Dharmpuri Sanjay: నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘ అధ్యక్షునిగా ఈనెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తున్నానని జిల్లా నూతన అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ అన్నారు. గురువారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్, ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీమంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, నిజామాబాద్ జిల్లాకు చెందిన రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు.
Also Read: Bandi Sanjay: మావోయిస్టులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..?
జయప్రదం చేయాలి
రానున్నారని, జిల్లా ఎంపీ అరవింద్, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి లతో అన్ని పార్టీల ఎమ్మెల్యేలను, నాయకులను, వివిధ కుల సంఘాల ప్రతినిధులను ఆహ్వానిస్తున్నా మన్నారు. తన తండ్రి దివంగత మహా నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ ఆశీస్సులతో ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నానని పేర్కొన్నారు. మున్నూరు కాపు సంఘ అధ్యక్షునిగానే కాకుండా బీసీ నాయకుడిగా అన్ని కుల సంఘాలతో సత్సంబంధాలు నెరవేర్చుకుంటానన్నారు. రాహుల్ గాంధీ అడుగుజాడల్లో ముందుకు వెళ్తానంటూ స్పష్టం చేశారు. ఇక ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘంలో జరిగే ప్రమాణ స్వీకార మహోత్సవానికి భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనీ కోరారు. ఈ విలేకరుల సమావేశంలో మున్నూరు కాపు సంఘ జిల్లా నాయకుడు ఆది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Bandi Sanjay: హిందుత్వమే నా శ్వాస.. రాష్ట్రంలో రామరాజ్యం తెస్తాం.. బండి సంజయ్

