Hidma Encounter: కేంద్ర ప్రభుత్వానికి, వివిధ రకాల భద్రతా బలగాలకు నిత్యం సవాల్ విసురుతూ మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా పేరుపొందిన హిడ్మా ఎప్పుడు కూడా లొంగిపోతానని చెప్పలేదు. దండకారణ్యంలో తన హవాను కొనసాగిస్తూ ఎంతోమంది పోలీసులు, భద్రతా బలగాలను తన వ్యూహ చాతుర్యంతో మట్టు పెట్టాడు. వ్యూహం రచించాడు అంటే అటు వైపు ఉన్న వారు ఎవరైనా తల వంచాల్సిందే. అలాంటి వ్యూహకర్త లొంగిపోతానని ఏ రోజు కూడా తన మనసులో కానీ, నోటి వెంట రాలేదు. ఆదివాసీల హక్కుల కోసం గతంలో నలుగురు మాత్రమే పోరాడారు. ఆ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న హిడ్మా కూడా జల్, జమీన్, జంగల్ లక్ష్యంగా తన గమ్యాన్ని సాగించాడు. దండకారణ్యంలో అణువణువు తెలిసిన తాను ఎప్పుడూ కూడా పోలీసులకు కానీ ప్రభుత్వాలకు కానీ తలపంచలేదు.
లేఖాస్త్రం ఉత్తిదే..
మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఆంధ్రప్రదేశ్ లోని మామిడి మిల్లి అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ లో మృతి చెందాక హిడ్మా రాసిన లేఖ అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ లేఖ ను స్వయంగా హిడ్మా రాశాడనే పుకార్లు షికారులు చేస్తున్నాయి. లొంగిపోయేంత అధైర్య పడేంత పిరికివాడు కాదని ఆదివాసి సమాజానికి మొత్తం విధితమే. అలాంటిది హిడ్మా లేఖ రాశాడు అనేది అవాస్తవం.
కేంద్ర, ఛత్తీస్‌గఢ్ భద్రతా బలగాల మూకుమ్మడి తోనే కకావికలం
గత మూడు సంవత్సరాలుగా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా కొన్ని ఆపరేషన్ కార్యక్రమాలను మావోయిస్టులను అంతం చేసేందుకు ప్రణాళిక రచించారు. నాటి నుంచి మావోయిస్టులకు పోలీసులకు ఎదురు కాల్పులు జరిగిన ప్రతిసారి పోలీసులు కొంతమంది ప్రాణాలను కోల్పోతూ వచ్చారు. మావోయిస్టుల ఎత్తుగడలను చిత్తు చేయడానికి వ్యూహరచనలను ఆచరణ సాధ్యంలో పెట్టారు. రెండేళ్ల నుంచి మావోయిస్టులకు నష్టం కలిగించే దిశగా ప్రయత్నాలు సాగిస్తూ వస్తున్నారు. చతిస్గడ్ రాష్ట్రంలోని బీజాపూర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో అబూజ్ మాడ్ మావోయిస్టులకు స్వర్గధామం. కానీ పోలీసులు ఆ ప్రాంతం నుంచే వేటాడడం మొదలుపెట్టారు.
Also Read: Hidma Encounter: ఏపీలో సంచలనంగా మారిన హిడ్మా మరణం.. హిడ్మా చంపాలనుకున్న నాయకుడెవరు.?
నలు దిక్కుల నుండి భద్రతా బలగాల దాడులు
ఛత్తీస్‌గఢ్ ష్ట్రంలో నలుదిక్కుల నుండి మావోయిస్టులను అణగదొక్కేందుకు ప్రణాళికలు రచిస్తూ వస్తున్నారు. 2024 చివర్లో కేంద్ర, చత్తీస్గడ్ ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ మొదలుపెట్టారు. అక్కడి నుంచి మావోయిస్టులకు ఏదో రకమైన దెబ్బ తగులుతూనే ఉంది. ఈ క్రమంలో చత్తీస్గడ్.. తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు కర్రెగుట్టల ప్రాంతానికి మావోయిస్టులు చేరుకున్నారని వేల మంది భద్రతా బలగాలను కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దించింది. అక్కడ కూడా మావోయిస్టులు పై చేయి సాధించి తమ ఉనికిని చాటుకున్నారు. ఆ తర్వాత మావోయిస్టులను ఏరి వేసే పనిలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమై తమ కార్యకలాపాలను మొదలుపెట్టింది. ఈ క్రమంలో మావోయిస్టులు పరిస్థితి కకావికలమైంది.
భారీ విధ్వంసం చేయడానికి ఆంధ్రాకు హిడ్మా దళం
ఒకవైపు భద్రతా బలగాలు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దండకారణ్య ప్రాంతాలను చుట్టుముడుతో ఎన్కౌంటర్లతో మావోయిస్టులను మట్టు పెడుతున్నారు. మరోవైపు మందు గుండు సామాగ్రిని సైతం స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశారు. ఇంకోవైపు నమ్ముకున్న సహచరులు కూడా లొంగిపోయేందుకు సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలోనే దండకారణ్యంలో మనుగడ సాగించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మారేడుమిల్లి మావోయిస్టు సెంటర్ జోన్ లో కొంతకాలం కార్యకలాపాలను నిలిపివేయాలనుకొని హిడ్మా దళం తో పయనమైంది.
నూతన టెక్నాలజీ చిక్కులో పడి ఎన్కౌంటర్
మావోయిస్టుల కదలికలను, ముఖ్యంగా మోస్ట్ వాంటెడ్ హిడ్మా కదలికలపై అత్యాధునికమైన నూతన టెక్నాలజీ చిక్కులో పడి ఎన్కౌంటర్ లో హిడ్మా మృతి చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా తనతోపాటు ఎంతో నమ్మకంగా ఉన్న సహచరులు కూడా మారేడుమిల్లి అడవి ప్రాంతంలో మృతిచెందాల్సి వచ్చింది.
మిగిలింది ఎంతమంది
మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యులు నంబాల కేశవరావు మృతిచెందగా మల్లోజుల వేణుగోపాలరావు, తక్కెళ్ళపల్లి వాసుదేవరావు పెద్ద ఎత్తున మావోయిస్టులతో లొంగిపోయారు. చిన్న చిత్క మావోయిస్టులు కూడా పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు క్యూ కట్టారు. తాజాగా మోస్ట్ వాంటెడ్ హిడ్మా తో పాటు మొత్తం 13 మంది మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇంకా ఎంతమంది మావోయిస్టులు మిగిలారు. వారిలో ఎంతమంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు అనే దిశగా భద్రత బలగాలు శోధన చేస్తున్నాయి.
దేవ్ జి, ఆజాద్ ఎక్కడ
మావోయిస్టు పార్టీలో నూతనంగా నియమించబడిన కేంద్ర కమిటీ సభ్యుడు, పోలిట్ బ్యూరో సభ్యులు దేవ్ జి, కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్ జాడ ఎక్కడ అనే దిశగా భద్రతా బలగాలు ఆరా తీస్తున్నాయి.
ముగిసిన శకం… ఆస్కార్ చర్చ
మావోయిస్టు పార్టీలో ఎన్నో ఎత్తుగడలకు వ్యూహకర్తగా తన సాహసోపేతమైన నిర్ణయాలతో భద్రతా బలగాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ ముగిసిన శకంగానే అవుతుందా..? అని మేధావి వర్గాలు భావిస్తున్నారు. ప్రస్తుతం మావోయిస్టు పరిస్థితి పై ఆస్కార్ చర్చలు సాగుతున్నాయి.
మావోయిస్టుల్లో మరో కొత్త కోణం
మావోయిస్టులో మరో కొత్త కోణం కనిపించనుంది. ఇన్నాళ్లు అడవుల్లో ఆయుధాలు పెట్టి ప్రజల కోసం పోరాడిన మావోయిస్టులు నేడు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. కేంద్ర కమిటీ సభ్యులు, పోలీస్ బ్యూరో మాజీ సభ్యులు మల్లోజుల వేణుగోపాల్, మరో కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న అలియాస్ తక్కల్లపల్లి వాసుదేవరావు పలుమార్లు మీడియా సమావేశంలో ఆయుధాలు మాత్రమే విడిచాము. ప్రజల కోసం ప్రజాస్వామ్య యుతంగా ఒక్కతాటిపైకి వచ్చి పోరాడుతాం అంటున్నారు. సిపిఐ సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీల లాగానే మావోయిస్టు పార్టీ కూడా ప్రజల కోసం ప్రజల అవసరాల కోసం న్యాయపరంగా పోరాడుతామని వెల్లడిస్తున్నారు.
Also Read: Fertility Centers: ఫెర్టిలిటీ సెంటర్లపై సర్కార్ ఫుల్ సీరియస్.. మూడు సెంటర్ల సీజ్!

