BJP Corporators: జీహెచ్ఎంసీ పాలక మండలి, అధికారులు కేంద్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోవటం లేదని, జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి హెచ్ఎండీఏ అధికారులతో పాటు అడిషనల్ కలెక్టర్లను ఆహ్వానించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్పొరేటర్లు శ్రవణ్, ఆకుల శ్రీవాణి, బీజేపీ నేతలు గురువారం నిరసన వ్యక్తం చేశారు. స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగిన ఏడో అంతస్తులోని కమాండ్ కంట్రోల్ రూమ్ ముందు సమావేశం ప్రారంభానికి ముందు బైఠాయించి పాలక మండలి, అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇదే రాజ్యం దోపీడి రాజ్యం, దొంగల రాజ్యం అంటూ నినాదాలు చేశారు.
కార్పొరేటర్లు ఆగ్రహాం
కార్పొరేటర్ల బైఠాయింపు కారణంగా స్టాండింగ్ కమిటీ సమావేశం కాస్త ఆలస్యంగా మొదలైంది. సమావేశం జరగాల్సిన కమాండ్ కంట్రోల్ కు వెళ్లే దారిలో కార్పొరేటర్లు బైఠాయించటంతో పోలీసులు జోక్యం చేసుకుని కార్పొరేటర్లను అక్కడి నుంచి గ్రౌండ్ ఫ్లోర్ కు ఎత్తుకొచ్చారు. ఈ క్రమంలో కార్పొరేటర్ శ్రవణ్ చొక్కా చినిగిపొవటంతో కార్పొరేటర్లు ఆగ్రహాం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు, కార్పొరేటర్ల మధ్య తోపులాట జరగటంతొ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ తర్వాత స్టాండింగ్ కమిటీ సమావేశం మొదలైంది. కానీ కార్పొరేటర్ల గ్రౌండ్ ఫ్లొర్ లోని లిఫ్టుల ముందు మళ్లీ బైఠాయించారు. పోలీసులు సర్దిచెప్పినా విన్పించుకోకపోవటంతో కార్పొరేటర్లు, బీజేపీ నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Also Read: Corporators: ఆగని కార్పొరేటర్ల ఆగడాలు.. భార్యల పదవులతో రెచ్చిపోతున్న భర్తలు!
ట్యాక్స్ చెల్లించనివ్వం: బీజేపీ కార్పొరేటర్లు
ప్రజాసమస్యల పరిష్కారంలో, జీహెచ్ఎంసీ ఆస్తుల పరిరక్షణలో అధికారుల వైఫల్యానికి నిరసనగా ప్రజలను ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించనివ్వమని కార్పొరేటర్లు శ్రవణ్, ఆకుల శ్రీవాణి లు వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీలో నిరసన వ్యక్తం చేసిన సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రేటర్ పరిధిలో జీహెచ్ఎంసీకి చెందిన అనేక ఆస్తులకు సంబంధించి ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో కారణంగా ఆస్తుల బదలాయించటం జరుగుతుందని, ఫలితంగా జీహెచ్ఎంసీ తీవ్ర నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. హెచ్ఎండీఏ విభాగం గ్రేటర్ పరిధిలో చెరువుల పునరుద్దీకరణ, మురుగునీటి శుద్ధీకరణ తదితర పనులను మరిచి, కేవలం పార్కుల పైన ప్రైవేటు వారికీ స్థలాలు కేటాయించటాన్ని వారు తప్పుబట్టారు. జీహెచ్ఎంసీకి నష్టం కల్గించే ఇలాంటి సమస్యలపై చర్చించేందుకు ఆ సంబంధిత శాఖ అధికారులను కూడా ఈ నెల 25న జరగనున్న కౌన్సిల్ సమావేశానికి హెచ్ఎండీఏ అధికారులను, అడిషనల్ కలెక్టర్లను ఆహ్వానించాలని భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు.
Also Read: Telangana BJP: జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికల ఫలితాలలో కాషాయ పార్టీ ఘోర పరాజయం.. ఓటమి బాధ్యత ఎవరిది?

