The Raja Saab First Single: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ది రాజాసాబ్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో మరో షేకింగ్ వార్త ఒకటి విడుదలైంది. ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘ది రాజాసాబ్’ సినిమా నుంచి సాంగ్ విడుదల తేదీని రిలీజ్ చేశారు నిర్మాతలు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘ది రాజాసాబ్’ సినిమా నుంచి మొదటి సింగిల్ ను నవంబర్ 23, 2025న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్సాహం పెరిగింది.
Read also-Akhanda 2: బాలయ్య బాబు ‘అఖండ 2’ ట్రైలర్ టైమ్ ఫిక్స్.. ఈవెంట్ చీఫ్ గెస్ట్ ఎవరంటే?..
ప్రభాస్ కెరీర్‌లో ‘ది రాజాసాబ్’ ఒక డిఫరెంట్ అటెంప్ట్‌గా నిలవనుంది. కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లవ్, కామెడీ, హారర్ ఎలిమెంట్స్ కలగలిపిన ఒక హారర్-కామెడీ ఎంటర్‌టైనర్గా రూపొందుతుంది. ప్రభాస్ వంటి మాస్ హీరో ఇటువంటి జోనర్‌ను ఎంచుకోవడం ఆయన అభిమానులను, సినీ విశ్లేషకులను మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వప్రసాద్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా ముగ్గురు అందాల తారలు – నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
Read also-studios trade license issue: పన్నుల ఎగవేతపై టాలీవుడ్ బడా స్టూడియోలకు జీహెచ్ఎంసీ నోటీసులు..
‘ది రాజాసాబ్’ సినిమాకు సంగీతం అందిస్తున్నది యువ సంచలనం థమన్. ఇప్పటికే ప్రభాస్, థమన్ కాంబినేషన్‌లో వచ్చిన కొన్ని పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈసారి మారుతి మార్క్ టేకింగ్, ప్రభాస్ స్టైల్, థమన్ సంగీతం కలగలిపి విడుదల కాబోయే మొదటి సింగిల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. నవంబర్ 23న విడుదల రాబోయే ఈ పాట.. సినిమా మూడ్‌ను, ప్రభాస్ పాత్ర స్వభావాన్ని వెల్లడిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా చెబుతోంది. ముఖ్యంగా, థమన్ ఈ చిత్రానికి ఒక ప్రత్యేకమైన బీట్ లేదా థీమ్ సాంగ్‌ను సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 9 తేదీని ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ ఫస్ట్ సింగిల్ రిలీజ్కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Here comes #TheRajaSaab STYLE 😎
Bringing you the MOST WHISTLE WORTHY TREAT #RebelSaab Song on NOV 23rd 🔥
A @MusicThaman musical vibe 🎧#TheRajaSaabOnJan9th #Prabhas @DuttSanjay @DirectorMaruthi @AgerwalNidhhi @MalavikaM_ #RiddhiKumar @Bomanirani @vishwaprasadtg… pic.twitter.com/ceNYsGcCZ4
— People Media Factory (@peoplemediafcy) November 21, 2025
