Bihar CM Oath Ceremony: పదోసారి సీఎంగా నితీశ్ ప్రమాణం
Bihar CM Oath Ceremony (Image Source: Twitter)
జాతీయం

Bihar CM Oath Ceremony: బిహార్‌లో సరికొత్త రికార్డు.. పదోసారి సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణం.. హాజరైన ప్రధాని, చంద్రబాబు

Bihar CM Oath Ceremony: బిహార్ లో మరోమారు ఎన్డీఏ ప్రభుత్వం కొలువు దీరింది. పదోసారి బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీశ్ కుమార్ (Nitish Kumar) ప్రమాణ స్వీకారం చేశారు. పట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు సహా బీజేపీ – ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. పదోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నితీశ్ కుమార్ కు అభినందనలు తెలియజేశారు.

అతిథుల లిస్ట్ పెద్దదే..

బిహార్ లో ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి ఎన్డీఏకు చెందిన టాప్ లీడర్స్ హాజరయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi), హోంమంత్రి అమిత్ షా (Amit Shah), బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా అతిథులుగా వచ్చారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu Naidu), దిల్లీ సీఎం రేఖా గుప్తా (Rekha Gupta), హర్యానా సీఎం నయబ్ సింగ్ సైనీ, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, నాగాలాండ్ సీఎం నేఫ్యూ రియో (Neiphiu Rio) ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.

26 మంది మంత్రులు

సీఎంగా నితీశ్ కుమార్ సహా 26 మంది ఎమ్మెల్యేలు.. రాష్ట్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో బీజేపీకి చెందిన 14 మంది ఉండగా.. జేడీయూ నుంచి 8 మంది, చిరాగ్ పార్టీ నుంచి ఇద్దరు, ముస్లిం ఒకరు ఉన్నారు. ఎన్డీఏ కూటమిలోని జేడీయూకి సీఎం సీటు దక్కగా.. బీజేపీకి చెందిన సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాలు డిప్యూటీ సీఎంలుగా ఇదే వేదికపై ప్రమాణం చేశారు. నవంబర్ 26 నుంచి బిహార్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా.. మూడో రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ను ఎంచుకోకునున్నారు. అయితే బీజేపీకి చెందిన ప్రేమ్ కుమార్ ను స్పీకర్ గా ఇప్పటికే ఎంచుకోవడం గమనార్హం.

Also Read: Jagan – Nampally Court: నాంపల్లి కోర్టుకు జగన్.. భారీగా తరలొచ్చిన వైసీపీ శ్రేణులు.. రప్ప రప్ప పోస్టర్ల ప్రదర్శన

ఎన్డీఏకు రికార్డు విజయం

ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికల్లో జేడీయూ – బీజేపీ (JDU – BJP) నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. మెుత్తం 243 స్థానాలకు గానూ ఏకంగా 202 సీట్లు గెలుచుకుంది. ఇందులో బీజేపీ 89, జేడీయూ 85, ఎల్జేపీ 19 స్థానాల్లో విజయ దుందుభి మోగించాయి. ప్రతిపక్ష మహాగఠ్ బంధన్ (Mahagathbandhan) కూటమికి కేవలం 35 సీట్లు మాత్రమే వచ్చాయి. అందులోని ఆర్జేడీ (RJD) 25 సీట్లు సాధించగా.. కాంగ్రెస్ (Congress) కేవలం 6 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సీపీఎం 2, సీపీఐ 1, ఐఐపీ 1 స్థానంలో విజయం సాధించాయి.

Also Read: Khammam Brutal Murder: ఖమ్మం నడిబొడ్డున ఘోరం.. భార్యను హత్య చేసి.. కూతురుపై దారుణంగా..

Just In

01

Bandla Ganesh: సుద్దపూస.. బండ్ల న్యూ అవతార్ చూశారా? డీజే కొట్టు మామా!

Naga Vamsi: ఆరేళ్ళ తర్వాత నాకు సంతృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది..

Harsha Vardhan: వస్త్రధారణ అనేది స్వేచ్ఛలో ఒక అంశం మాత్రమే.. శివాజీ, అనసూయ కాంట్రవర్సీలోకి హర్ష!

IMDB 2026: ఐఎండిబి 2026లో మోస్ట్ ఎవైటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్ ఇదే..

Huzurabad: హుజురాబాద్ పురపాలక సంఘం పరిధిలో.. వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితా విడుదల!