే ట్రైలర్ కుమ్మిపడేసింది. ఇక రికార్డుల తాండవమే తరువాయి.

Also Read- GHMC: అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్ మాత్రమే కాదు.. తవ్వుతున్న కొద్దీ అక్రమాలు!

థమన్ నీకో దండం సామి..

సాంకేతికంగా అత్యున్నతంగా ఈ సినిమా తెరకెక్కినట్లుగా ప్రతి షాట్‌లో అర్థమవుతోంది. మరీ ముఖ్యంగా మ్యూజిక్ సెన్సేషన్ థమన్.. మరోసారి బాలయ్య కోసం ప్రాణం పెట్టేశాడనేది ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా థమన్ గురించి మాట్లాడుకునేలా చేసింది. కానీ, ఈ ట్రైలర్ తర్వాత మరింతగా థమన్ గురించి మాట్లాడుకుంటారు. అంత గొప్పగా థమన్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నాడనేది తెలుస్తోంది. ఒక్క సంగీతం అనే కాదు, టెక్నికల్‌గా ప్రతి విషయంలో టీమ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుందో అనేదానికి నిదర్శనంగా ఈ ట్రైలర్ ఉంది. ఇక పాన్ ఇండియా వైడ్‌గా మోత మోగడమే తరువాయి. ఈసారి బాలయ్య ఊపుకు పాన్ ఇండియా షేకయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. డిసెంబర్ 5.. ఊపిరి పీల్చుకో.. అఖండుడు గర్జించేందుకు వస్తున్నాడు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kavitha: జాగృతి యాత్రలో కీలక మార్పులు.. సర్పంచ్ ఎన్నికల కోడ్ ఎఫెక్ట్!

Samantha Wedding: మళ్లీ తెరపైకి సమంత పెళ్లి వ్యవహారం.. నేడు పెళ్లి అంటూ వార్త వైరల్.. రాజ్‌ మాజీ భార్య షేర్ చేసింది ఇదే..

Bhadradri Kothagudem: భద్రాద్రి మోడల్‌పై సర్కార్ స్టడీ? ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సేవలకు దేశ స్థాయి గుర్తింపు!

Marriage Debate: తన మనవరాలి పెళ్లి విషయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన జయా బచ్చన్.. ఏం అన్నారంటే?

Bhatti Vikramarka: రెండేళ్లలో ఏం చేశాం? భవిష్యత్‌లో ఏం చేయబోతున్నాం? కాంగ్రెస్ ప్లాన్ ఇదే : భట్టి విక్రమార్క