Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్’ రిలీజ్ ఎప్పుడంటే?
Ustaad Bhagat Singh (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్’ ఫిబ్రవరిలో కాదు.. ఎప్పుడంటే? ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) అభిమానులకు నిరాశ కలిగించే వార్త ఒకటి తాజాగా బయటికొచ్చింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా, ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) వంటి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ (Ustaad Bhagat Singh) విడుదల తేదీ విషయంలో ఊహించని మార్పు చోటుచేసుకుంది. ఈ చిత్రం వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరిలో విడుదలవుతుందని కొద్దిరోజులుగా ప్రచారం జరిగింది. అయితే, తాజాగా ఈ వార్తలకు బ్రేక్ వేస్తూ, సినిమా విడుదల వేసవికి వాయిదా పడినట్లు చిత్ర నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది.

Also Read- MLA Raja Singh: రాజమౌళిని జైల్లో వేస్తే.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్!

రిలీజ్‌పై నిర్మాత రవి క్లారిటీ ఇదే..

పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ (OG) చిత్రం రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు చేసి సెన్సేషనల్ సక్సెస్ సాధించిన నేపథ్యంలో, ఆ వెంటనే రాబోతున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’పై అభిమానుల అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ అంచనాల మధ్య, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవి… సినిమా విడుదల తేదీపై స్పష్టతనిచ్చారు. తాజాగా జరిగిన ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ సినిమా వేడుకలో నిర్మాత రవిని ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ విడుదల ఎప్పుడని మీడియా ప్రశ్నించగా.. ఫిబ్రవరిలో విడుదల కావడం లేదని ధృవీకరించారు. ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఫిబ్రవరి రిలీజ్ కాకుండా, ఈ చిత్రాన్ని వచ్చే వేసవిలో (ఏప్రిల్‌లో) విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాత రవి వెల్లడించారు.

Also Read- NC24 Update: ‘ఎన్‌సి24’ బీటీఎస్ మేకింగ్ వీడియో చూశారా? టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ ఎప్పుడంటే?

అభిమానుల్లో నిరాశ

నిర్మాత రవి ఇచ్చిన ఈ అప్‌డేట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని తీవ్ర నిరాశకు గురిచేసింది. తమ అభిమాన హీరో చిత్రాన్ని వీలైనంత త్వరగా, ముఖ్యంగా వాలెంటైన్స్ డే లాంటి స్పెషల్ డే సందర్భంగా థియేటర్లలో చూడాలని ఆశించిన ఫ్యాన్స్, సినిమా ఏకంగా రెండు నెలలు వాయిదా పడడంతో డిజప్పాయింట్ అవుతున్నారు. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచేలా హరీష్ శంకర్ తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో డైనమిక్ హీరోయిన్ శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ అగ్ర నటుడు పార్దీబన్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ తన పార్ట్ షూటింగ్‌‌ని ఎప్పుడో పూర్తి చేశారు. సినిమా కూడా ఫైనల్ స్టేజ్‌లో ఉన్నట్లుగా టాక్ నడుస్తుంది. అలాంటిది ఏప్రిల్ వరకు రిలీజ్ వెళ్లిపోవడంతో.. ఈ భారీ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు మరికొంత కాలం వేచి ఉండక తప్పదు. అయితే, ఆలస్యమైనా అంచనాలకు తగ్గట్టే ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kavitha: జాగృతి యాత్రలో కీలక మార్పులు.. సర్పంచ్ ఎన్నికల కోడ్ ఎఫెక్ట్!

Samantha Wedding: మళ్లీ తెరపైకి సమంత పెళ్లి వ్యవహారం.. నేడు పెళ్లి అంటూ వార్త వైరల్.. రాజ్‌ మాజీ భార్య షేర్ చేసింది ఇదే..

Bhadradri Kothagudem: భద్రాద్రి మోడల్‌పై సర్కార్ స్టడీ? ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సేవలకు దేశ స్థాయి గుర్తింపు!

Marriage Debate: తన మనవరాలి పెళ్లి విషయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన జయా బచ్చన్.. ఏం అన్నారంటే?

Bhatti Vikramarka: రెండేళ్లలో ఏం చేశాం? భవిష్యత్‌లో ఏం చేయబోతున్నాం? కాంగ్రెస్ ప్లాన్ ఇదే : భట్టి విక్రమార్క