Indiramma Sarees (imagecredit:twitter)
తెలంగాణ

Indiramma Sarees: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం..!

Indiramma Sarees: రాష్ట్రంలో కోటి మంది మహిళలకు చీరలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పష్టం చేశారు. ఇందిరమ్మ చీరల పంపిణీపై మంగళవారం మంత్రి సీతక్కతో కలిసి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరను అందించాలని సూచించారు. ఇవాళ ఇందిరా గాంధీ జయంతి(Indira Gandhi’s birth anniversary)ని పురస్కరించుకొని చీరల పంపిణీని ప్రారంభిస్తున్నారు. వీటిని పూర్తిగా సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేస్తున్నారు.

దశల వారీగా పంపిణీ

ఉత్పత్తి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా రెండు దశలుగా చీరల పంపిణీ చేపట్టాలని సీఎం అధికారులకు సూచించారు. తొలి దశలో గ్రామీణ ప్రాంతాల్లో చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందిరా గాంధీ జయంతి నుంచి డిసెంబరు 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. రెండవ దశలో పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women’s Day) వరకు పంపిణీ పూర్తి చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో చీరల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, మహిళలకు నాణ్యమైనవి అందించాలని స్పష్టం చేశారు. సాంకేతికను వినియోగించుకుని ఇందిరమ్మ చీరల పంపిణీ పారదర్శకంగా జరిగేలా చూడాలని, ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.

Also Read: Mahabubabad District: రాజ్యాంగ రక్షణకై దళితుల ఆత్మగౌరవం కోసం ఢిల్లీలో మహాధర్నా..!

నేడు మధ్యాహ్నం..

ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు నెక్లెస్ రోడ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం దగ్గర నివాళులు అర్పించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ చీరల పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం సెక్రటేరియట్ నుంచి గ్రామీణ ప్రాంత మహిళలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖిగా మాట్లాడుతారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందుబాటులో ఉన్న కలెక్టరేట్ల నుంచి వీడీయో కాన్ఫరెన్స్‌లో పాల్గొనాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క, సీఎం సెక్రెటరీ మాణిక్ రాజ్, ప్రిన్సిపల్ సెక్రెటరీ హ్యాండ్లూమ్స్ శైలజా రామయ్యర్, ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎన్ శ్రీధర్, సెర్ప్ సీఈవో డీ దివ్య, తదితరులు పాల్గొన్నారు.

Also Read: BJP Flex Dispute: బీజేపీలో ముదిరిన ‘పవర్ వార్’.. ఈటల అడ్డాలో బండి సంజయ్ వర్గం ఏం చేస్తోందంటే?

Just In

01

Parineeti Chopra: తన కుమారుడికి ఎవరూ ఊహించని పేరు పెట్టిన బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా.. అర్థం ఏంటంటే?

CM Revanth Reddy: ఇందిరమ్మ జయంతి స్పెషల్.. కోటి చీరల పంపిణీపై.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

Malaysia Glowing Roads: స్ట్రీట్‌లైట్ రీప్లేస్‌మెంట్‌గా వచ్చిన గ్లోయింగ్ రోడ్ల ప్రయోగం మలేషియాలో ఎందుకు ఫెయిలైంది?

Maoist Encounter: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. హిడ్మా రైట్‌ హ్యాండ్‌ టెక్‌ శంకర్‌ ఎన్కౌంటర్..!

Fertility Centers: ఫెర్టిలిటీ సెంటర్లపై సర్కార్ ఫుల్ సీరియస్.. మూడు సెంటర్ల సీజ్!