Akhanda 2: నందమూరి బాలకృష్ణ అభిమానులు, యాక్షన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అఖండ 2’ సినిమాకు సంబంధించి ఒక భారీ ప్రకటన వచ్చింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కు సంబంధించి ట్రైలర్ నవంబర్ 21, 2025న సాయంత్రం 7:56 గంటలకు విడుదల చేయనున్నారు నిర్మాతలు. ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమం సాయంత్రం 5:00 PM గంటలకు ఈ వేడుక ప్రారంభం కానుంది. ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా కన్నడ సినీ పరిశ్రమ నుంచి ‘కరునాడ చక్రవర్తి’ నిమ్మ శివరాజ్ కుమార్ (శివన్న) హాజరవుతున్నారు. బాలకృష్ణ, శివన్న ఇద్దరూ మాస్ యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరు కావడంతో, వీరి కలయిక ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
Read also-Miss Universe 2025: మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న ఫాతిమా బాష్.. అవమానాలను సైతం ఎదిరించి..
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వేదిక చాలా ప్రత్యేకమైనదిగా ఎంచుకున్నారు. ఇది కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్ జిల్లా, చింతామణి పట్టణంలో జరగనుంది. చింతామణి బైపాస్, SNR బ్రిక్స్ ఫ్యాక్టరీ ఎదురుగా, చిన్నసాంద్ర, చింతామణి, చిక్కబళ్లాపూర్ జిల్లా. బాలకృష్ణ సినిమాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. అందువల్లే, ఈ పెద్ద వేడుకను అక్కడి అభిమానుల మధ్య ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు బ్లాక్ బాస్టర్లుగా నిలిచాయి. టైటిల్ సాంగ్ లో థమన్ అందించిన సంగీతానికి ప్రేక్షకులను పూనకాలు తెప్పించేదిగా ఉంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్న ఈ సినిమా బాలయ్య బాబు కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు కూడా ఊపందుకున్నాయి.
Read also-Ahaan Panday: అనీత్‌తో డేటింగ్ పుకార్లపై స్పందించిన అహాన్ పాండే.. వారి బంధం ఎలాంటిదంటే?
‘అఖండ 2’ మొదటి భాగం ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. దర్శకుడు బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్ అంటేనే ఫ్యాక్షన్, మాస్ యాక్షన్, హై-వోల్టేజ్ ఎమోషన్స్‌తో కూడిన విందు ఉంటుంది. అందువల్ల, ఈ రెండో భాగంపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ ట్రైలర్ ఆ అంచనాలను ఏ మేరకు అందుకుంటుంది, ఎలాంటి ఉత్తేజకరమైన యాక్షన్ ఘట్టాలు చూపబోతోంది అనేది ఇప్పుడు ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠ కలిగిస్తోంది. బాలకృష్ణ అఘోరా పాత్రను మళ్లీ ఏ స్థాయిలో చూపించబోతున్నారో తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆత్రుతగా ఉన్నారు. ‘అఖండ 2’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ ట్రైలర్ విడుదల తర్వాత సినిమా ప్రమోషన్స్ మరింత వేగవంతం కానున్నాయి. ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
