Chikoti Praveen: హనుమంతుడిపై ‘వారణాసి గ్లోబ్ ట్రాటర్’ (Varanasi Globe Trotter Event) ఈవెంట్‌లో రాజమౌళి (SS Rajamouli) చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారిన విషయం తెలిసిందే. రాజమౌళి వ్యాఖ్యలపై ఇప్పటికే రాష్ట్రీయ వానర సేన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు బీజేపీ నేతలు డైరెక్ట్‌గా వార్నింగ్ ఇస్తున్నారు. రాజమౌళిని ఉద్దేశిస్తూ.. తాజాగా బీజేపీ నేత చికోటి ప్రవీణ్ (Chikoti Praveen) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాజమౌళికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు చికోటి ప్రవీణ్. ‘మదం ఎక్కిన ఏనుగు మురికి కాల్వలో పడ్డట్టు రాజమౌళి తీరు ఉందని, వెంటనే రాజమౌళి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, లేదంటే హిందూ సమాజం నిన్ను క్షమించదు’ అంటూ చికోటి ప్రవీణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘దేవుడి పేరుతో, దేవుడిపైనే సినిమా తీసి డబ్బులు సంపాదించే నీవు ఇలా మాట్లాడటం తగదు? దేవుడిని నమ్మని నీవు సినిమా ప్రారంభానికి ముందు పూజ ఎందుకు చేస్తావు? నీవు అహంకారంతో ఇలాగే వెళ్తే నీ పతనం ఖాయం’ అంటూ చికోటి ప్రవీణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ మేరకు చికోటి ప్రవీణ్ విడుదల చేసిన వీడియోలో..
Also Read- Ibomma Ravi: ఐబొమ్మ రవిపై సినిమా.. వీడెవడో మరో వర్మలా ఉన్నాడే!
ఓన్లీ నాస్తిక కుక్కలతోటే సినిమాలు చెయ్..
‘‘మదమెక్కిన ఏనుగు మురికి కాల్వలో పడ్డదట.. ఆ విధంగా ఉంది ఎస్ ఎస్ రాజమౌళి కథ. ఈరోజు రాజమౌళి అద్భుతమైన డైరెక్టర్ అని అందరూ ఎంతగానో అభిమానిస్తారు. కానీ, మొన్న ఆయన చేసిన ఒక్క స్టేట్‌మెంట్‌తో హిందూ సమాజంలో ఆయనపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. నేను కూడా రాజమౌళిని ప్రశ్నిస్తున్నా.. నువ్వు దేవుడిని నమ్మకపోతే నమ్మకు. కానీ, నీ ప్రతి సినిమాకు ముందు పెద్ద ఎత్తున పూజ చేసి, ప్రారంభోత్సవం చేస్తావు కదా.. అది ఎందుకు చేస్తున్నావ్? ఆల్రెడీ దేవుడి కథలతో నువ్వు అడ్డగోలుగా డబ్బులు సంపాదించావని అందరూ విమర్శలు చేస్తున్నారు. అది వాస్తవమే కదా. మరి హిందూ సమాజం నీ సినిమాలు చూడకపోతే, ఓన్లీ నాస్తిక కుక్కలతోటే నువ్వు సినిమా చెయ్యి. ఓన్లీ నాస్తిక కుక్కలనే నీ సినిమా చూడడానికి అనుమతి ఇవ్వు. హిందువులు నీ సినిమా చూడకపోతే.. నీ బతుకు ఏమైతది? నువ్వు ఏమైతవో కూడా ఆలోచించాలి.
Also Read- Manchu Lakshmi: ఆ పని చేయకపోతే మహేష్, నమ్రతలను కొడతా.. మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్
నీ బతుకు హీరో నుంచి జీరో..
నీ బాహుబలి (Bahubali) సినిమాలో కూడా చెప్పావు కదా.. ‘అహంకారంతో వీర్రవీగే భళ్లాలదేవ చివరికి ఎలా పతనమయ్యాడో?’ నువ్వే చూపించావు కదా. మరి ఇవాళ నువ్వు కూడా అదే అహంకార ధోరణితో పోతే మాత్రం నీ పతనం కూడా ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ.. హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఎవరైనా ప్రయత్నం చేస్తే మాత్రం బిడ్డ.. బాగుండదు. అందుకు నువ్వు చాలా రకాలుగా సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని.. ఈ సందర్భంగా తెలియజేస్తూ, వెంటనే నువ్వు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన తరుణమిది. లేదంటే, నువ్వొక హిందూ ద్రోహిగా, విద్రోహిగా ఈ సమాజంలో మిగిలిపోతావు. నీకు ఎంత టాలెంట్ ఉన్నా కూడా అది పనిచేయదు. ఒక్కసారి హిందూ సమాజం విధ్వేషిస్తే.. నీ బతుకు హీరో నుంచి జీరో అవుతుందని తెలియజేస్తూ.. వెంటనే నువ్వు క్షమాపణలు చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా’’ అని చికోటి ప్రవీణ్ ఈ వీడియోలో రాజమౌళికి వార్నింగ్ ఇచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
