Hyper Aadi: దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) ఇటీవల ‘వారణాసి’ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ (VARANASI Globe Trotter Event)లో చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. లార్డ్ హనుమాన్ (Lord Hanuman)ను ఉద్దేశిస్తూ ఆయన చేసిన కామెంట్లు హిందూ సంఘాలు, విశ్వ హిందూ పరిషత్ (VHP), బీజేపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. హనుమంతుడిని అవమానించేలా మాట్లాడిన రాజమౌళి వెంటనే క్షమాపణ చెప్పాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం రోజురోజుకు ముదురుతుండగా, కమెడియన్ హైపర్ ఆది (Hyper Aadi) రంగంలోకి దిగి రాజమౌళికి మద్దతు పలకడం ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది. తాజాగా జరిగిన ఒక ఈవెంట్‌లో హైపర్ ఆది మాట్లాడుతూ… రాజమౌళి ఉద్దేశపూర్వకంగా ఎవరినీ అవమానించలేదని, ఆయన కేవలం ‘అలిగాడు’ అంతేనని వ్యాఖ్యానించారు. చిన్న విషయాన్ని ఇంతగా ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ఒక విధంగా, రాజమౌళి చేసిన వ్యాఖ్యలకు ఆయన కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. రాజమౌళిని సమర్థిస్తూ హైపర్ ఆది చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నెటిజన్లకు, హిందూ సంఘాల కార్యకర్తలకు మరింత కోపం తెప్పించాయి.
Also Read- VK Naresh: వీకే నరేష్‌లో ఉన్న నటుడిని పక్కన పెట్టి.. ఆ (పవిత్ర) కోణంలోనే చూస్తున్నారా?
‘గత ట్వీట్స్’ అంశాన్ని లేవనెత్తిన నెటిజన్లు
రాజమౌళికి మద్దతుగా నిలిచిన హైపర్ ఆదిపై ఇప్పుడు ట్రోలింగ్ మొదలైంది. రాజమౌళి చేసిన వ్యాఖ్యలను ‘అలగడం’ అంటూ ఆది తేలిక చేయడాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. అంతేకాకుండా, గతంలో రాజమౌళి చేసిన కొన్ని వివాదాస్పద ట్వీట్లను ఈ సందర్భంగా లేవనెత్తుతూ హైపర్ ఆదికి కౌంటర్లు ఇస్తున్నారు. అందులో ముఖ్యంగా రాజమౌళి చేసిన రెండు పాత ట్వీట్లను చూపెడుతూ హైపర్ ఆదికి కౌంటర్స్ ఇస్తున్నారు. ‘రాముడి కథ వినడానికి చాలా బోరింగ్‌గా ఉంటుందని ఒకసారి, శ్రీకృష్ణుడికి లవర్స్ ఎక్కువని మరోసారి ఇలా రాజమౌళి గతంలో ట్వీట్స్ వేశారు. ఇప్పుడా ట్వీట్స్‌ను వెలికి తీసి మరి అటు రాజమౌళిని, ఇటు హైపర్ ఆదిని ఆడేసుకుంటున్నారు.
Also Read- MLA Raja Singh: రాజమౌళిని జైల్లో వేస్తే.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్!
ఆది వివరణ ఇస్తారా?
హైపర్ ఆదిని ఉద్దేశించి కొందరు నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ‘‘రాజమౌళి తాజా ఈవెంట్‌లో ‘అలిగాడు’ సరే, మరి గతంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడిపై ఆయన చేసిన ఈ పాత ట్వీట్ల సంగతేంటి? వాటికి మీరు ఏం వివరణ ఇస్తారు?’ అంటూ నిలదీస్తున్నారు. ఈ వ్యాఖ్యలు కూడా హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, వీటిని కూడా ‘అలగడం’ అని కొట్టిపారేస్తారా అని ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి వివాదం ఒకవైపు, ఆయన్ను సమర్థించినందుకు హైపర్ ఆదిపై ట్రోలింగ్ మరొకవైపు తీవ్రమవుతోంది. ఈ కౌంటర్లకు హైపర్ ఆది ఎలా స్పందిస్తారు? గత ట్వీట్ల అంశాన్ని ఆయన ఎలా సమర్థిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హైపర్ ఆది నుంచి తదుపరి వివరణ వస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ అంశంపై ఇండస్ట్రీలో ఇంకెవరూ ఇంత వరకు స్పందించలేదు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
