MLA Rajender Reddy: సై అంటే సై అంటూ సవాల్ విసురుకున్న నేతలు
హనుమకొండలో ఉద్రిక్తంగా మారిన రాజకీయ సవాళ్లు
దమ్ముంటే గన్‌మెన్లను వదిలి బస్టాండుకు రావాలంటూ సవాల్ విసిరిన వినయ్ భాస్కర్
సవాల్ స్వీకరించి గన్‌మెన్ లేకుండా బస్టాండ్‌కు వచ్చిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
వరంగల్, స్వేచ్ఛ: వరంగల్ పశ్చిమ (Warangal West) నియోజకవర్గంలో నేతలు బస్తిమే సవాల్ అంటున్నారు. సై అంటే సై అంటూ నేతలు విసురుకున్న సవాళ్లతో హనుమకొండలో రాజకీయ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హనుమకొండ బస్టాండ్ సమస్యల పరిశీలన కోసం వచ్చిన బీఆర్ఎస్ నేత, మాజీ ప్రభుత్వ విఫ్ వినయ భాస్కర్ మాట్లాడుతూ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (MLA Rajender Reddy) దమ్ముంటే గన్‌మెన్లను వదిలి బస్టాండుకు రావాలంటూ సవాల్ విసిరారు. వినయ్ భాస్కర్ విసిరిన సవాల్ స్వీకరించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గన్‌మెన్ లేకుండా బస్టాండ్‌కు వచ్చారు. దీంతో, హనుమకొండ బస్టాండ్ ఆవరణలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి దమ్ముంటే వారి గన్‌మెన్లను వదిలి 5 నిమిషాలు హనుమకొండ బస్టాండుకు రావాలని వినయ్ భాస్కర్ అన్నారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు ఊరుకోరని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి చేయకుండా చిరు వ్యాపారులను సైతం తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని, రానున్న రోజుల్లో ప్రజలు ఊరుకునే పరిస్థితిలో లేరని విమర్శించారు.
Read Also- Nara Bhuvaneshwari: మమ్మల్ని చంపుతారట.. ఫ్యామిలీకి ముప్పు ఉంది.. నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు
గన్‌మెన్లు లేకుండా ఒంటరిగా హనుమకొండ బస్టాండ్‌కు వచ్చిన ఎమ్మెల్యే
వినయ్ భాస్కర్ విసిరిన సవాలను స్వీకరించిన ఎమ్మెల్యే నాయిని, గన్‌మెన్లు లేకుండా ఒంటరిగా హనుమకొండ బస్టాండ్ వచ్చారు. బస్టాండ్ ఆవరణలో చిరు వ్యాపారులను పలకరిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మీడియా సమావేశంలో బైఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ హనుమకొండ అభివృద్ధిలో వెనుక ఉందని, ప్రజలందరికీ అన్యాయం చేసిన ఎమ్మెల్యేపై ప్రజలందరూ అసంతృప్తిగా ఉన్నారని, గన్‌మెన్లు లేకుండా దమ్ముంటే బస్టాండు వెళ్లగలవా అని సవాల్ విసరడంతో సమాధానంగా నాయిని రాజేందర్ రెడ్డి అక్కడికి వెళ్లారు. తాను ఎప్పుడూ ప్రజాక్షేత్రంలో ఉంటూ, ప్రజల పక్షాన నిలబడ్డానే కానీ, హంగు ఆర్భాటాలకు ముందు వరుసలోలేనని వెల్లడించారు. గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కూడా యూనివర్సిటీ విషయాలపై సవాల్ విసిరినప్పుడు కనీసం ముందుకు రాని నాయకులు ఇప్పుడు గన్‌మెన్లు లేకుండా తిరగాలని తనపై సవాల్ వేయడమంటే హాస్యస్పదమని అన్నారు.
Read Also- Allari Naresh: ‘12A రైల్వే కాలనీ’.. హైదరాబాద్‌లో జరిగిన యదార్థ సంఘటన.. హైలెట్ ఏంటంటే?
రాజకీయాల్లో దిగజారుడు పనులు చేస్తూ రాజకీయాలను భ్రష్టు ప్రశ్నించిన రాజయ్య కూడా తన పనితనాన్ని విమర్శిస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత ప్రభుత్వం కట్టించినప్పటికీ లబ్ధిదారుల దగ్గర డబ్బులు తీసుకుని కాలయాపన చేసి లంచగొండులుగా మారింది తమరు కాదా? అని ఎద్దేవా చేశారు.ప్రజా క్షేత్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించిన కాలం మొత్తం ప్రజలకు ఏమి చేయలేదని, ప్రజలు పక్కన పెడితే ఇంకా బుద్ధి లేనట్టుగా మాటలతో పబ్బం గడుపుతూ, కేవలం మాటల వరకే మీనమేషాలు చూపించడం ప్రజలు గమనిస్తున్నారని మండిపడ్డారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో విద్యావంతులుగా ఉండి ఎందరో పిల్లలకు ఆదర్శవంతంగా ఉండి, ఇప్పుడు దొర దొడ్డిలో బానిసవ్వడం, ఆ దొర మెప్పుకోసం ఊకదంపుడు ఉపన్యాసాలు, అర్థం లేని మాటలు మాట్లాడడం సరికాదన్నారు. మంచి వ్యక్తి తప్పుడు పార్టీలో ఉన్నారని, ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని ఏద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సవాలు స్వీకరించి స్థానికంగా ఉన్న చిరు వ్యాపారులను ఆత్మీయంగా పలకరిస్తూ అభివృద్ధి విషయాలపై వారిని నేరుగా అడిగి తెలుసుకున్నారు.

