Shah Rukh Khan: అభిమాన తారలకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా, వారి అభిమానులకు అపూర్వమైనదే. అందుకే అభిమానించే తారలకు సంబంధించి ఏ చిన్న విషయమైనా, వారి అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటారు. అలాగే ఇప్పుడు దశాబ్దాలుగా బాలీవుడ్‌ను ఏలుతున్న కింగ్ ఖాన్ (King Khan) షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)కు సంబంధించి ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. ఈ వార్త ప్రకారం షారుఖ్.. కేవలం నటనలో మాత్రమే కాదు, చదువులోనూ బ్రిలియంట్ స్టూడెంటే అనేది తెలుస్తుంది. అదెలా అనుకుంటున్నారా..? తాజాగా ఆయన కాలేజీ మార్క్ షీట్ (Marksheet) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మార్క్ షీట్ చూస్తే అందరూ షారుఖ్ బ్రిలియంట్ స్టూడెంట్ అని ఒప్పుకోవాల్సిందే. ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధంగా ఉన్న ‘హన్స్‌రాజ్ కాలేజీ’ (Hansraj College)లో చదువు పూర్తి చేసిన షారుఖ్ ఖాన్‌కు సంబంధించిన మార్క్ షీట్ ఇది.
Also Read- Chikoti Praveen: నీ పతనం ఖాయం.. రాజమౌళిపై చికోటి ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు
మార్క్ షీట్‌లో షాకింగ్ స్కోర్స్
ప్రస్తుతం వైరల్ అవుతున్న మార్క్ షీట్, షారుఖ్ ఖాన్ అకాడమిక్ ప్రతిభను స్పష్టంగా చూపిస్తోంది. ఇందులో ఆయన తండ్రి పేరు మీర్ తాజ్ మొహమ్మద్ అని ఉంది. 100 మార్కులకు గాను నాలుగు సబ్జెక్టుల్లో షారుఖ్ సాధించిన స్కోర్లు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా, ఆ కాలంలో (1980వ దశకంలో) ఇలాంటి స్కోర్లు సాధించడం అంత సులభం కాదనేలా కామెంట్స్ పడుతున్నాయంటే.. ఆయన చేసిన స్కోర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మొదటి సబ్జెక్ట్‌లో ఆయనకు వచ్చిన 92 మార్కులను చూస్తుంటే.. అప్పట్లో ఆయన ఎంతటి చురుకైన విద్యార్థో తెలుస్తోంది. మార్క్ షీట్ ప్రకారం షారుఖ్ ఖాన్ స్కోర్లు (100కి) ఎలెక్టివ్ సబ్జెక్ట్‌లో 92, ఇంగ్లీష్‌లో 51, మ్యాథ్స్‌లో 78, ఫిజిక్స్‌లో 78 మార్కులు వచ్చాయి. ఈ మార్కులు చూసిన అభిమానులు… కింగ్ ఖాన్ నటుడిగానే కాకుండా, కాలేజీలోనూ ‘కింగ్’ గానే ఉన్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read- Manchu Lakshmi: ఆ పని చేయకపోతే మహేష్, నమ్రతలను కొడతా.. మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్
‘కింగ్’ (King)గా రాబోతున్న షారుఖ్
షారుఖ్ ఖాన్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, ఆయన తన తదుపరి బిగ్ ప్రాజెక్ట్ ‘కింగ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ హై-ఆక్టేన్ యాక్షన్ డ్రామాలో దీపికా పదుకొణె, రాణీ ముఖర్జీ, అభయ్ వర్మ వంటి భారీ తారాగణం నటిస్తోంది. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ కూడా కీలక పాత్రలో నటించనున్నారు. సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ (గౌరీ ఖాన్, మమతా ఆనంద్), మార్ఫ్లిక్స్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో షారుఖ్ ఒక పవర్ ఫుల్ డాన్‌గా కనిపించనున్నారని తెలుస్తోంది. అభిషేక్ బచ్చన్ ఇందులో విలన్‌గా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ముంబై, వార్సా వంటి ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకుంటోందని, 2026లో విడుదల ఉంటుందనేలా మేకర్స్ తెలుపుతున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
