The Great Pre-Wedding Show OTT: వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ (Thiruveer), టీనా శ్రావ్య (Teena Sravya) జంటగా నటించిన ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ (The Great Pre-Wedding Show) మూవీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయింది. నవంబర్ 7న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రాన్ని సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా 7PM ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించారు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, విడుదలైన మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను రాబట్టుకుంది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న ఈ చిత్రం.. మౌత్ టాక్‌తో మంచి స్పందనను, అలాగే మంచి మసూళ్లను రాబట్టుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న సంస్థ.. స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read- Bigg Boss Telugu 9: ఇమ్ము మదర్ పేల్చిన డైలాగ్స్‌కు హౌస్ ఫిదా.. కంట్రోల్ తప్పిన తనూజ, దివ్య!
స్ట్రీమింగ్ డిటైల్స్ ఇవే..
ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయినటువంటి జీ 5 సంస్థ ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ రైట్స్‌ని సొంతం చేసుకుంది. జీ5 ఓటీటీ లిస్టులోకి ఇప్పుడీ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఫన్ ఎంటర్‌టైనర్ కూడా చేరబోతోంది. డిసెంబర్ 5 నుంచి ఈ సినిమా జీ5 (Zee 5) ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని తెలుపుతూ.. సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో థియేటర్లలో మిస్ అయిన వారంతా ఈ నవ్వుల నజరానాను ఓటీటీలో చూసేందుకు జీ5కు డిసెంబర్ 5న లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా హీరో తిరువీర్ మాట్లాడుతూ.. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ చిత్రంలో నేను పోషించిన రమేష్ అనే పాత్ర అందరికీ రిలేటెడ్‌గా ఉంటుంది. మన టౌన్‌లో, గ్రామంలో చూసిన పాత్రలానే ఉంటుంది. అతని పాత్రలోని అమాయకత్వం, తప్పు జరిగినప్పుడు పడే ఆందోళన, తప్పును సరిదిద్దుకోవటానికి చేసే ప్రయత్నాలు అన్నీ కామెడీగా ఉంటూనే హార్ట్ టచ్చింగ్‌గా ఉంటాయి. ఇప్పుడీ సినిమా జీ 5లో డిసెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్‌కు రాబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. జీ5 ద్వారా ఇంకా చాలా మందికి సినిమా రీచ్ అవుతుంది. రమేష్ పాత్ర, అతని ప్రపంచం మరింత మందిని మెప్పిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు.
నిజాయితీగా పని చేశాం
సినిమా కథ విషయానికి వస్తే.. ఓ చిన్నపాటి విలేజ్‌లో ఉండే ఫొటోగ్రాఫర్ రమేష్ కథ ఇది. తను ఆ గ్రామానికి చెందిన లోకల్ లీడర్ ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తాడు. కానీ, ఆ మెమురీ కార్డు పోవటంతో అతను పడే ఇబ్బందులు ఏంటి? తద్వారా ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడనే విషయాలను కామెడీ కోణంలో ఈ సినిమాలో చూపించారు. ప్రతి సన్నివేశం ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తేలా దర్శకుడు చిత్రీకరించారు. గ్రామంలో మనం చూసే వ్యక్తులు, వారి హావభావాలు చక్కగా ఎంజాయ్ చేసేలా ఉంటూ, ప్రేక్షకులకు ఇట్టే కనెక్ట్ అవతాయి. ఈ సినిమా గురించి హీరోయిన్ హీరోయిన్ టీనా శ్రావ్య మాట్లాడుతూ.. ఇందులో ఉన్న పాత్రల్లోని సహజత్వం నుంచే సినిమాలో ఓ స్వచ్ఛత కనిపిస్తుంది. అందరం ఈ సినిమా కోసం నిజాయితీగా పని చేశాం. ఇప్పుడీ సినిమా జీ 5లో డిసెంబర్ 5నుంచి స్ట్రీమింగ్‌కు వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా జీ5 వీక్షకులు ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నానని తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
