Mufty Police: అర్జున్ ‘మఫ్టీ పోలీస్’ మ్యాటరేంటో చెప్పిసిన నిర్మాత
Mufty Police (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Mufty Police: అర్జున్ ‘మఫ్టీ పోలీస్’ మ్యాటరేంటో చెప్పేసిన నిర్మాత.. ఏం చెప్పారంటే?

Mufty Police: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా (Action King Arjun Sarja) హీరోగా నటించిన పోలీస్ ఇన్వెస్టిగేటివ్ పర్సనల్ డ్రామా ‘తీయవర్ కులై నడుంగ’ చిత్రం.. తెలుగులో ‘మఫ్టీ పోలీస్’ (Mufty Police)గా నవంబర్ 21న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ సినిమాలో అర్జున్ సరసన భాగ్యం ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) హీరోయిన్‌గా నటించింది. దినేష్ లక్ష్మణన్ దర్శకత్వంలో జియస్ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై జి. అరుల్ కుమార్ నిర్మించిన ఈ తమిళ చిత్రాన్ని, తెలుగులో ‘మఫ్టీ పోలీస్’ పేరుతో నిర్మాత ఎ. ఎన్. బాలాజీ (AN Balaji).. తన శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్ (Sri Lakshmi Jyothi Creations) ద్వారా విడుదల చేస్తున్నారు. నిర్మాత ఎ. ఎన్. బాలాజీ విషయానికి వస్తే.. డిస్ట్రిబ్యూటర్‌గా ఆయన ఇప్పటి వరకు 400కు పైగా చిత్రాలు పంపిణీ చేసి, నిర్మాతగా ‘రంగం-2, యుద్ధభూమి, ఒరేయ్ బామ్మర్ది, డాక్టర్ 56, మై డియర్ భూతం’ వంటి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఇప్పుడు రాబోతున్న ‘మఫ్టీ పోలీస్’ చిత్రం.. నిర్మాతగా తన స్థాయిని మరింతగా పెంచుతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర విశేషాలను మీడియాకు తెలియజేశారు.

Also Read- Bigg Boss Telugu 9: బాండింగ్స్‌పై భరణి డాటర్ స్పందనిదే.. రీతూని కొట్టబోయిన ఆమె మదర్!

ఆటిజం వ్యాధిపై అవగాహన కల్పించాం

ఆయన మాట్లాడుతూ.. ‘‘ఒక రచయిత హత్య నేపథ్యంలో పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా.. అద్భుతమైన థ్రిల్లింగ్ అంశాలతో దర్శకుడు దినేష్ లక్ష్మణన్ రూపొందించారు. ఈ చిత్రంలె అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా అలరించే అంశాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో పిల్లల పాలిట భూతంలా మారిన ఆటిజం వ్యాధి గురించి కూడా ఇందులో చర్చించడంతో పాటు, ఆ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశాం. దీనికి సంబంధించిన సన్నివేశాలు ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి. యాక్షన్ కింగ్ అర్జున్ – ఐశ్వర్య రాజేష్ అలియాస్ భాగ్యం.. వారి నటనతో అందరినీ మెప్పిస్తారు. తెలుగునాట వీరికి ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని అత్యధిక థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం.

Also Read- Balakrishna: మన దెబ్బేంటో హిందీవాళ్లకు చూపించాం.. బాలయ్య బాలీవుడ్‌ని తక్కువ అంచనా వేస్తున్నాడా?

యాక్షన్‌తోపాటు పర్సనల్ డ్రామా

అర్జున్ అనగానే అందరూ యాక్షన్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఈ సినిమాలో యాక్షన్‌తోపాటు పర్సనల్ డ్రామా కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తమిళంతోపాటు తెలుగులోనూ అద్భుతమైన విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. నవంబర్ 21న వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి చూసి, సక్సెస్ చేయాలని కోరుతున్నాను. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించే అవకాశాన్ని ఇచ్చినటువంటి జి.అరుల్ కుమార్‌కు, ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దిన దర్శకుడు దినేష్ లక్ష్మణన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. రామ్ కుమార్ గణేశన్, అభిరామి వెంకటాచలం, ప్రవీణ్ రాజా తదితరులు ఇతర పాత్రలలో నటించిన ఈ చిత్రానికి శరవణన్ అభిమన్యు సంగీతం అందించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క