Khammam: అక్రమాలకు అడ్డాగా ఖమ్మం రూరల్​ సబ్​ రిజిస్ట్రార్​ ఆఫీస్
Khammam (image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Khammam: అక్రమాలకు అడ్డాగా ఖమ్మం రూరల్​ సబ్​ రిజిస్ట్రార్​ ఆఫీస్​.. ఏసీబీ నిఘా ఉన్నా.. యథేచ్ఛగా దందా!

Khammam: ఖమ్మం జిల్లా రూరల్ మండలంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకతను కోల్పోయింది. అవినీతి, అక్రమ లావాదేవీలు, అధికార దుర్వినియోగానికి కేంద్ర బిందువుగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ‘నచ్చితే ఓకే.. లేకుంటే పెండింగ్’ అనే నిరంకుశ ధోరణి ఇప్పుడు అక్కడ అనధికారిక నియమావళిగా రూపాంతరం చెందిందని పేర్కొంటున్నారు. భూ కొనుగోలు, విక్రయ లావాదేవీలతో సంబంధం ఉన్న పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


కార్యాలయాలపై పెరిగిన పట్టు

రిజిస్ట్రేషన్ కోసం సమర్పించబడుతున్న ప్రతి ఫైల్‌ను ముందుగా ఏ డాక్యుమెంట్ రైటర్ సిద్ధం చేశాడన్న అంశంపైనే అధికారులు అసాధారణ ప్రాధాన్యత కేటాయిస్తున్నారన్న సమాచారం వెలుగులోకి వచ్చింది. తమకు అండగా నిలిచే, అనుకూలంగా వ్యవహరించే రైటర్ల ద్వారా వచ్చిన ఫైళ్లనే వేగంగా పూర్తిచేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇతర రైటర్ల ఫైళ్లను అల్పమైన సాంకేతిక లోపాలను సాకుగా చూపి ఉద్దేశపూర్వకంగా నిరవధిక పెండింగ్‌లో నెట్టి వేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

లంచాల దందాకు రేటు పట్టిక

రిజిస్ట్రేషన్ చేపట్టేందుకు ఒక్కో ఫైల్‌కు రూ.10,000 నుంచి రూ.15,000 వరకు అక్రమ డిమాండ్లు విధిస్తున్నారని బాధితులు ఆరోపించారు. లంచం చెల్లించినవారికే అదే రోజున రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తున్నారని, ఇవ్వని వారి ఫైళ్లు వారాలు, నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతూ మనోవేదనకు గురవుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Also Read: Khammam District: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ఆర్టీసీ అద్దె బస్సులో అకస్మాత్తుగా పొగలు.. భయంతో జనం పరుగులు

‘వారానికి ఒక్క ఫైల్’ అనే నియంత్రణ విధానం

ఏసీబీ నిఘా కొనసాగుతున్నది తెలిసినా డాక్యుమెంట్ రైటర్లకు ‘వారానికి ఒక ఫైల్ మాత్రమే సమర్పించాలి’ అంటూ అప్రకటిత నియమాలు విధిస్తూ అక్రమ కార్యకలాపాలను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయినా, లంచాల మాఫియా నిరాఘాటంగా కొనసాగుతుండటం ప్రజల్లో అసహనాన్ని మరింత పెంచుతున్నది.

సాయంత్రం వేళల్లో గుట్టుచప్పుడు వసూళ్లు

కార్యాలయాల ప్రాంగణంలో ఒక ప్రత్యేక మధ్యవర్తిని నియమించుకొని, సాయంత్రం వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా లంచాల వసూళ్లు కొనసాగిస్తున్నారని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ పనులు ముగిసిన అనంతరం, ఫైళ్లను వేగవంతం చేయాలంటే ‘మాట చూసుకోవాలి’ అంటూ ఆయా మధ్యవర్తుల ద్వారానే డబ్బుల లావాదేవీలు నిర్వహిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం పూర్తిగా వ్యవస్థీకృతంగా సాగుతూ, అధికారుల మౌన సమ్మతితోనే కొనసాగుతున్నదన్న అనుమానాలు ప్రజల్లో బలపడుతున్నాయి. అయితే, ఈ దుర్వినియోగ వ్యవస్థపై ఉన్నతాధికారులు తక్షణం స్పందించి, సమగ్ర దర్యాప్తు నిర్వహించి, బాధ్యులపై కఠిన శాసన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలపై సంబంధిత సబ్ రిజిస్ట్రార్ స్పందించకపోవడం మరింత అనుమానాలకు తావిస్తున్నది.

Also Read: Khammam Crime: సీపీఎం నేత గొంతు కోసి చంపిన దుండగులు.. ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన

Just In

01

Peddi: ‘పెద్ది’ ఈ ఫొటో ఎక్కడిది? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పిక్!

PuriSethupathi: పూరిసేతుపతి మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌కి.. ఎట్టకేలకు మోక్షం!

Anil Ravipudi: శంకర్ వరప్రసాద్ గారి కోసం నయన్‌కు ‘దృశ్యం’ కథ చెప్పిన అనిల్ రావిపూడి!

Ashika Ranganath: రష్మిక, శ్రీలీల అవుట్.. ఆషికాకు టాలీవుడ్ ఫిదా!

Rahul Sipligunj: ట్రెండింగ్‌లో ‘అమీర్ లోగ్’.. ‘అవ్వల్ దావత్’ సాంగ్..