Nara Bhuvaneshwari: మమ్మల్ని చంపుతారట.. నారా భువనేశ్వరి
Nara Bhuvaneshwari (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

Nara Bhuvaneshwari: మమ్మల్ని చంపుతారట.. ఫ్యామిలీకి ముప్పు ఉంది.. నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు

Nara Bhuvaneshwari: ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) భార్య, ఎన్టీఆర్ భవన్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కుప్పం (Kuppam Tour)లో పర్యటిస్తున్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు కుప్పంలో విస్తృతంగా ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబానికి ఎన్నో బెదిరింపులు వచ్చాయని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఇంకా కొందరు బెదిరిస్తున్నారని ఆమె అన్నారు.

‘ప్రజల కోసమే పనిచేస్తున్నాం’

కుప్పం పర్యటనలో భాగంగా నారా భువనేశ్వరి మాట్లాడారు. ‘మా కుటుంబాన్ని ఇప్పటికీ కొందరు బెదిరిస్తున్నారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా ప్రజల కోసమే పని చేస్తున్నాం. చంద్రబాబు అరెస్ట్ సమయంలో ప్రజలంతా మా కుటుంబ సభ్యుల్లా స్పందించారు’ అని భువనేశ్వరి అన్నారు. కాగా గత ప్రభుత్వ హయాంలో టీడీపీ పార్టీకి విపత్కర పరిస్థితులు ఎదురైన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి అప్పట్లో చంద్రబాబును 40 రోజులపైగా జైలులో ఉంచారు. ఈ క్రమంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధించింది. తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది.

జలహారతి కార్యక్రమంలో..

కుప్పం నియోజకవర్గంలోని డీకేపల్లిలో జరిగిన జలహారతి కార్యక్రమంలోనూ నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ‘దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న నీరు కుప్పానికి చేరుకోవడంతో ప్రజల్లో ఆనందం వారి కన్నుల్లో స్పష్టంగా కనిపించింది. త్రాగు నీరు – సాగు నీరు రెండూ అందుబాటులోకి రావడంతో కుప్పం ప్రజలు వ్యక్తం చేసిన ఆనందం హృదయాన్ని హత్తుకుంది. హంద్రినీవా ప్రాజెక్ట్‌ను కుప్పానికి తీసుకు రావడం ద్వారా సీఎం చంద్రబాబు ఇక్కడి ప్రజలకు దేవుడయ్యారు. కుప్పం ప్రజలు మా మీద చూపుతున్న ప్రేమ, ఆప్యాయత ఎన్నటికీ మరువలేనివి. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు’ అని ఎక్స్ లో రాసుకొచ్చారు.

విద్యార్థులతో కలిసి భోజనం

కుప్పం పర్యటనలో భాగంగా పరమసముద్రంలోని KGBV పాఠశాలను నారా భువనేశ్వరి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనాన్ని స్వీకరించారు. విద్యార్థులతో తనకు ఎదురైన అనుభవాలను తెలియజేస్తూ ఎక్స్ లో భువనేశ్వరి పోస్ట్ పెట్టారు. ‘విద్యార్థులతో సమావేశం కావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. పిల్లల్లో దాగి ఉన్న ఆత్మవిశ్వాసం, నేర్చుకునే తపన ఎంతో అభినందనీయం. పట్టుదల, క్రమశిక్షణ ఉంటే ఏ విద్యార్థి అయినా ఉన్నత స్థాయికి చేరగలడని వారికి సూచించాను. రాష్ట్ర స్థాయిలో యోగాలో అవార్డు సాధించిన తేజస్వినిని అభినందించాను. విద్యార్థులతో కలిసి భోజనం చేయడం, వారి రోజు వారీ అనుభవాలు వినడం ఒక ప్రత్యేకమైన అనుభూతిని పంచింది’ అంటూ భువనేశ్వరి ఎక్స్ లో రాసుకొచ్చారు.

Also Read: Accident Video: ఘోర ప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన కారు.. గాల్లోకి ఎగిరిపడ్డ బాధితులు

Just In

01

Bandla Ganesh: సుద్దపూస.. బండ్ల న్యూ అవతార్ చూశారా? డీజే కొట్టు మామా!

Naga Vamsi: ఆరేళ్ళ తర్వాత నాకు సంతృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది..

Harsha Vardhan: వస్త్రధారణ అనేది స్వేచ్ఛలో ఒక అంశం మాత్రమే.. శివాజీ, అనసూయ కాంట్రవర్సీలోకి హర్ష!

IMDB 2026: ఐఎండిబి 2026లో మోస్ట్ ఎవైటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్ ఇదే..

Huzurabad: హుజురాబాద్ పురపాలక సంఘం పరిధిలో.. వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితా విడుదల!