Sports | ఆట తీరుపై ఫైర్‌
Fire On Kohli Style Of Play
స్పోర్ట్స్

Sports: ఆట తీరుపై ఫైర్‌

Fire On Kohli Style Of Play: టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి పేలవమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం 66 రన్స్‌ మాత్రమే చేసి దారుణంగా ఫ్యాన్స్‌ని నిరాశపరిచాడు. ఇంగ్లండ్‌తో సెమీఫైనల్‌కు ముందు భారత క్రికెట్‌ ప్యాన్స్‌ను విరాట్‌ ఫామ్‌ కలవరపెడుతుంది.

సెమీస్‌లో అయినా విరాట్‌ బ్యాట్‌ ఝులిపించాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఒకవేళ విరాట్‌ ఇదే పేలవ ఫామ్‌ను కొనసాగిస్తే టీమిండియా విజయావకాశాలు భారీగా దెబ్బతింటాయి. విరాట్‌ ఎలాగైనా ఫామ్‌లోకి రావాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాగా ప్రస్తుత ప్రపంచకప్‌లో రోహిత్‌కు జతగా విరాట్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగారు. ఓపెనర్‌గా ప్రమోషన్‌ లభించాక విరాట్‌ ఐపీఎల్‌ తరహాలో రెచ్చిపోతాడని అంతా అనుకున్నారు.

Also Read: సరికొత్త రికార్డు

అయితే విరాట్‌ పేలవ ఫామ్‌న ప్రదర్శిస్తూ అందరినీ నిరాశపరుస్తున్నారు. ఐపీఎల్‌ 2024లో భీకర ఫామ్‌లో ఉండిన విరాట్‌ దేశం తరఫున ఆడాల్సి వచ్చే సరికి తేలిపోతుండటంతో అతడి వ్యతిరేకులు ఫైర్ అవుతున్నారు. ఏకంగా విరాట్‌ను జట్టు నుంచి తప్పించాలని డిమాండ్లు చేస్తున్నారు. విరాట్‌ స్థానంలో యశస్వి జైస్వాల్‌, సంజూ శాంసన్‌లకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. విమర్శకుల నోళ్లు మూయించాలంటే విరాట్‌ కీలకమైన సెమీస్‌లో ఎట్టి పరిస్థితుల్లో ఫామ్‌లోకి రావాలి.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..