Manya Anand: తమిళ టెలివిజన్ నటి మన్యా ఆనంద్ చేసిన ఆరోపణలు కోలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి. ప్రముఖ నటుడు ధనుష్ మేనేజర్ శ్రేయాస్ తనపై కాస్టింగ్ కౌచ్‌కు సంబంధించిన ఒత్తిడి తీసుకువచ్చాడని ఆమె తెలిపారు. ఇటీవల ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మన్యా ఈ విషయాలను బయట పెట్టారు.
మర్యాదల పేరుతో ” కమిట్‌మెంట్ ” కోరారని, అదే సమయంలో తనను ప్రొఫెషనల్ లైన్స్ దాటి వెళ్లేలా ఒత్తిడి చేసినట్టు మన్యా తెలిపారు. “ఎలాంటి కమిట్‌మెంట్? నేను ఎందుకు ఇవ్వాలి?” అని ప్రశ్నించగా, తన మాటలను పట్టించుకోకుండా పలు మార్లు సంప్రదించాడని ఆమె ఆరోపించారు.
మన్యా చెప్పిన ప్రకారం, తన సమాధానంతో సంతృప్తి చెందని శ్రేయాస్ “ ధనుష్ సర్‌కైనా మీరు ఒప్పుకోరా?” అని ప్రశ్నించినట్టు తెలిపింది. ఆమె క్లారిటీగా ‘NO’ చెప్పినా, ఆయన పలు మార్లు మళ్లీ సంప్రదించాడని పేర్కొన్నారు. అంతేకాకుండా, ధనుష్ ప్రొడక్షన్ హౌస్ ‘వండర్‌బార్ ఫిలింస్’కు సంబంధించిన లొకేషన్ వివరాలు, ఒక స్క్రిప్ట్ కూడా పంపినట్టు వెల్లడించారు. అయితే ఆమె ఆ స్క్రిప్ట్‌ను చదవలేదని అన్నారు.
“మేము నటులం.. పని కోరండి, ఇంకా మా నుంచి వేరే దాన్ని ఆశించొద్దు”
తన అభ్యంతరాన్ని క్లారిటీగా తెలియజేస్తూ మన్యా ఇలా .. “మేము కళాకారులం. పని చేస్తాం. పని కోసం మాత్రమే మమ్మల్ని సంప్రదించాలి. దానికి బదులుగా వేరే ఆశలు పెట్టుకోవద్దు. అలాంటి వాటికి ఒప్పుకుంటే మాకు వేరే పేర్లు వస్తాయి. ఈ రకమైన ప్రవర్తనను గుర్తించి సరిచేయాల్సిన సమయం వచ్చింది” అని చెప్పింది.
నటి మన్యా ఆనంద్ ఎవరు?
ప్రముఖ తమిళ్ సీరియల్‌తో మన్యా ఆనంద్ మంచి గుర్తింపు పొందారు. అంతే కాకుండా.. రాజా రాణి రోరర్ రాకెట్ సినిమాలో కూడా కనిపించారు. తనకు ఎదురైన అనుభవాన్ని బయటపెట్టడం ద్వారా, ఇండస్ట్రీలో జరుగుతున్న ఇలాంటి ఘటనలు వెలుగులోకి తేవాలని భావిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొనే సమస్యలపై ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
